వారఫలాలు: ఓ రాశివారు నూతన వస్తు, వాహనాది కొనుగోలు

First Published May 28, 2023, 10:00 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం  వచ్చిన అవకాశములను చేజార్చకుండా అందిపుచ్చుకొనవలెను. సోదర సోదరీల తోటి మనస్పర్ధలు ఏర్పడగలవు. ఉద్యోగమునందు అధికారులతోటే సఖ్యతగా మెలగవలెను.

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీమాతా' జ్యోతిష్యాలయం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర

చతుర్దాధిపతి అయిన చంద్రుడు:- పంచమ స్థానము నందు సంచారం వలన మానసిక బాధలు పెరుగును. మాతృ వర్గం తోటి అనవసరమైన తగాదాలు ఏర్పడగలవు. వాహన ప్రయాణాలయందు జాగ్రత్తలు అవసరము. ఇతరుల యొక్క విషయాలలో మరియు మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండాలి. శుభకార్యాలలో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. సమాజము నందు అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పెరుగును. వారాంతంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సంఘమునందు కీర్తి ప్రతిష్టలు లభించును.

ఈ వారం అశ్విని నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
28-5-23/30-5-23/1-6-23/3-6-23

ఈ వారం   భరణి  నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
23-5-23/ 31-5-23/2-6-23

ఉద్యోగము నందు అధికారులతోటి సఖ్యతగా ఉండవలెనుఈ వారం   కృత్తిక    నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
28-5-23/30-5-23/1-6-23/3-6-23
 

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర

తృతీయాధిపతి అయిన చంద్రుడు:-బందోవర్గము తోటి అకారణ మనస్పర్ధలు ఏర్పడగలవు. చేయు పని వారితోటి సఖ్యతగా మెలగవలెను. ఆ కారణ కోపాలకు దూరంగా ఉండవలెను. స్థిరాస్తి విషయాలలో సమయస్ఫూర్తిగా వ్యవహరించవలెను. విందు వినోదాలలో పాల్గొంటారు. చేయు వ్యవహారమనందు చంచల మనస్తత్వం ఏర్పడి  ఆటంకాలు ఎదురౌతాయి. వచ్చిన అవకాశములను చేజార్చకుండా అందిపుచ్చుకొనవలెను. సోదర సోదరీల తోటి మనస్పర్ధలు ఏర్పడగలవు. ఉద్యోగమునందు అధికారులతోటే సఖ్యతగా మెలగవలెను. వారాంతంలో ఆరోగ్యం బాగుంటుంది. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు లభించును. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును.

ఈ వారం   కృత్తిక   నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
28-5-23/30-5-23/1-6-23/3-6-23

ఈ వారం   రోహిణి   నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
28-5-23/29-5-23. /31-5-23. /2-6-23

ఈ వారం   మృగశిర   నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
29-5-23/. 30-5-23/. 1-6-23/. 3-6-23

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:- 3-5-6
అనుకూలమైన వారములు॥ ఋధ -శుక్ర

ద్వితీయాధిపతి అయిన చంద్రుడు:-తృతీయ స్థానము నందు సంచారము అగుటవలన వ్యవహారము నందు మృదువుగా మాట్లాడుతూ వ్యవహారాన్ని చక్కపెట్టుకుంటారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితోటి ఆనందంగా గడుపుతారు. కొద్దిపాటి రుణాలు తీరి ప్రశాంతత లభించును. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. కుటుంబ అభివృద్ధి ఆనందం కలిగించును. భూ గృహ క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. ఆదాయ మార్గాలు బాగుంటాయి. వారాంతంలో సమాజము నందు అవమానాలు కలగవచ్చు. ఆరోగ్య సమస్యలుఎదురవుతాయి. మనసునందు భయాందోళనగా ఉండుట.
ఈ వారం  మృగశిర  నక్షత్రం వారికి శుభదినములు:-
29-5-23. /30-5-23. /1-6-23/  3-6-23

ఈ వారం  ఆరుద్ర   నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
28-5-23/30-5-23. / 31-5-23. /  2-6-23

