నవంబర్ 1901లో లండన్‌లోని స్టాన్లీ సైకిల్ షోలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి బైక్ ని విడుదల చేసింది. అయితే 120వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్650, కాంటినెంటల్ జిటి650 120వ వార్షికోత్సవ ఎడిషన్‌ను పరిచయం చేసింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్ 120వ వార్షికోత్సవ ఎడిషన్ బైక్‌లు లిమిటెడ్ ఎడిషన్ మాత్రమే, మొత్తంగా కేవలం 480 యూనిట్లు మాత్రమే విక్రయించనుంది. ప్రపంచవ్యాప్తంగా 480 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే 120 యూనిట్లు (60 - ఇంటర్‌సెప్టర్ అండ్ 60 - కాంటినెంటల్ జిటి) భారతదేశం, యూరప్, అమెరికా, ఆగ్నేయాసియాకు కేటాయించింది.
విశేషమేమిటంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్ 120వ వార్షికోత్సవ ఎడిషన్ మోడల్ ప్రత్యేకమైన రిచ్ బ్లాక్-క్రోమ్ ఫ్యూయల్ ట్యాంక్‌తో వస్తుంది. బైక్ ఇతర భాగాలు ఇంజన్ అండ్ ఎగ్జాస్ట్ వంటివి పూర్తిగా నలుపు రంగులో అందించారు. ఈ మోడల్స్ ఫ్లైస్క్రీన్, ఇంజన్ గార్డ్, హీల్ గార్డ్ ఇంకా మరెన్నో ఒరిజినల్ యాక్సెసరీలతో అమర్చబడి ఉంటాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 అండ్ కాంటినెంటల్ జిటి650 120వ ఎడిషన్ మోడల్‌లు హ్యాండ్‌క్రాఫ్ట్, డై-కాస్ట్ బ్రాస్ ఫ్యూయల్ ట్యాంక్ బ్యాడ్జ్‌ను పొందుతాయి. ఇవి చేతితో పేయింట్ చేసిన పిన్‌స్ట్రైప్‌లను కూడా కలిగి ఉంటాయి. ఫ్యూయల్ ట్యాంక్ టాప్ బ్యాడ్జ్‌లో ప్రత్యేకమైన సీరియల్ నంబర్ అండ్ సైడ్ బాడీ ప్యానెల్‌లపై ప్రత్యేక డెకాల్ ఉంటుంది.
భారతదేశంలో నేడు ఈ బైక్స్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్ 120వ ఎడిషన్ మోడల్ 6 డిసెంబర్ 2021న ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.