వారఫలాలు: ఓ రాశి వారికి వారాంతం లో స్త్రీ సౌఖ్యం, ఆరోగ్యం అనుకూలం

First Published Oct 22, 2023, 9:58 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు. కుటుంబము నందు సంతోషకరమైన వాతావరణం.


వార ఫలాలు : 22-10-2023 నుంచి 28-10-2023 వరకూ

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ... ఈ వారం  రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9

మేష రాశి వారికి ఈ వారం చతుర్దాది పతి అయిన చంద్రుడు రాజ్యస్థానము మరియు వ్యయస్థానమునందు సంచరించిను. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. విదేశీ ప్రయాణాలు ప్రయాత్నాలు ఫలించును. కోర్టు వ్యవహారాలు అనుకూలం ఉండును. అప్రయత్నంగా పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు. కుటుంబము నందు సంతోషకరమైన వాతావరణం. ఉద్యోగములో అధికారవృద్ధి పొందగలరు. వారాంతం లో  సమాజము నందు అవమానాలు కలగవచ్చు. తలపెట్టిన పనులలో ఆటంకములు ఏర్పడను.

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6

వృషభ రాశి వారికి ఈవారం తృతీయాధిపతి అయిన చంద్రుడు భాగ్యస్థానం  మరియు లాభ స్థానము నందు సంచరించిను. ఈ సంచారం వలన మిశ్రమ ఫలితాలు కలుగును. కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడిన విదేశీ ప్రయాణాలు ప్రయాత్నాలు ఫలించును. కుటుంబ అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. ఇతరులతో మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఉన్నత విద్య ఉద్యోగాలు ప్రయత్నాల ఫలించును. సమాజం నందు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అన్నదమ్ములతో కొద్దిపాటి విరోధాలు ఏర్పడగలవు. ఇరుగు పొరుగు వారి తోట సఖ్యతగా ఉండవలెను.దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాల గూర్చి ఆలోచనలు చేస్తారు. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. వారాంతం లో  స్త్రీ సౌఖ్యం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలించును. వృత్తి వ్యాపారాలలో ధనలాభం పొందగలరు.
 

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రములు
(కా-కి-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
మిథున రాశి వారికి ఈ వారం ధనాధిపతి అయిన చంద్రుడు అష్టమ స్థానము మరియు రాజ్యస్థానము నందు సంచారం.ఈ సంచారం వలన ప్రతికూల ఫలితాలు కలుగును. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరము. మానసిక ఆందోళన పెరుగును. జీవిత భాగస్వామి తో మనస్పర్ధలు రాగలవు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము.ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు రాగలవు. పరామర్శ చేయవలసి వస్తుంది.మానసిక ఆవేదనకు గురి అవుతారు. ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. వారాంతం లో  ఉద్యోగాల్లో అధికార అభివృద్ధి కలుగును.అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అగును.
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రములు
(హీ-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2

ఈ రాశి వారికి జన్మరాశ్యాధి పతి అయిన చంద్రుడు ఈ వారం కళత్ర స్థానము  మరియు  భాగ్యస్థానములో సంచారం. ఈ సంచారం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు.శారీరక పటుత్వం పెరుగుతుంది. మీ ఆలోచనలు ప్రణాళికలు ఆచరణలోకి తీసుకుని వస్తారు. ముఖ్యమైన కార్యాలలో సహోద్యోగులు సహాయ సహకారాలు లభిస్తాయి.సమాజంలో వాక్చాతర్యంతో ఇతరులను ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. సంతోషకరమైన ప్రయాణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం పొందగలరు. చేపట్టిన కార్యాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.వారాంతం లో  శారీరక పీడ. అనవసరమైన ఖర్చులు పెరుగును. చేయు పనులలో అలసత్వం పెరుగుతుంది. మానసిక భయాందోళన.
 