ఈ వారం  పునర్వసు   నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు 29-5-23/31-5-23/ 1-6-23/ 3-6-23
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ

జన్మరాశి అధిపతి అయిన చంద్రుడు:- శారీరక శ్రమ పెరిగి శారీరక పటుత్వం తగ్గును. చేయు వ్యవహారమునందు సరైన ఆలోచన విధానాలు లేక ఆటంకాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు తగ్గును. ఇష్టం లేని పనులు చేయవలసి వస్తుంది. ప్రతి విషయంలో ఎదురు దెబ్బలు ఉంటాయి. మానసిక అశాంతి ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న తగు సమాజానికి ఏదో విధముగా ధనం సమకూరును. కారణం లేకుండా గానే ఇతరులతోటి విరోధములు ఏర్పడగలవు. అనుకున్న పనులు జరగక చికాకు పుట్టించును. వారాంతంలో కొద్దిపాటి మనఃచాంచల్యం ఉన్నా అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి తోటే ఆనందంగా గడుపుతారు.

ఈ వారం  పునర్వసు   నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు 29-5-23/31-5-23/ 1-6-23/ 3-6-23

ఈ వారం   పుష్యమి   నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
28-5-23/30-5-23 / 1-6-23 / 2-6-23

ఈ వారం  ఆశ్రేష   నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
29-5-23  / 31-5-23 /2-6-23 /3-6-23

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ

వ్యయాధిపతి అయిన చంద్రుడు:- జన్మరాశిలో సంచారం అగుట చేత శారీరక సుఖం లభిస్తుంది. ఆనందంగా గడుపుతారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు లభించును. చేయ ఖర్చు అనవసరతో ఖర్చులు లేకుండా సక్రమంగా చేస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. చేపట్టిన పనులలో మందగమనం కనపడిన పూర్తి అగును. ఉద్యోగమునందు అధికారుల యొక్క మన్ననలు పొందగలరు.తక్కువ శ్రమతో అధిక లాభాలు పొందగలరు. ఆర్థిక అభివృద్ధి అన్ని విధాల బాగుంటుంది. ఇతరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. వారాంతంలో అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్త వహించాలి. ఆరోగ్య సమస్యలు. పనులలో ఆటంకములు ఏర్పడగలవు.
ఈ వారం మఘ నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
28-5-23/30-5-23/1-6-23/3-6-23

ఈ వారం   పుబ్బ  నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
23-5-23/. 31-5-23/2-6-23

ఈ వారం   ఉత్తర   నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
28-5-23/30-5-23/1-6-23/3-6-23

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:-3-5-6
అనుకూలమైన వారములు॥ బుధ- శుక్రవారం

లాభాధిపతి అయిన చంద్రుడు:- వ్యయస్థానము నందు మరియు ద్వితీయ ధన స్థానము నందు సంచరించును ఈ సంచారం వలన ధనాధాయ మార్గాలు తగ్గను. వచ్చిన అవకాశములను చేజార్చుకుండా అందుపుచ్చుకొనవలెను. ఇతరుల మీద అసూయాద్వేశాలు కలగవచ్చు. మిత్రుల తోటి సఖ్యతగా ఉండవలెను. అనవసరమైన ఖర్చులు పెరుగును. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడగలవు. పూర్తి వ్యాపారంలో పెట్టుబడులు ఆచితూచి వ్యవహరించవలెను. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఊహించని రీతిలో ఖర్చులు ధన నష్టము ఏర్పడగలవు. ఇతరులతోటి జాగ్రత్తగా మెలగాలి. వారాంతంలో సంఘం నందు గౌరవం పెరుగును. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. మిత్రుల యొక్క ఆదరణ అభిమానాలు పొందగలరు.
ఈ వారం   ఉత్తర   నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
28-5-23/30-5-23/1-6-23/3-6-23

ఈ వారం   హస్త నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
28-5-23/29-5-23. /31-5-23. /2-6-23

