సాయంత్రం ఇంటి గుమ్మం దగ్గర ఎందుకు కూర్చోకూడదు?

First Published Feb 13, 2024, 2:00 PM IST

ఇంటి గుమ్మం దగ్గర సాయంత్రం పూట నిలబడకూడదని, కూర్చోకూడదని ఇంటి పెద్దలు ఎప్పుడూ చెప్తుంటారు. ఇలా ఎందుకు చెప్తారని ఎవరైనా ఆలోచించారా? కానీ దీనికి ఒక బలమైన కారణం ఉంది తెలుసాఝ అదేంటంటే? 

వాస్తు శాస్త్రంలో.. ఇంటికి చాలా నియమాలను పెట్టారు. వీటిని పాటించడం చాలా చాలా ముఖ్యం. నియమాలను పాటించకపోతే వాస్తు దోషాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని జ్యోతిష్యులు చెప్తార. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం.. సాయం పూట ఇంటి గుమ్మం మీద కూర్చోకూడదు. మన అమ్మమ్మలు, నానమ్మలు ఈ మాటను చెప్పడం కూడా వినే ఉంటారు. ఎందుకు సాయంత్రం వేళ గుమ్మం దగ్గర కూర్చోకూడదంటారో తెలుసా?
 

సాయంత్రం ఇంటి గుమ్మంలో కూర్చోవడం ఎందుకు నిషిద్ధం? 

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి ద్వారం లక్ష్మీదేవికి సంబంధించినది.  అంటే సాయంత్రం వేళ లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. అలాంటి సమయంలో ఇంటి గుమ్మం దగ్గర కూర్చుంటే లక్ష్మీదేవి తిరిగి వెలిగిపోతుందట. అందుకనే సాయంత్రం పూట గుమ్మం దగ్గర కూర్చోకూడదని పెద్దలు చెప్తారు. పురాణ విశ్వాసాల ప్రకారం.. ఇంటి గుమ్మం దగ్గర కూర్చోవడం వల్ల పేదరికం వస్తుంది. అలాగే ఇంట్లో ప్రతికూల శక్తి కూడా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి సాయంత్రం వేళ ఇంటి గుమ్మం దగ్గర కూర్చోకూడదు. 
 

Latest Videos


బూట్లు, చెప్పులను గుమ్మం ముందు పెట్టకూడదు

మత విశ్వాసాల ప్రకారం.. ఇంటి గుమ్మం ముందు చెప్పులు, బూట్లను పెట్టకూడదు. ఎందుకంటే ఇది లక్ష్మీదేవిని అవమానించినట్టే అవుతుంది. అలాగే అమ్మవారు ఇంటి నుంచి వెళ్లిపోతుందని నమ్ముతారు. దీని వల్ల ఇంట్లో డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. అంతేకాదు డబ్బు కూడా పోతుంది. 
 

గుమ్మం దగ్గర కూర్చొని గోర్లను కట్ చేయొద్దు.. 

ఇంటి గుమ్మంలో కూర్చున్న గోళ్లు కత్తిరించకూడదు. ఇది ఇంట్లో పేదరికానికి దారితీస్తుందని నమ్ముతారు. అలాగే ఇంటి గుమ్మంలో కూర్చొని మాంసాహారాన్ని తినడం కూడా నిషిద్ధంగా భావిస్తారు. అలాగే క్యాలెండర్లు లేదా గడియారాలు మొదలైనవి ఇంటి గుమ్మంపై వేలాడదీయకూడదు. దీనిని అశుభంగా భావిస్తారు.

click me!