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రములు
(మా-మీ-మూ-మే-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1

సింహ రాశి వారికి ఈవారం వ్యయాధిపతి అయిన చంద్రుడు శత్రు స్థానం మరియు ఆయుః స్థానం లో సంచారము. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. మానసిక ఆందోళన తగ్గి ప్రశాంతత లభిస్తుంది.జీవిత భాగస్వామి తో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలంగా ఉండను.శుభవార్తలు వింటారు. ఖర్చు విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.ఈర్ష ద్వేషాలకు దూరంగా ఉండవలెను. నిజాయితీ సత్ప్రవర్తన అలవాటు చేసుకుంటారు. వ్యవహారాల్లో జాగరూకతతో నడుచుకోవాలి.గత కొద్దిరోజులుగా ఉన్న అనారోగ్య సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొంటారు. సమాజము నందు ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో పనులు సజావుగా పూర్తి చేయగలుగుతారు.వారాంతం లో  మానసిక ఉద్రేకతలు పెరుగును. ఆకస్మిక పరిణామాలు ఎదురవుతాయి. ఇతరులతోటి వాదోపవాదమునలకు దూరంగా ఉండటం మంచిది.

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రములు
(టో-పా-పి-పూ-షం-ణా-ఢ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
కన్య రాశి వారికి ఈవారం లాభాధిపతి అయిన చంద్రుడు పంచమ స్థానము  మరియు కళత్ర స్థానము లో సంచారము. ఈ సంచారము వలన వ్యతిరేక ఫలితాలుంటాయి. విందు వినోదాలలో పాల్గొనే వారు జాగ్రత్త అవసరము, అవమానాలు కలగగలవు. వ్యవహారాలలో బుద్ధి కుశలత తగ్గి  ఆటంకాలు ఏర్పడగలవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాల్లో అధికారులతోటి సఖ్యతగా ఉండవలెను.మానసికంగా భయంగా ఉండుట. చేయు కార్యాలలో నిరాశ స్పృహలకు గురి అవుతారు. జీవిత భాగస్వామి తో మనస్పర్ధలు రాగలవు. సమాజము నందు అవమానాలు కలగవచ్చు. వ్యవహారమంతా తికమకగా ఉండును.వారాంతం లో  సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పెరుగును. శరీర సౌఖ్యం లభిస్తుంది. సంతోషకరమైన ప్రయాణాలు చేస్తారు. వ్యాపారము లో ధన లాభం పొందగలరు.

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రములు
(రా-రి-రూ-రే-రో-త-తీ-తూ-తే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6

ఈ రాశి వారికి ఈవారం రాజ్యాధిపతి అయిన చంద్రుడు చతుర్థ స్థానము మరియు శత్రు స్థానం లో  సంచరించిను. ఈ సంచారం వలన ఇబ్బందులు కలుగును.వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. రావలసిన బాకీలు చేతికి అందక ఇబ్బందులు పడతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉండగలవు. ఆర్థిక ఒప్పందాల్లో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వ్యవహారములలో పెద్దల సహకారం లభిస్తుంది. మానసికంగా భయాందోళన గా ఉంటుంది. చేయు పనులలో బుద్ధి కుశలత తగ్గును. తలపెట్టిన కార్యాలలో ప్రతిబంధకాలు ఏర్పడగలవు. కుటుంబంలో పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను.వారాంతం లో  వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రములు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9

ఈ రాశి వారికి ఈ వారం భాగ్యాధిపతి అయిన చంద్రుడు తృతీయ స్థానము  మరియు పంచమస్థానం లో  సంచరించును. ఈ సంచారం వలన అనుకూల శుభ ఫలితాలు పొందగలరు. కీలకమైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొంతకాలముగా ఉన్న అనారోగ్య సమస్యలు తీరి ఉపసమనం పొందగలరు. వృత్తి వ్యాపారాలలో  ధనలాభం కలుగును. ఉద్యోగము నందు అధికారుల ఆదరాభిమానం మరియు అధికారం పొందుతారు. సమాజము నందు కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అన్ని విధాల ప్రయోజనకరంగా ఉంటుంది. వారాంతం లో అనవసరమైన ఖర్చులు చేయవలసిన వస్తుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగించును. అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
 

