ముత్యాలు ధరిస్తే... ఈ రాశులవారికి సమస్యలు తప్పవు..!

First Published | Jul 27, 2024, 3:34 PM IST

స్త్రీలకు ముత్యాలంటే అమితమైన ప్రేమ ఉంటుంది. కానీ.. ఈ ముత్యాలను కూడా అందరదూ ధరించకూడదట. ఏ రాశివారు.. ఈ ముత్యాలను ధరిస్తే.. వారు సమస్యలు ఎదుర్కోవాలిసి వస్తుందో  తెలుసుకుందాం. 

నవరత్నాల్లో ముత్యాలు ఒకటి. ఈ నవరత్నాలు.. జోతిష్యశాస్త్రం ప్రకారం.. మన జీవితాలపై చాలా ప్రభావం చూపిస్తాయి. అందుకే.. ఈ నవరత్నాల్లో దేనిని ధరించాలన్నా.. జోతిష్యుడి సూచనలేకుండా ఎవరూ ధరించరు. పొరపాటున తెలీక ధరిస్తే... చాలా నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. ముత్యాలు కూడా అంతే. చాలా మందికి ముఖ్యంగా స్త్రీలకు ముత్యాలంటే అమితమైన ప్రేమ ఉంటుంది. కానీ.. ఈ ముత్యాలను కూడా అందరదూ ధరించకూడదట. ఏ రాశివారు.. ఈ ముత్యాలను ధరిస్తే.. వారు సమస్యలు ఎదుర్కోవాలిసి వస్తుందో  తెలుసుకుందాం. 
 

telugu astrology

మిథున రాశి..
మిథున రాశివారు ముత్యాలు ధరించకుండా ఉండటమే మంచిది. ఈ రాశివారు ముత్యాలు ధరించడం వల్ల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.  మొదలుపెట్టిన పని కూడా మధ్యలోనే ఆగిపోతాయి. ఆ పనులు పూర్తి చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసిరావచ్చు.


telugu astrology

మకర రాశి..
మకర రాశివారు కూడా ముత్యాలు ధరించకపోవడమే మంచిది. ఈ రాశివారికి ముత్యాలు పెద్దగా కలిసిరావు.  ఈ రాశివారు తెలిసో, తెలియక ముత్యాలు ధరిస్తే.... వారికి ఆర్థిక సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక సమస్యలు మాత్రమే కాదు... ఇతర సమస్యలు కూడా బాగా పెరిగిపోయే ప్రమాదం ఉంది.

telugu astrology

కుంభ రాశి..
కుంభ రాశిని శనిదేవుడు పాలిస్తూ ఉంటాడు. శని దేవుడికి నీలం, నలుపు రంగులు అంటే ఎక్కువ ఇష్టం. కుంభ రాశివారు ముత్యాలు ధరించడం వల్ల.. శనిదేవుని ఆగ్రహానికి గురయ్యే  అవకాశం ఎక్కువగా ఉంది.  వీరు పొరపాటున ముత్యాలు ధరిస్తే...  దీనివల్ల సుఖాలు, సౌభాగ్యాలు తగ్గుతాయి. ముత్యాలు ధరించడం వల్ల మానసిక సమస్యలు కూడా పెరుగుతాయి. అందువల్ల పొరపాటున కూడా ముత్యాలు ధరించవద్దు.

Latest Videos

click me!