ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారు ఎదురుచూస్తున్న వార్త వింటారు

First Published Dec 7, 2022, 4:55 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  కొత్త పనులకు ప్రయత్నాలు శ్రీకారం చేస్తారు. మీ మాటలతో అందరిని ఆకట్టుకుంటారు. రావలసిన పాత బాకీలు లోక్యంగా వసూలు చేసుకోవాలి. ఉద్యోగమనందు సహోద్యోగులు యొక్క సహాయ సహకారం లభించును. ప్రయాణాలు కలిసి వస్తాయి.

పంచాంగం: 
 
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం  .మార్గశిరం
ఋతువు : హేమంత ఋతువు
పక్షం : శుక్లపక్షమ                                                                                         
వారము: బుధవారం
తిథి : చతుర్దశి ఉదయం 07.09 ని వరకు
నక్షత్రం : కృత్తిక ఉదయం 10:19  ని వరకు
వర్జ్యం: తెల్లవారుజామున 03.21 .నిల O5 .04ని   వరకు
దుర్ముహూర్తం:మ.11. 29ని. నుండి మ.12.13ని. వరకు.            
రాహుకాలం:మ.12.00ని.నుండి మ.01.30ని.వరకు
యమగండం:ఉ.07.30ని. నుండి ఉ.09.00ని. వరకు
సూర్యోదయం : ఉ.06.21ని.లకు
సూర్యాస్తమయం: సా.05.21ని.లకు

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

అనవసరమైన జగడాలకు దూరంగా ఉండాలి . ఊహించని ఒడిదుడుకులు ఏర్పడతాయి . వృత్తి వ్యాపారాలలో సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం .తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. కఠినంగా మాట్లాడడం వలన కొత్తసమస్యలు ఏర్పడతాయి .మనసునందు అనేకమైన ఆలోచనతోటి ఆందోళనగా ఉంటుంది . బంధుమిత్రులతోటి మనస్పర్ధలు ఏర్పడగలవు. ఇతరులతోటి వాదన వేయడం మంచిది కాదు. రావలసిన బాకీలు తిరిగి లభించగలవు. శ్రీ రాహు మూర్తయే నమః అనే 11  సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):

ఆందోళన తగ్గి ప్రశాంతత లభించును. చేయు పనుల యందు పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి. బంధుమిత్రులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త పనులకు ప్రయత్నాలు శ్రీకారం చేస్తారు. మీ మాటలతో అందరిని ఆకట్టుకుంటారు. రావలసిన పాత బాకీలు లోక్యంగా వసూలు చేసుకోవాలి. ఉద్యోగమనందు సహోద్యోగులు యొక్క సహాయ సహకారం లభించును. ప్రయాణాలు కలిసి వస్తాయి.
 

Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):

ఇతరుల యొక్క విషయాల యందు దూరంగా ఉండటం మంచిది . వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని వలెను. చేయ పనులయందు ఆసక్తి లేకుండా ఉండుట . చేయ పనివారితో టి ఇబ్బందులు ఏర్పడతాయి . నిరాశ నిస్పృహలకు లోనవుతారు . సమాజములో  అవమానములు కలిగి గౌరవం తగ్గుతుంది . మనస్సు ఆందోళనగా ఉంటుంది . ఆరోగ్యం సమస్యలు ఇబ్బంది పెడతాయి . స్నేహితులతోటి మాట పట్టింపులు వస్తాయి . ఆవేశాన్ని అదుపులో ఉంచుకొని వలెను . వృత్తి వ్యాపారముల యందు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది .ఈ రాశి వారు ఈరోజు ఓం రుద్రాయ నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):

అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చెడు స్నేహాలకు దూరంగా ఉండడం . తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారములు యందు సామాన్యమైన లాభం కలుగును . అనవసరమైన ఆలోచనయందు దూరంగా ఉండండి . ఆరోగ్యము విషయం లో ఇబ్బందులు ఏర్పడవచ్చు .  ప్రయాణాలు చికాకుగా ఉంటాయి.  మానసికంగా ఆందోళనగా ఉంటుంది. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడగలవు. ఆవేశంతో వాదనలు వలన సంఘంలో గౌరవ ప్రతిష్టలు తగ్గును . ఓం హిమగర్భాయనమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
శుభవార్తలు వింటారు . వృత్తి వ్యాపారాలు యందు ఊహించిన ధన లాభం కలుగును. ప్రయత్న పనులలో విజయం సాధిస్తారు . అభివృద్ధి విషయాల తోటి ఇతరులతో ఆలోచనలు చేస్తారు. కీలకమైన సమస్యలను సమయస్ఫూర్తితో టి వ్యవహారం చేయాలి . పై అధికారుల యొక్క పరిచయాలు కలిసి వస్తాయి . ఉద్యోగమునందు అనుకూలమైన వాతావరణం. ఆర్థికంగా బాగుంటుంది . మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును .ఓం శుభప్రదాయ నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
శారీరకంగా బలహీనంగా ఉంటుంది . ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అకారణంగా కలహాలు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్రతికూలత వాతావారణం . ఉద్యోగమునందు పై అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది . వృత్తి వ్యాపారాల యందు మీ అంచనాలు తారుమారవుతాయి. నిత్యంమీతో పాటు ఉండే వారి తోటి విరోధాలకు దూరంగా ఉండడం మంచిది . అనవసరమైన ఖర్చులు పెరగకుండా  జాగ్రత్త వహించాలి . ఓం అరుణాయ నమః అని 11సార్లు  జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):

 ప్రభుత్వ సంబంధిత పనులన్నీ పూర్తవును. ఉద్యోగమునందు సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.పాత బాకీలు వసూలగును. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఓం వరలక్ష్మియై నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
విద్యార్థులకు అనుకూలం. వృత్తి వ్యాపారాల యందు ఊహంచన ధన లాభం కలుగుతుంది . బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు . ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారు .ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు . ఇంట బయట మీ ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది . తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి . ఉద్యోగమునందు అధికారాల యొక్క స్నేహ సంబంధాలు వలన అధికారం లాభాలు కలిసి వస్తాయి. మానసికంగా శారీరకంగా ఆనందంగా గడుపుతారు ఓం వాచస్పతయే నమః అనే 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
అనవసరమైన ఆలోచనలు. చేయ పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకుగా చికాకులు ఏర్పడవచ్చు. ఎదురుచూస్తున్న వార్త వింటారు . వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమ. చేయి  పని వారితోటి కొద్దిపాటి ఇబ్బందులు. ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడను.   కోర్టు వ్యవహారాయందు నిరాశ. మానసికంగా బలహీనంగా ఉంటుంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధవహించవలెను. ఓం మంగళాదేవ్యై నమః అని 11సార్లు జపించింది శుభ ఫలితాలు పొందండి. 

Zodiac Sign


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):

ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.రుణాలు తీరి ఊరట చెందుతారు. దైవదర్శనాలు చేసుకుంటారు.సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.ధన లాభం పొందుతారు ఈరోజు ఓం షణ్ముఖాయ నమః అని11సార్లు చూపించండి శుభ ఫలితాలు పొందండి.
 

Zodiac Sign


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):

నూతన వస్తు వాహనాల ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి . శుభకార్యాలలో పాల్గొంటారు . విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు . స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు . వృత్తి వ్యాపారం వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది . సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది . తల పట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి .ఈ రాశి వారు ఈరోజు ఓం షణ్ముఖాయ నమః అనే పదకొండోసార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)

సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు లభిస్తుంది.ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు.క్రయ విక్రయాలకు అనుకూలం. ఓం కపర్థినే నమః అనే 11 జపించండి శుభ ఫలితాలు పొందండి

click me!