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3

ధనుస్సు రాశి వారికి ఈవారం అష్టమాధిపతి అయిన చంద్రుడు ధన స్థానము  మరియు మాతృ స్థానము లో చంద్రసంచారం. ఈ సంచారము వలన కొద్దిపాటి ఇబ్బందులు కలుగును. అనవసరమైన ఖర్చులు పెరుగును. అకారణంగా బంధు వర్గముతో విరోధాలు రాగలవు. వ్యాపార నిమిత్తం తెచ్చుకున్న వస్తువులు చెడిపోయి నష్టం రాగలదు .కుటుంబంలో కలహాలు వలన మానసిక ఆవేదనకు గురి అవుతారు. అనేక రకమైన క్రూరమైన ఆలోచనలు కలుగును. నమ్మిన వారి వలనే మోసం జరిగే ప్రమాదం. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు రాగలవు.సమాజం నందు అపనిందలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకు పుట్టించును.వారాంతం లో నూతన వస్తు ఆభరణాలు లభించును. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అన్ని విధాల ప్రయోజనకరంగా ఉంటుంది.ధైర్య సాహసాలతో కీలకమైన సమస్యలను పరిష్కరించుకుంటారు.
 

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8

మకర రాశి వారికి ఈవారం కళత్రాధిపతి అయిన చంద్రుడు జన్మ రాశి లో మరియు తృతీయ స్థానము నందు సంచరించును. ఈ సంచారము వలన శుభ ఫలితాలు పొందగలరు.తలపెట్టిన కార్యాలలో మిత్రుల సహాయ సహకారాల తోటి పూర్తి చేయగలుగుతారు .  సంఘములో కీర్తి ప్రతిష్టలు పెరుగును. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం లభిస్తుంది. శత్రువులపై పై చేయి సాధిస్తారు.తలచిన కార్యాలలో విజయం లభిస్తుంది. నూతన వస్తు వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. కీలకమైన సమస్యలు పరిష్కారమగును.ఆర్థిక మరియు కుటుంబ విషయాలలో అభివృద్ధి కనబడుతుంది. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు.వారాంతం లో అనవసరమైన ఖర్చులు పెరుగును. అనారోగ్య సమస్యలు రాగలవు. సమాజం లో అపనిందలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకు పుట్టించును.
 

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8

కుంభ రాశి వారికి ఈవారం షష్ఠమాధిపతి అయిన చంద్రుడు వ్యయస్థానం  మరియు ధన స్థానము నందు  మరియు తృతీయ స్థానము లో సంచరించును. ఈ సంచారము వ్యతిరేక ఫలితాలు కలుగును. ఆర్థిక ఇబ్బందులు ఎదురవగలవు. అకారణంగా బంధు వర్గముతో విరోధాలు రాగలవు. కుటుంబంలో కలహాలు వలన మానసిక ఆవేదనకు గురి అవుతారు. అనేక రకమైన క్రూరమైన ఆలోచనలు కలుగును. నమ్మిన వారి వలనే మోసం జరిగే ప్రమాదం.ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు రాగలవు.సమాజము నందు ప్రతికూలత వాతావరణ. కొన్ని సందర్భాల్లో మిత్రుల వలన నష్టము కలగవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి.వారాంతం లో  నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు.
 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు
(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3

మీన రాశి వారికి ఈవారం పంచమాధిపతి అయిన చంద్రుడు లాభ స్థానము మరియు జన్మరాశి  లో సంచారము. ఈ సంచారము వలన శుభ ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం కలుగుతుంది. ప్రయత్నించిన కార్యాలలో విజయం సాధిస్తారు. కొద్ది రోజులుగా పడుతున్న అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది. భూ గృహ క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. సమాజములో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం పొందగలరు. ఉద్యోగమునందు అధికారుల అభిమానాలు పొందగలరు. అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు.వారాంతం లో  సమాజము లో అవమానాలు కలగవచ్చు. తలపెట్టిన పనులలో ఆటంకములు ఏర్పడను
 

click me!