Today Horoscope:ఓ రాశివారు ఈ రోజు వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం పొందుతారు

First Published Feb 27, 2024, 5:30 AM IST

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు..కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం. సమాజంలో  గొప్ప వారితో పరిచయం కలుగుతుంది. శుభకార్యాల ఆలోచనలు చేస్తారు. తలపెట్టిన పనుల్లో పట్టుదల చూపిస్తే పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.
 

27-2-2024 మంగళవారం మీ  రాశి ఫలాలు  (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతి
అశ్విని నక్షత్రం వారికి (దినాధిపతి రవి) అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.చిన్నపాటి ఆరోగ్య సమస్య

భరణి నక్షత్రం వారికి (దినాధిపతి కుజుడు) వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన యంత్రాధులతో జాగ్రత్త. వృత్తి వ్యాపారములు సామాన్యం.

కృత్తిక నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు) తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి కాగలవు. అధికారులుతో మన్ననలు పొందగలరు.వృత్తి వ్యాపారం లాభిస్తాయి

దిన ఫలం:-కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం. సమాజంలో  గొప్ప వారితో పరిచయం కలుగుతుంది. శుభకార్యాల ఆలోచనలు చేస్తారు. తలపెట్టిన పనుల్లో పట్టుదల చూపిస్తే పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల యొక్క కలయిక. ఓం శ్రీ మహా విష్ణువే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వ)
తారాధిపతి
రోహిణి నక్షత్రం వారికి  (దినాధిపతి శని) ప్రయత్న కార్యములకు ఆటంకములు కలగ గలవు. ఊహించని విధంగా అధిక ఖర్చులు అధికంగా ఉంటాయి.

మృగశిర నక్షత్రం వారికి (దినాధిపతి కేతువు ) అధికారులతో మనస్పర్ధలు. అకారణ కోపానికి దూరంగా ఉండాలి. విషయాలలో ఆవేశం తగ్గించుకొని వ్యవహరించాలి.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలలో ఊహించి ధన లాభం పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. పెద్దల పరిచయాలు కలిసి వస్తాయి. శుభ మూలకంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. నూతన వస్తు వాహన కొనుగోలు చేస్తారు. అందరితో స్నేహపూర్వకంగా నడుస్తూనే పనులు అనుకూలంగా మార్చుకుంటారు. కుటుంబ సౌఖ్యం లభించును.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఓం వాయు నందనాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతి
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి చంద్రుడు) రావలసిన బాకీలు వసూలు చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

పునర్వసు నక్షత్రం వారికి (దినాధిపతి బుధుడు) శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధన లాభం పొందగలరు.

దిన ఫలం:-తలపెట్టిన పనులు అతి సులువుగా పూర్తి చేస్తారు.నూతన పరిచయాలు కలిసి వస్తాయి. కుటుంబము లో ఆనందకరమైన వాతావరణం. ఆరోగ్యం అనుకూలించును.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఉద్యోగాలలో అధికారులు తో సత్సంబంధాలు మెరుగుపడతాయి.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ సంబంధిత పనులు సంతృప్తికరంగా ఉంటాయి. ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతి
పుష్యమి నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు) ముఖ్యమైన పనులను పూర్తి చేసుకుంటారు. బంధుమిత్రులతో అభిప్రాయాలను పంచుకుంటారు. ఆనందంగా గడుపుతారు.ధనలాభం

ఆశ్రేష నక్షత్రం వారికి (దినాధిపతి రాహు) అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పట్టుదలతో చేసిన పనులు పూర్తి కాగలవు.

దిన ఫలం:-శుభ కార్యం రూపేణ ధనాన్ని ఖర్చు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ధనలాభం పొందుతారు.గృహానికి సంబంధిత అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులన్నీ జయప్రదంగా చేస్తారు. సమాజంలో గౌరవ హోదాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగుతాయి.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.ఓం బృహస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాధిపతి
మఘ నక్షత్రం వారికి (దినాధిపతి రవి) అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.చిన్నపాటి ఆరోగ్య సమస్య

పూ.ఫ నక్షత్రం వారికి (దినాధిపతి కుజుడు) వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన యంత్రాధులతో జాగ్రత్త. వృత్తి వ్యాపారములు సామాన్యం.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు) తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి కాగలవు. అధికారులుతో మన్ననలు పొందగలరు.వృత్తి వ్యాపారం లాభిస్తాయి

దిన ఫలం:-కుటుంబంలో చికాకుగా ఉంటుంది. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి కాగలవు.తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడును. ఉద్యోగాలు లో అధికారులు తో సమస్యలు ఏర్పడగలవు.అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.సమాజంలో అపవాదము లు రాగలవు.మానసిక ఆందోళన గా ఉంటుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి.ఓం ఆదిత్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతి
హస్త నక్షత్రం వారికి  (దినాధిపతి శని) ప్రయత్న కార్యములకు ఆటంకములు కలగ గలవు. ఊహించని విధంగా అధిక ఖర్చులు అధికంగా ఉంటాయి.

చిత్త నక్షత్రం వారికి  (దినాధిపతి కేతువు ) అధికారులతో మనస్పర్ధలు. అకారణ కోపానికి దూరంగా ఉండాలి. విషయాలలో ఆవేశం తగ్గించుకొని వ్యవహరించాలి.