ఈ వారం  చిత్త   నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
29-5-23/. 30-5-23/. 1-6-23/. 3-6-23

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ -గురు- శుక్ర

రాజ్యాధిపతి అయిన చంద్రుడు:-లాభ స్థానమునందు మరియు వ్యయ స్థానము నందు మరియు జన్మరాశిలో సంచారం చేయను. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చేయు వ్యవహారమునందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇతర నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. గతంలో చేసిన రుణాలు తీరుస్తారు. విద్యార్థులకు అనుకూలం. శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. వారం మధ్యలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొంటారు. అనవసరమైన ఖర్చులు ఏర్పడతాయి. వారాంతంలో శారీరక సుఖం లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం లభించును. మిత్రుల యొక్క ఆదరణ అభిమానాలు పొందుతారు.
ఈ వారం  చిత్త   నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
29-5-23/. 30-5-23/. 1-6-23/. 3-6-23

ఈ వారం  స్వాతి నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
28-5-23/30-5-23. / 31-5-23. /  2-6-23

ఈ వారం  విశాఖ  నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు 29-5-23/31-5-23/ 1-6-23/ 3-6-23

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ-గురు -శుక్ర

భాగ్యాధిపతి అయిన చంద్రుడు:-రాజ్య స్థానమునందు మరియు లాభ స్థానం  నందు వ్యయ స్థానము నందు సంచారం. ఈ సంచారం వలన మంచి ఫలితాలు పొందగలరు. ధనాధాయ మార్గాలు బాగుంటాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించును. స్థిరాస్తి వివాదములు తీరి ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారములు లాభసాటిక సాగును. వారం మధ్యలో శారీరక శ్రమ పెరుగుతుంది. ఉద్యోగము నందు అధికారుల యొక్క ఒత్తిడి పెరుగును. వారాంతంలో వచ్చిన అవకాశములను చేజార్చు కుండా చూసుకొనవలెను. సమాజము నందు అవమానాలు ఏర్పడతాయి. అనవసరమైన ఖర్చులు పెరుగును.
ఈ వారం  విశాఖ   నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు 29-5-23/31-5-23/ 1-6-23/ 3-6-23

ఈ వారం   అనూరాధ  నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
28-5-23/30-5-23 / 1-6-23 / 2-6-23

ఈ వారం  జేష్ట   నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
29-5-23  / 31-5-23 /2-6-23 /3-6-23

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ గురు -శుక్ర- మంగళ

అష్టమాధిపతి అయిన చంద్రుడు:-భాగ్య రాజస్థానము  లాభ స్థానం నందు సంచారం చేయను. మనస్సునందు ఆందోళనగా ఉండుట. కొన్ని సంఘటనలు వలన మానసిక ఉద్రేకతలు పెరుగును. ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు. సమాజమనందు ప్రతికూలత వాతావరణ. ఇతరులతోటి వివాదాల విరోధాలకు దూరంగా ఉండవలెను. ఇతరులపై చూడ అభిప్రాయం ఏర్పడగలదు. వ్యసనములకు దూరంగా ఉండవలెను. చెడుదారులకు తొక్కే అవకాశం. ఉద్యోగము నందు అధికారుల ఆగ్రహానికి గురి కావచ్చు. వారాంతంలో ధనధాన్యాది లాభం పొందగలరు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. అభివృద్ధి ఆలోచనలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడపగలరు.
ఈ వారం మూల నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
28-5-23/30-5-23/1-6-23/3-6-23

ఈ వారం  పూ.షాఢ నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
23-5-23/. 31-5-23/2-6-23

ఈ వారం  ఉ.షాఢనక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
29-5-23/. 31-5-23/2-6-23
 

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 2-3-6-8
అనుకూలమైన వారములు॥ ఆది -సోమ- శని

