daily horoscope 2023 New 10
27, అక్టోబర్ 2023, శుక్రవారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
పంచాంగం
తేది : 27 అక్టోబరు 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : దక్షిణాయణం
ఋతువు :- శరదృతువు
మాసం :- ఆశ్వయుజ మాసం
పక్షం :- శుక్ల పక్షం
వారము:- శుక్రవారం
తిథి:- చతుర్దశి తె.3.45 ని॥వరకు
నక్షత్రం:- ఉ.భా ఉ॥9.17 ని॥వరకు
యోగం:- వ్యాఘాతం ఉ॥6.03 ని॥వరకు హర్షణం తె.3.13 ని॥వరకు
కరణం:- గరజి సా॥4.46 వణిజి తె.3.45 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥6.17 ని॥వరకు పునః తె.5.45 ని॥ల
దుర్ముహూర్తం:-ఉ.08:17 ని॥ల ఉ.09:03 ని॥వరకు తిరిగి మ.12:07 ని॥ల మ.12.53 ని॥వరకు
వర్జ్యం:- రాత్రి 8.37 ని॥ల 10.07 ని॥వరకు
రాహుకాలం:-ఉ.10:30 ని॥ల మ.12:00 ని॥వరకు
యమగండం:- మ.3:00 ని॥ల సా.4:30 ని॥వరకు
సూర్యోదయం :- 6.00 ని॥ లకు
సూర్యాస్తమయం:- 5.29 ని॥ లకు
తారాబలం లో (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొన వలెను.
(ఈరోజు రేవతి నక్షత్రానికి తారాబలం చూపబడినది)
telugu astrology
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి (పరమైత్రతార)వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రాగలదు.ఖర్చులు పెరుగును. (ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని స్మరణ చేయుట మంచిది.)
భరణి నక్షత్రం వారికి (మిత్రతార)నూతన పరిచయాలు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు.(ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని స్మరణ చేయుట మంచిది.)
కృత్తిక నక్షత్రం వారికి (నైదనతార)మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. (ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)
దిన ఫలం:-ఉద్యోగం నందు అధికారులతో మిత్రత్వం ఏర్పడను.ఆదాయానికి మించి ఖర్చులు పెరుగును. ఆర్థికంగా ఇబ్బందులు రాగలవు . కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. మానసిక అశాంతి కలుగును.గృహము నందు చికాకగా నుండును. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. వృధా ప్రయాణాలు ఏర్పడగలవు. వాదోపవాదములకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు ఈ రాశి వారు ఓం షణ్ముఖాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
telugu astrology
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి (నైదనతార)మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. (ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)
రోహిణి నక్షత్రం వారికి (సాధన తార)రావలసిన సొమ్ము వసూలు అగును. మానసిక ప్రశాంతత లభించును.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. (అష్టలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)
మృగశిర నక్షత్రం వారికి (ప్రత్యక్తార) ఇతరుల తోటి అకారణంగా విరోధాలు . వ్యాపారము నందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.( ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయుట మంచిది)
దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. గృహము నందు అనుకూలమైన వాతావరణం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగం నందు బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు.సహోద్యోగుల సహకారం లభిస్తుంది. మానసికంగా శారీరకంగా ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం ధాన్యలక్ష్మియై నమః అనే జపించండి శుభ ఫలితాలు పొందండి.
telugu astrology
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (ప్రత్యక్తార)ఇతరుల తోటి అకారణంగా విరోధాలు . వ్యాపారము నందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.( ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయుట మంచిది)
ఆరుద్ర నక్షత్రం వారికి (క్షేమతార)సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును . ధన లాభం కలుగును.(ఓం త్రయంబకాయ నమః అని స్మరణ చేయుట మంచిది)
పునర్వసు నక్షత్రం వారికి (విపత్తార)వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును.ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయుట మంచిది)
దిన ఫలం:-అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. విద్యార్థులకు అనుకూలం. ఆర్థికంగా బాగుంటుంది. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వ్యవహారము నందు సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఉద్యోగము నందు అధికారుల ఆదర అభిమానాలు పొందగలరు. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
telugu astrology
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం.