దిన ఫలం:-చేయు వ్యవహారములో స్థిరమైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బందులకు గురి అవుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.పాత బాకీలు వసూలు కాక ఇబ్బందులు పడతారు.భార్య భర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు.ప్రయత్నించే పనులు మధ్యలో నిలిచిపోవును.అధికారుల తో సమస్యలు రాగలవు.ఓం జనార్ధనాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాధిపతి
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి చంద్రుడు) రావలసిన బాకీలు వసూలు చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

విశాఖ  నక్షత్రం వారికి (దినాధిపతి బుధుడు) శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధన లాభం పొందగలరు.

దిన ఫలం:-ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు సమయానికి ధనం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో  శ్రమకు తగిన ఆదాయం వస్తుంది. స్త్రీ తో వివాదాలకు దూరంగా ఉండాలి. సమస్యలు ను మనోధైర్యంతో పరిష్కరించి కొని ముందుకు సాగుతారు. కృషికి తగిన గౌరవం గుర్తింపు లభించును. ఉద్యోగాలు  అనుకూలంగా ఉంటాయి. తలచిన కార్యములు అవలీలగా పూర్తి కాగలవు. ఓం రుద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
దినాధిపతి
అనూరాధ నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు) ముఖ్యమైన పనులను పూర్తి చేసుకుంటారు. బంధుమిత్రులతో అభిప్రాయాలను పంచుకుంటారు. ఆనందంగా గడుపుతారు.ధనలాభం

జ్యేష్ట నక్షత్రం వారికి (దినాధిపతి రాహు) అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పట్టుదలతో చేసిన పనులు పూర్తి కాగలవు.

దిన ఫలం:-కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. చేయు వ్యవహారాల్లో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగాలు లో చికాకులు సమస్యలు అధికమగును. మానసిక ప్రశాంతత లేకపోవడం.ఖర్చులను నియంత్రించుకోవాలి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం వలన అనేక ఇబ్బందులు కలుగును.  అనవసర విషయాలకు దూరంగా ఉండాలి.ఓం గం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతి
మూల నక్షత్రం వారికి  (దినాధిపతి రవి) అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.చిన్నపాటి ఆరోగ్య సమస్య

పూ.షా  నక్షత్రం వారికి (దినాధిపతి కుజుడు) వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన యంత్రాధులతో జాగ్రత్త. వృత్తి వ్యాపారములు సామాన్యం.

ఉ.షా నక్షత్రం వారికి  (దినాధిపతి గురుడు) తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి కాగలవు. అధికారులుతో మన్ననలు పొందగలరు.వృత్తి వ్యాపారం లాభిస్తాయి

దిన ఫలం:-మానసిక భయాందోళన గా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి .ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఏర్పడి నిలిచిపోవును. కుటుంబంలో ప్రతికూలత వాతావరణం.ఆరోగ్య సమస్యలు చిరాకు పుట్టిస్తాయి. వ్యవహారములో  ఓర్పు సహనం అవసరం.ఇతరులతో అకారణంగా కలహాలు రాగలవు.ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతి
శ్రవణం నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు) ముఖ్యమైన పనులను పూర్తి చేసుకుంటారు. బంధుమిత్రులతో అభిప్రాయాలను పంచుకుంటారు. ఆనందంగా గడుపుతారు.ధనలాభం

ధనిష్ఠ నక్షత్రం వారికి (దినాధిపతి కేతువు ) అధికారులతో మనస్పర్ధలు. అకారణ కోపానికి దూరంగా ఉండాలి. విషయాలలో ఆవేశం తగ్గించుకొని వ్యవహరించాలి.

దిన ఫలం:-చేసే పనిలో అధిక శ్రమ ఒడిదుడుకులు ఉంటాయి. సమాజంలో దుస్సంఘటన వలన మానసిక భయాందోళనకు గురి అవుతారు.ఆరోగ్యం సమస్యలు రాగలవు. ఉద్యోగాలలో అధికారులు తో సమస్యలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించును.వ్యాపారంలో నష్టం కలగవచ్చు. ఓం మృత్యుంజయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతి
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి చంద్రుడు) రావలసిన బాకీలు వసూలు చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

పూ.భా నక్షత్రం వారికి  (దినాధిపతి బుధుడు) శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధన లాభం పొందగలరు.

దిన ఫలం:-ఉద్యోగాలు లో ఒత్తిడి తగ్గించుకుని ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాల్లో అనుకోని లాభాలు పొందగలరు.బాకీలు వసూలు అవును. కొన్ని సమస్యలు పరిష్కార మగును. అలంకార వస్తువులు కొనుగోలు నిమిత్తం అధికంగా ఖర్చు చేస్తారు. శారీరక మానసిక చికాకులు ఏర్పడతాయి. సమాజంలో హోదా గౌరవం పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు.ఓం షణ్ముఖాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
దినాధిపతి
ఉ.భా  నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు) ముఖ్యమైన పనులను పూర్తి చేసుకుంటారు. బంధుమిత్రులతో అభిప్రాయాలను పంచుకుంటారు. ఆనందంగా గడుపుతారు.ధనలాభం

రేవతి నక్షత్రం వారికి (దినాధిపతి రాహు) అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పట్టుదలతో చేసిన పనులు పూర్తి కాగలవు.

దిన ఫలం:-చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు.ఆచితూచి ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది.వృత్తి వ్యాపారం లో లాభం కలుగుతుంది.గృహంలో ఆనందకరమైన వాతావరణం.బాకీలు వసూలు అవును.ఉత్సాహంగా ఆనందంగా గడుపుతారు.విలువైన వస్తు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఓం మహాలక్ష్మ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

click me!