
1.మేష రాశి....
మేష రాశి వారిని ఎక్కువగా మిథున రాశి, సింహ రాశి, ధనస్సు రాశి వారు ఎక్కువగా ఇష్టపడతారు. మేష రాశివారి వ్యక్తిత్వం ఈ రాశివారికి విపరీతంగా నచ్చుతుంది. వెంటనే ప్రేమలో పడిపోతారు.
2.వృషభ రాశి...
వృషభ రాశివారిని వృశ్చిక రాశి, మకర రాశివారు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రాశివారిని చూసి వృశ్చిక రాశి, మకర రాశివారు మైమరచిపోతారు. వారి ఆలోచనలను మరింతగా ప్రేమిస్తారు.
3.మిథున రాశి...
మిథున రాశివారిని తుల రాశి, ధనస్సు రాశి, మీన రాశివారు అమితంగా ప్రేమిస్తారు. మిథున రాశివారిలో ఉన్న సరదా తనానికి వీరు దాసోహం అయిపోతారు.
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారిని సింహ రాశి, వృషభ రాశి, కన్య రాశివారు విపరీతంగా ప్రేమిస్తారు. వీరి మనసుకు, వీరి వ్యక్తిత్వానికి ఫిదా అయిపోతారు.
5.సింహ రాశి..
సింహ రాశివారిని మేష రాశి, సింహ రాశివారు ఎక్కువగా ప్రేమిస్తారు. సింహ రాశివారి వ్యక్తిత్వాన్ని ఎక్కువగా... అదే సింహ రాశివారు లేదంటే... మేష రాశివారు మాత్రమే అర్థం చేసుకోగలరు.
6.కన్య రాశి...
కన్య రాశివారిని మకర రాశి వారు, కుంభ రాశివారు చాలా త్వరగా ప్రేమలో పడిపోతారు. కన్య రాశివారికి ప్రతి విషయంలోనూ పర్ఫెక్షనిజమ్ చాలా అవసరం. ఆ స్వభావమే... మకర, కుంభ రాశులవారిని ఆకర్షిస్తుంది.
7.తుల రాశి...
తుల రాశివారిని కర్కాటక , వృశ్చిక రాశి, మీన రాశివారు అమితంగా ప్రేమిస్తారు. న్యాయానికి తుల రాశి వారు ఇచ్చే విలువ ఈ రాశుల వారిని ఆకర్షిస్తుంది.
8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారిని వృషభ, కన్య, కుంభ రాశివారు ఎక్కువగా ప్రేమిస్తారు. అమితంగా ఇష్టపడతారు. వారి వ్యక్తిత్వం ఈ రాశులవారిని కట్టిపడేస్తుంది.
9.ధనస్సు రాశి...
ధనస్సు రాశివారిని మేష రాశి, మిథున రాశివారు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రాశివారిలో లక్షణాలు కొన్ని.... మేష, మిథునంలోనూ ఉంటాయి. అందుకే... వీరి మధ్య ప్రేమ తొందరగా చిగురిస్తుంది.
10.మకర రాశి..
మకర రాశివారిని వృషభ, మీన రాశివారు అమితంగా ఇష్టపడతారు. మకర రాశివారికి ఉన్న కమిట్మెంట్స్, కెరీర్ పై ఉన్న ఫోకస్... ఇలా ప్రతి విషయం వీరిని ఎక్కువగా ఆకర్షించేలా చేస్తుంది.
11.కుంభరాశి...
కుంభ రాశివారిని మిథున రాశి, కర్కాటక , మీన రాశివారు ఎక్కువగా ఆకర్షితులౌతారు. కుంభ రాశివారులో ఉన్న క్రియేటివ్ థింకింగ్ కి వీరు ఫిదా అయిపోతారు.
12.మీన రాశి..
మీన రాశివారిని వృషభ, కర్కాటక, మీన రాశివారు వెంటనే ప్రేమలో పడిపోతారు. వీరి ఫ్యాషినేట్, సెన్సిటివ్ నేచర్ కి ఎవరైనా ఇట్లే ఫిదా అయిపోవాల్సిందే.