పునర్వసు నక్షత్రం వారికి (విపత్తార) వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును.ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. ( ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయుట మంచిది)
పుష్యమి నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు ( ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని జపించడం మంచిది)
ఆశ్రేష నక్షత్రం వారికి (జన్మతార)శారీరక బాధలు పెరుగును. అధిక ఖర్చులు.తలపెట్టిన కార్యములలో ఆటంకములు. ( భాస్కరాయ నమః అని స్మరణ చేయుట మంచిది)
దిన ఫలం:-చేపట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తి అగును. వ్యాపారాలు లాభసాటిగా జరుగును. నూతన వ్యాపార ఆలోచనలు చేస్తారు. ఆదాయం మార్గాలు బాగుంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెద్దల సహకారంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తారు. వివాహాది శుభకార్యాలు లో పాల్గొంటారు. సంతాన విషయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీకృష్ణాయ నమః నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
telugu astrology
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు
(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (పరమైత్రతార)వాహన ప్రయాణనాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రాగలదు.ఖర్చులు పెరుగును. ( ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని స్మరణ చేయుట మంచిది.)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (మిత్రతార)నూతన పరిచయాలు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు.( ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని స్మరణ చేయుట మంచిది.)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (నైదనతార)మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. (ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)
దిన ఫలం:-ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్య ప్రయత్నాలు ఫలించును. నూతన వస్త్రాభరణాలు వాహనాది కొనుగోలు చేస్తారు. వ్యాపారములు సంతృప్తికరంగా ఉంటాయి. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. సంసార జీవితం ఆనందంగా ఉండను. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పెరుగును.ఈరోజు ఈ రాశి వారు ఓం కీర్తిలక్ష్మీయైనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
telugu astrology
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు
(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (నైదనతార)మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. (ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)
హస్త నక్షత్రం వారికి (సాధన తార)రావలసిన సొమ్ము వసూలు అగును. మానసిక ప్రశాంతత లభించును.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. (అష్టలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)
చిత్త నక్షత్రం వారికి (ప్రత్యక్తార)ఇతరుల తోటి అకారణంగా విరోధాలు . వ్యాపారము నందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.(ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయటం మంచిది)
దిన ఫలం:-అనవసరమైన వివాదాలు రావచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. శారీరకంగా మానసికంగా బలహీనంగా నుండును. కుటుంబ సభ్యులతోటి అకారణంగా విరోధాలు రాగలవు. ఉద్యోగ సంబంధ విషయాలలో ప్రతికూలత వాతావరణం. వృత్తి వ్యాపారములలో ధన నష్టం.సమాజము లో జరిగిన సంఘటన వలన మానసిక ఉద్రేకత పెరుగును. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. ఈరోజు ఈ రాశి వారు ఓం త్రయంబకాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
telugu astrology
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు
(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి (ప్రత్యక్తార)ఇతరులతోటి అకారణంగా విరోధాలు . వ్యాపారము నందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.(ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయుట మంచిది)
స్వాతి నక్షత్రం వారికి (క్షేమతార)సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును . ధన లాభం కలుగును.(ఓం త్రయంబకాయ నమః అని స్మరణ చేయుట మంచిది)
విశాఖ నక్షత్రం వారికి (విపత్తార)వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును.ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. ( దుర్గాయై నమః అని స్మరణ చేయుట మంచిది)
దిన ఫలం:-అనవసరమైన విషయాల యందు దూరంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తారు. బంధు మిత్రులతో విభేదాలు తలెత్తవచ్చు. చేయు పనులలో శ్రమాధికంగా ఉండును. అనవసరమైన ఆలోచనలు చేస్తారు. కీలకమైన సమస్యలను కుటుంబసభ్యులతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈరోజు ఈ రాశి వారు ఓం ఏకదంతాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
telugu astrology
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి (విపత్తార)వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును.ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (దుర్గాయై నమః అని స్మరణ చేయుట మంచిది)
అనూరాధ నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని జపించడం మంచిది)
జ్యేష్ట నక్షత్రము వారికి (జన్మతార)శారీరక బాధలు పెరుగును. అధిక ఖర్చులు.తలపెట్టిన కార్యములలో ఆటంకములు. (భాస్కరాయ నమః అని స్మరణ చేయుట మంచిది)
దిన ఫలం:-వాహన ప్రయాణాలు యందు జాగ్రత్త వహించాలి. రావలసిన బాకీలు చేతికి అందక ఇబ్బందులు పడతారు. బంధుమిత్రుల సహకారంతో తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉండగలవు. ఆర్థిక ఒప్పందాల్లో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యవహారములలో పెద్దల సహకారం లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
telugu astrology
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి(పరమైత్రతార)వాహన ప్రయాణనాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రాగలదు.ఖర్చులు పెరుగును. (ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని స్మరణ చేయుట మంచిది.)
