హిందూమతంలో ప్రతిదానికీ ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ఈ నియమాలలో ఒకటి గోర్లను కత్తిరించడం గురించి కూడా ఉంది. మీరు గమనించారో? లేదో.. కానీ పెద్దలు కొన్ని రోజుల్లో గోర్లను కట్ చేయకూడదని చెప్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. కూడా గోర్లను కొన్ని రోజుల్లో అసలే కట్ చేయకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. మరి ఏయే రోజుల్లో గోర్లను కట్ చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మంగళవారం నాడు..
శాస్త్రాల ప్రకారం.. మంగళవారం నాడు గోర్లను కట్ చేయడం నిషిద్ధం. ఎందుకంటే దీన్ని అశుభంగా భావిస్తారు. మంగళవారం నాడు ఉపవాసం ఉన్నవారు ఈ రోజున గోర్లను కత్తిరించడం మానుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఆర్థిక స్థితి
మంగళవారం నాడు గోర్లను కట్ చేయడం వల్ల.. అప్పుడు తీసుకునే పరిస్థితి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు మంగళవారం నాడు గోర్లను కట్ చేసే వారి ఆర్థిక పరిస్థితి కూడా క్షీణిస్తుందట. అందుకే మీరు ఆర్థికంగా బాగుండాలనుకుంటే మంగళవారం నాడు గోర్లను కట్ చేయడం మానుకోండి.
శనివారం..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. శనివారం నాడు కూడా గోర్లను కట్ చేయకూడదు. ఈ రోజు జుట్టును కూడా కట్ చేయొద్దని చెప్తారు. అయితే ఈ రోజు గోర్లను కట్ చేస్తే శనిదేవునికి కోపం వస్తుందట. దీంతో మీరు ఎన్నో సమస్యల బారిన పడొచ్చు.
పురాణాల ప్రకారం.. జాతకంలో శని బలహీనంగా ఉంటే.. శనివారం నాడు గోర్లను కత్తిరించకూడదు. ఒకవేళ మీరు ఈ రోజు గోర్లను కట్ చేస్తే మానసిక, శారీరక క్షోభ కలుగుతుంది.
గురువారం
వాస్తు ప్రకారం.. గురువారం నాడు గోర్లను పొరపాటున కూడా కట్ చేయకూడదు. ఎందుకంటే ఈ రోజు గోర్లను కట్ చేయడం వల్ల మీ వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతాయి.
ఆదివారం నాడు..
శాస్త్రాల ప్రకారం.. ఆదివారం నాడు గోర్లను కట్ చేయడం మానుకోవాలి. ఎందుకంటే ఇది మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. అంతేకాదు ఇది మీ ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్నిచూపుతుంది. అలాగే మీ విజయ మార్గానికి అడ్డుపడుతుంది.
గోర్లను ఎప్పుడు కట్ చేయాలి?
శాస్త్రాల ప్రకారం.. గోర్లను సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో కట్ చేయొచ్చు. ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజుల్లో గోర్లను కట్ చేయడం వల్ల మీకు ధనలాభం కలగుతుంది. అలాగే మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది.