Zodiac sign:ఈ రాశులవారు భోజన ప్రియులు.. తింటూనే ఉంటారు..!

Published : Jul 05, 2022, 10:53 AM ISTUpdated : Jul 05, 2022, 10:57 AM IST

కడుపునిండా ఆహారం తీసుకున్న తర్వాత  కూడా.. వీరికి ఏదో ఒకటి తినాలనే కోరిక కలుగుతూ ఉంటుంది. వీరికి ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తినాలి అని అనుకోరు... జంక్ ఫుడ్ అయినా తినడానికి ఇష్టపడతారు. 

PREV
16
 Zodiac sign:ఈ రాశులవారు భోజన ప్రియులు..  తింటూనే ఉంటారు..!

ఆహారం ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. అందరికీ ఆహారం అవసరమే. అయితే... కొందరు మాత్రం భోజనం ఎక్కువ తినడానికి ఇష్టపడతారు. వారు మంచి భోజన ప్రియులు. ఈ ఆహారం.. ఆ ఆహారం అనే తేడా లేకుండా అన్నీ లాగేంచేస్తూ ఉంటారు. కడుపునిండా ఆహారం తీసుకున్న తర్వాత  కూడా.. వీరికి ఏదో ఒకటి తినాలనే కోరిక కలుగుతూ ఉంటుంది. వీరికి ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తినాలి అని అనుకోరు... జంక్ ఫుడ్ అయినా తినడానికి ఇష్టపడతారు. అలాంటి భోజన ప్రియులు జోతిష్యశాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట. ఈ కింద రాశుల వారు భోజనం తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..
 

26

1.మేష రాశి..
మేష రాశివారు మంచి భోజన ప్రియులు. వీరికి అన్ని విషయాల్లోనూ కాస్త తొందర, కంగార ఎక్కువ. ఏదైనా చేసేటప్పుడు.. ఒకటికి, రెండుసార్లు ఆలోచించడం వీరి వల్ల కాదు. చేయాలి అనుకున్న పని చేసేయడమే. ముందు ఆలోచించరు. వీరు మంచి ఆహార ప్రియులు. ఎక్కువగా వినోదానికి ప్రాధాన్యత ఇస్తారు. విభిన్న రుచులను ఆస్వాదించడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు. ఆకలితో పనిలేదు.. తింటూనే ఉంటారు.

36

2.సింహ రాశి..
సింహ రాశి వారు ఎప్పుడైనా, ఎక్కడైనా ఖరీదైన ఆహారాన్ని తింటారు. సింహరాశి వారు ఆహారం కోసం డబ్బు ఖర్చు చేయడానికి ఇష్టపడతారు, ఎందుకంటే అది వారికి ఖచ్చితంగా సంతోషాన్ని ఇస్తుందని వారికి తెలుసు. వారు హఠాత్తుగా ఆహారాన్ని తినేస్తారు. రుచికరమైన భోజనాన్ని రుచి చూడడానికి ఇతరులను కూడా ఆహ్వానిస్తారు. ఆహారం పంచుకునే విషయంలో చాలా ఉదారంగా ఉంటారు.

46

3.తుల రాశి..

తుల రాశివారు కూడా మంచి భోజన ప్రియులు. ఆహారం ఎక్కువగా తినాలని అనుకుంటూ ఉంటారు. ఆనందంగా ఉన్నా.. బాధలో ఉన్నా.. ఒంటరిగా ఉన్నా కూడా వీరు ఆహారం ఎక్కువగా తీసుకోవాలని అనుకుంటారు. వారికి  ఏ ఫీలింగ్ కలిగినా.. భోజనమే చేయాలని అనుకుంటారు. ఆకలితో పనిలేదు.. ఆహారం తినడానికి ఇష్టపడతారు.  వారు అర్ధరాత్రి కూడా స్నాక్స్‌ని తినడానికి ఇష్టపడతారు. సినిమాలు చూస్తున్నప్పుడు లేదా స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ వాటిని తింటారు. 

56

4.ధనస్సు రాశి..

వారు ప్రపంచంలోని వివిధ ప్రదేశాలకు ప్రయాణించడానికి ,వెళ్లడానికి ఇష్టపడతారు. అలా వెళ్లిన కొత్త ప్రదేశాల్లో.. అక్కడి పాపులర్ ఫుడ్ తినడానికి వీరు ఇష్టపడతారు. వీరికి విభిన్న ఆహారాలు రుచి చూడాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. స్పెషల్ అని తెలిస్తే చాలు.. అది ఎలా ఉంటుంది అని కూడా ఆలోచించరు. ఆ ఆహారాన్ని వారు తినడానికి ఇష్టపడతారు. 

66

5.మీన రాశి..
ఆహారం విషయంలో వీరు చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. మంచి భోజన ప్రియులు. వారు విచారంగా లేదా నిరాశకు గురైనప్పుడు వారు అన్ని రకాల డెజర్ట్‌లు,సౌకర్యవంతమైన ఆహారాల వైపు మొగ్గు చూపుతారు. బాధ వచ్చినా.. ఆనందం వేసినా వీరు ఆహారం తినడానికి ఇష్టపడతారు. ఎక్కువగా వీరి మనసు జంక్ ఫుడ్స్ పై ఉంటుంది. అందుకే వీరు ఎక్కువగా అధిక బరువు, ఉబకాయం సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.   

click me!

Recommended Stories