పూ.షాఢ నక్షత్రం వారికి (మిత్రతార)నూతన పరిచయాలు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు.( ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని స్మరణ చేయటం మంచిది.)
ఉ.షాఢ నక్షత్రము వారికి (నైదనతార)మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. (ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)
దిన ఫలం:-ఉద్యోగం నందు అధికారుల తోటి సమస్యలు రాగలవు.ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.బంధు మిత్రులతో ఆకారణంగా విభేదాలు ఏర్పడగలవు.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును. చేయు పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. సమాజము నందు అవమానాలు కలగవచ్చు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. మానసిక భయాందోళన కలుగును. ఈ రాశి వారు ఈ రోజు ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
telugu astrology
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షాఢ నక్షత్రము వారికి (నైదనతార)మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. ( ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)
శ్రవణం నక్షత్రము వారికి (సాధన తార) రావలసిన సొమ్ము వసూలు అగును. మానసిక ప్రశాంతత లభించును.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ( అష్టలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)
ధనిష్ఠ నక్షత్రము వారికి (ప్రత్యక్తార)ఇతరుల తోటి అకారణంగా విరోధాలు . వ్యాపారము నందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.(ఈరోజు ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయుట మంచిది)
దిన ఫలం:-తలపెట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగం నందు అధికారుల యొక్క గౌరవం లభించును.రావలసిన బాకీలు వసూలు అగును. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఆర్థికంగా బాగుండును. కోర్టు కేసులు అనుకూలంగా ఉండును. ఈరోజు ఈ రాశి వారు ఓం సౌభాగ్య లక్ష్మీయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
telugu astrology
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి (ప్రత్యక్తార)ఇతరుల తోటి అకారణంగా విరోధాలు . వ్యాపారము నందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.( ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయుట మంచిది)
శతభిషం నక్షత్రం వారికి (క్షేమతార) సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును . ధన లాభం కలుగును.( ఓం త్రయంబకాయ నమః అని స్మరణ చేయుట మంచిది)
పూ.భాద్ర నక్షత్రం వారికి (విపత్తార)వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయటం మంచిది)
దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సమాజమనందు కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన ఆదాయ మార్గాలను అన్వేషణ చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉండును. సహోద్యోగుల సహాయ సహకారాలు లభించును. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం బృహస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
telugu astrology
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు
(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భాద్ర నక్షత్రం వారికి(విపత్తార)వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. ( ఓందుర్గాయై నమః అని స్మరణ చేయుట మంచిది)
ఉ.భాద్ర నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు ( ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని జపించడం మంచిది)
రేవతి నక్షత్రం వారికి (జన్మతార)శారీరక బాధలు పెరుగును. అధిక ఖర్చులు.తలపెట్టిన కార్యములలో ఆటంకములు. (భాస్కరాయ నమః అని స్మరణ చేయుట మంచిది)
దిన ఫలం:-సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి.వృథా ఖర్చులు అదుపు చేయాలి. వృత్తి వ్యాపారములందు ఆదాయం స్థిరంగా ఉండును. ఉద్యోగమునందు అధికారులతో సఖ్యతగా మెలగవలెను.ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరము.శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు భాస్కరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.