ఉదయాన్నే నిద్రలేచి రోజంతా మంచిగా ఉండేలా ఏదైనా చేయాలని మన పెద్దలు చెప్తుంటారు. అయితే మనలో చాలా మంది ఉదయం నిద్రలేవగానే అద్దాన్నే చూసుకుంటారు. అద్దంలో చూసుకుని జుట్టును సరిచేసుకున్న తర్వాతే బయటకు వెళతారు. కానీ నిద్రలేచిన వెంటనే అద్దాన్ని చూడటం వల్ల రోజంతా పాడవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి పొద్దున్నే నిద్రలేవగానే అద్దం చూస్తే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నెగెటివ్ ఎనర్జీ
రాత్రిపూట మన శరీరం నెగిటివ్ ఎనర్జీ గుప్పిట్లో ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఉదయం నిద్రలేవగానే అద్దంలో ముఖం చూడకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.
నెగెటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది
జ్యోతిష శాస్త్రం ప్రకారం.. ఉదయం పూట సోమరితనంతో అద్దాన్ని చూడటం వల్ల మీ శరీరంలోని నెగెటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. దీంతో ఆ రోజంతా మీరు ఏ పని చేసినా పూర్తి కాదు.
జీవితకాల సంక్షోభం
శాస్త్రాల ప్రకారం.. ఉదయం నిద్ర లేవగానే.. అద్దం చూసే ఏ వ్యక్తి అయినా జీవితంలో సంక్షోభాలను ఎదుర్కోక తప్పదు.
శరీరంపై చెడు ప్రభావాలు
జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం.. ఉదయం నిద్ర లేవగానే అద్దం చూడటం వల్ల మీ శరీరంపై చెడు ప్రభావం పడుతుంది. అందుకే ఉదయం నిద్రలేవగానే అద్దాన్ని మాత్రం చూడకండి.
Mirror
నీడ చూడకూడదు
మత విశ్వాసాల ప్రకారం.. మీరు ఉదయం లేవగానే అద్దాన్నే కాదు.. వ్యక్తుల నీడను కూడా చూడకూడదు. ఇలా చూడటం అశుభంగా భావిస్తారు.
అద్దంలో ఎప్పుడు చూడాలి
పురాణాల ప్రకారం ఉదయం లేవగానే అద్దం వైపు చూడకూడదు. దీన్ని అశుభంగా భావిస్తారు. కానీ స్నానం చేసిన తర్వాత అద్దం చూడటం శుభప్రదంగా భావిస్తారు.
ధ్యానం చేయడం
శాస్త్రాల ప్రకారం ఉదయం లేవగానే ధ్యానం చేయండి. ఇది మీకు మంచి మేలు చేస్తుంది. ఉదయం లేవగానే ధ్యానం చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో మీకు మంచి ఆలోచనలు వస్తాయి.