ఈ రాశులవారు నోరు తెరిస్తే అబద్ధాలే చెబుతారు..!

First Published | May 19, 2023, 10:07 AM IST

అబద్ధం చెప్పి అయినా, శాంతి పరచాలని వీరు అనుకుంటూ ఉంటారు. వీరు అబద్దాలు చెబుతారు, కానీ చాలా మంచి ఉద్దేశంతోనే అలా చేస్తారు. 
 

నిజం పక్కనే అబద్ధం ఉంటుంది. కొందరు సరదా కోసం అబద్ధం చెబుతారు. మరి కొందరు అవసరం కోసం అబద్ధం చెబుతారు. కారణం ఏదైనా అబద్దాలు చెప్పేవారు మన చుట్టూ చాలా మందే ఉన్నారు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులవారు కూడా నోరు తెరిస్తే అబద్ధమే చెబుతారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దామా..

telugu astrology


1.మిథున రాశి..

మిథున రాశివారు ద్వంద్వ స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశివారు ఎక్కువగా అబద్దాలు చెబుతూ ఉంటారు. పాజిటివ్ ని కూడా నెగిటివ్ చేయగలరు. అసత్య ప్రచారం చేయడంలో ముందుంటారు. తమకు అనుకూలంగా మార్చి అబద్ధాలు అల్లేస్తారు. ఎవరు ఎంత చెప్పినా, వీరు తాము చేయాలి అనుకున్నదే చేస్తారు.


telugu astrology

2.తుల రాశి..
వారు ఎల్లప్పుడూ పరిస్థితిని తటస్థంగా ఉంచాలని కోరుకుంటారు. వారు గొడవలు జరగడాన్ని ఇష్టపడరు. శాంతిని కాపాడటం కోసం వీరు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అబద్ధం చెప్పి అయినా, శాంతి పరచాలని వీరు అనుకుంటూ ఉంటారు. వీరు అబద్దాలు చెబుతారు, కానీ చాలా మంచి ఉద్దేశంతోనే అలా చేస్తారు. 

telugu astrology

3.వృశ్చిక రాశి...
ఈ రాశివారు చాలా సీక్రెట్స్ మొయింటైన్ చేస్తారు.  వారి నిజమైన ఉద్దేశాలను దాచిపెట్టే నేర్పు ఉంది. వారు సమాచారాన్ని తిరిగి ఉంచడానికి ప్రయత్నిస్తారు. పట్టుబడితే, వారు తమ అనుకూలతను బట్టి పరిస్థితిని వివరించడం ద్వారా తమను తాము సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తారు. వారు ఇతరులను కూడా తారుమారు చేస్తారు.

telugu astrology

4.ధనస్సు రాశి..

ఈ రాశివారు సాహసాలను ఇష్టపడతారు. చాలా ఉల్లాసంగా ఉంటారు. వీరు అబద్ధం చెప్పినా, అది కూడా నిజంలానే ఉంటుంది. అబద్దాలను కూడా చాలా అందంగా చెప్పేయగలరు. అందరి ముందు తమను తాము ఆసక్తికరంగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి వీరు అబద్దాలను చెబుతూ ఉంటారు. ఒకానొక స్టేజ్ లో వీరి అబద్దాలతో జనాలు విసుగుచెందుతారు.
 

telugu astrology

5.మీన రాశి..
మీన రాశివారు చాలా సున్నితంగా ఉంటారు. చాలా సహజంగా ఉంటారు. వీరు ఎక్కువ సేపు నిజంలో బతకలేరు. వాస్తవ ప్రపంచాన్ని తట్టుకునే శక్తి వీరిలో లేదు. అందుకే దాని నుంచి తప్పించుకోవడానికి అవాస్తవ ప్రపంచంలోకి అడుగుపెడతారు. అబద్దాలతో జీవితం గడిపేస్తారు. నిజాలను వీరు తట్టుకోలేరు. 

ఈ రాశుల వారు చాలా నిజాయితీపరులు

మేషం, వృషభం, కర్కాటకం, సింహం, కన్య, మకరం, కుంభరాశి వారు చాలా నిజాయితీపరులు. అబద్ధాలు చెప్పడం తృణీకరించుకుంటారు. వారు అబద్ధాలు చెప్పమని ఇతరులను ఎప్పటికీ ప్రోత్సహించరు ఎందుకంటే వారు దానిని పూర్తిగా ద్వేషిస్తారు.

Latest Videos

click me!