ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం

First Published May 26, 2023, 4:56 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

26  మే   2023, శుక్ర వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 
  
పంచాంగం:                                                                                                                                                                       
 
తేది :    26  మే 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ట మాసము
ఋతువు : గ్రీష్మ ఋతువు
పక్షం :-  శుక్ల పక్షం                                                                                   
వారము:-శుక్రవారం
తిథి :- సప్తమి తె.5.10 ని.వరకు
నక్షత్రం :- ఆశ్లేష రాత్రి 7.00 ని.వరకు
యోగం:- ధృతి సా॥5.43 ని.వరకు
కరణం:- గరజి సా॥4.09 వణిజి తె.5.10 ని.వరకు
అమృత ఘడియలు:- సా॥5.13 ని.ల 6.59 ని.వరకు
దుర్ముహూర్తం:ఉ.08:03 ని.ల ఉ.08:55 ని. వరకు తిరిగి మ.12:22 ని.ల మ.1.13ని. వరకు
వర్జ్యం:- ఉ॥6.34 ని.ల 8.21 ని.వరకు
రాహుకాలం:ఉ.10:30ని. నుండి మ.12:00ని. వరకు
యమగండం: మ.3:00ని. నుండి సా.4:30ని. వరకు
సూర్యోదయం :        5.29  ని॥లకు
సూర్యాస్తమయం:    6.24  ని॥లకు


సూర్యోదయానికిఉన్న నక్షత్రానికి తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వ్యవహరించవలెను.
                శుభ ఫలితాలు పొందండి.

              సర్వేజనాః సుఖినోభవంతు

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

భరణి నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

దిన ఫలం:-శత్రుమూలకముగా ఇబ్బందులు ఎదురవుతాయి. బంధుమిత్రులతో గాని కుటుంబ సభ్యులతో గాని వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. శారీరక మానసిక బలహీనత ఏర్పడగలదు. నూతన వ్యక్తుల తోటి మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వృత్తి వ్యాపారం నందు ఆశించిన ఫలితం పొందగలరు. ఈరోజు ఈ రాశి వారు ఓం నమః శివాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:- విలాసవంతమైన వస్తువులు వాహనాల కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు. ప్రభుత్వానికి సంబంధించిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి.వృత్తి, వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.సంఘంలో పెద్దవారిని కలుసుకుంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ రామాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు  (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

దిన ఫలం:- ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.దేవాలయ సందర్శనం.. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది.  వృత్తి వ్యాపారులకు ధనలాభం. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. బంధు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాలు పాల్గొంటారు.  ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని వివాదాలు పరిష్కరిస్తారు.ఈ రోజు ఈ రాశి వారు ఓం దక్షిణామూర్తయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:- అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. బంధుమిత్రులతోటి ఆనందంగా గడుపుతారు. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణము. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును. అభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ సందర్శన కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ప్రయాణము రీత్యా లాభం చేకూరును. ఆగిపోయిన వ్యవహారములు పరిష్కారం అగును.ఈ. ఈరోజు ఈ రాశి వారు ఓం హయగ్రీవాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)

ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

దిన ఫలం:- ఆనందకరమైన వార్తలు వింటారు. వృత్తి వ్యాపారం నందు రాణింపు కనపడుతుంది. చరకాల మిత్రులను కలుసుకుంటారు. సమాజం నందు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తి అగును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. రావలసిన బాకీలు వసూలు అగును. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మీ నమోస్తుతే అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

హస్త నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:- మీకంటే చిన్నవారి తోటి అవమానాలు ఏర్పడగలవు. మానసికంగా భయాందోళనగా ఉండును. మధ్యవర్తత్వానికి దూరంగా ఉండవలెను. భార్య భర్తల మధ్య అవగాహన లోపిస్తుంది. ఉద్యోగవనంలో అధికారులతోటి వివాదాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును.వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. తలపెట్టిన పనుల్లో మంద బుద్ధి ఏర్పడి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈరోజు ఈ రాశి వారు  ఓం మృత్యుంజయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు  (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

దిన ఫలం:- చేయి వ్యవహారము యందు కోపాన్ని అదుపులో ఉంచుకొని వ్యవహరించవలెను. ఉద్యోగము నందు పై అధికారులు తోటి ఒత్తిడిలు పెరుగును. అనుకోని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఇతరుల విషయంలో జోక్యం పనికిరాదు. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు. కుటుంబ సభ్యులతో ప్రతికూలత వాతావరణం. పనులలో ఆటంకాలు. అకారణంగా విరోధాలు ఏర్పడ గలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం విఘ్నరాజాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు  (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:- మానసిక బాధలు పెరుగును. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడగలవు. ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తగా నలగాలి. అనుకున్న పనులు పూర్తిగాక ఇబ్బందులు పడతారు. సమాజమనందు సంఘటనలు భయాందోళనలు కలిగించును. శత్రుమూలకముగా ఇబ్బందులు ఎదురవుతాయి. చేయ వ్యవహారంలో బంధుమిత్రుల  సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం అంబికాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార):- వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

ఉ.షా     నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

దిన ఫలం:- ఉద్యోగము నందు అధికారులతోటి సమస్యల రావచ్చు. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడగలవు. చేయ పని యందు శ్రమ అధికంగా నుండును. కీలకమైన సమస్యలను బుద్ధిబలం తోటి పరిష్కరిస్తారు. ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తి అగును. వృత్తి వ్యాపారాలు  సామాన్యంగా ఉంటాయి. మానసికమైన ఆందోళన ఏర్పడను. కుటుంబ సభ్యుల తోటి కొద్దిపాటి వివాదాల రావచ్చు. ఈరోజు ఈ రాశి వారు అరుణాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:- సంతోషకరమైన వార్తలు వింటారు. జీవిత భాగస్వామితోటి ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారమును లాభించును. ఆర్థికంగా అన్ని విధాలా బాగుంటుంది. ఎలాంటి సమస్యనైనా ధైర్యముతో పరిష్కరిస్తారు.  సమాజం నందు మీ యొక్క ఆధిక్యతను ప్రదర్శిస్తారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నూతన పరిచయాలు  ఏర్పడతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం కుబేరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు  (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

దిన ఫలం:- ఆదాయ మార్గాలు బాగుంటాయి. ఉద్యోగ, వృత్తి వ్యాపారులకు పురోభివృద్ధి పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. పై అధికారుల  మన్ననలు పొందారు. సంఘంలో తెలివిగా వ్యవహరించవలెను. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తలపెట్టిన పనులలో  విజయం సాధిస్తారు.
శుభకార్యాల రీత్యా ఖర్చులు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ దత్తాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం :-
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:- సంఘములో హోదాకు తగ్గినట్లు వ్యవహరిస్తారు. చేయు వ్యవహారము నందు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభించును.ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి.  ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి కానవస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం వినాయకాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

click me!