కళత్రాధిపతి అయిన చంద్రుడు:-ఆయు భాగ్య రాజ్యస్థానము నందు సంచరించును. ఈ సంచారము వలన శారీరక మానసిక అనారోగ్యం ఏర్పడగలదు. మానసికంగా భయాందోళనగా భార్య భర్తల మధ్య అవగాహన తగ్గి మనస్పర్ధలు ఏర్పడగలవు. ఆదాయానికి మించిన ఖర్చులు ఏర్పడతాయి. శారీరక శ్రమ పెరిగి శరీరము నందు అనారోగ్య అసౌకర్యానికి గురి కావడం. ప్రధానమునందు జాగ్రత్త వహించవలెను. అనవసర విషయాలలో జోక్యం చేసుకోకుండా కలహాలకు దూరంగా ఉండడం మంచిది. తలచిన పనులు ఆలస్యం అవుతుందని కంగారు పడకండి. సంతానం తోటి ప్రతికూలత వాతావరణం. శత్రువుల వలన అపకారం జరగవచ్చు. వారాంతంలో అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. గృహమునందు ప్రశాంతకరమైన వాతావరణం. ఉద్యోగమునందు అధికార అభివృద్ధి కలుగును.
ఈ వారం   ఉ.షాఢ   నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
28-5-23/30-5-23/1-6-23/3-6-23

ఈ వారం   శ్రవణం నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
28-5-23/29-5-23. /31-5-23. /2-6-23

ఈ వారం  ధనిష్ట  నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
29-5-23/. 30-5-23/. 1-6-23/. 3-6-23

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 1-2-6-8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ

షష్ఠమాధిపతి అయిన చంద్రుడు:-కళత్ర స్థానమునందు ఆయుః భాగ్య స్థానం నందు సంచారము వలన సమాజమ నందు కీర్తి ప్రతిష్టలు పెరుగును. మనసునందు ఆనందంగా ఉంటుంది.వైవాహక జీవతం ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. దూరపు ప్రయాణాలు కలిసి వస్తాయి.  నూతన ఉత్సాహంతోటి ముందుకు సాగుతారు. శత్రువులు అనిగి మనగి ఉంటారు. అన్ని సౌకర్యాలు సమకూరుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగును. సంప్రదాయాల పట్ల గౌరవం పెరుగుతుంది. గృహమునందు పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మిక పరిణామాలు ఆందోళన కలిగించును. వివాహ ప్రయత్నాలు ఫలించును.వారాంతంలో ఉద్యోగము నందు అధికారులతోటి కలహాలు ఏర్పడగలవు. సంతానం తోటి ప్రతికూలత వాతావరణం. అనవసరమైన ఖర్చులు పెరుగును.
ఈ వారం  ధనిష్ట  నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
29-5-23/. 30-5-23/. 1-6-23/. 3-6-23

ఈ వారం  శతభిషం నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
28-5-23/30-5-23. / 31-5-23. /  2-6-23

ఈ వారం  పూ.భాద్రనక్షత్రం వారికి అనుకూలమైన రోజులు 29-5-23/31-5-23/ 1-6-23/ 3-6-23

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ గురు- శుక్ర -మంగళ

పంచమాధిపతి అయిన చంద్రుడు:-శత్రు కళత్ర ఆయుః స్థానమునందు సంచరించును. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. చేయ వ్యవహారము నందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. ఎంతటి కష్టమైనా పరనైనా సులభంగా సాధ్యమవుతుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి
తక్కువ శ్రమతో అధిక లాభం పొందుతారు. కీలకమైన సమస్యలలో జీవిత భాగస్వామి యొక్క ఆలోచనలు తీసుకొనవలెను. వారాంతంలో మానసిక ఆవేదన పెరుగుతుంది. ఇతరులతోటి కలహాలకు విరోధాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగము నందు అధికారులతోటి విరోధాలు రాగలవు.

ఈ వారం  పూ.భాద్ర నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు 29-5-23/31-5-23/ 1-6-23/ 3-6-23

ఈ వారం   ఉ.భాద్ర నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
28-5-23/30-5-23 / 1-6-23 / 2-6-23

ఈ వారం  రేవతి నక్షత్రం వారికి అనుకూలమైన రోజులు
29-5-23  / 31-5-23 /2-6-23 /3-6-23

click me!