
మన చుట్టూ చాలా మంది ఉంటారు. అందరికీ మనం నచ్చకపోవచ్చు. మనకీ అందరూ నచ్చకపోవచ్చు.అయితే.. ఎవరితోనైనా మనం స్నేహం చేయాలంటే.. వారికి నచ్చినట్లుగా మనం ప్రవర్తించాలి. అలా లేకపోతే వారితో స్నేహం చెడుతుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారితో ఎలా ఉంటే వారు మనతో సరిగా ఉంటారో ఓసారి చూద్దాం..
1.మేష రాశి...
మేష రాశివారికి కాస్త కోపం ఎక్కువ. ఈ రాశివారు వారు చేస్తున్న పనిని ఎవరైనా ఆపితే చాలా కోపం వస్తుంది. వీరిని ఆపితే వీరు కోపంతో ఊగిపోతారు. పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తారు. కాబట్టి వీరిని ఆపకుండా ఉండటమే మంచిది.
2.వృషభ రాశి..
ఈ రాశివారు ఏ పనీ తొందరగా చేయరు. ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి... ఈ రాశివారిని ఏదైనా పని చేయమని తొందరపెట్టకూడదు. అది వారికి అస్సలు నచ్చదు.
3.మిథున రాశి..
మిథున రాశివారు తొందరగా హర్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ రాశివారిని ఏ విషయంలోనూ నిరుత్సాహ పరచకూడదు. అలా చేస్తే.. ఆ తర్వాత వారు మీతో మళ్లీ మాట్లాడరు.
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారిని ఎప్పుడూ తక్కువ చేయకూడదు. వీరిని తక్కువ చేస్తే.. కచ్చితంగా మీరు తప్పు అని వారు ప్రూవ్ చేస్తారు. వారిలో ఆ సత్తా ఉంది. ఆ తర్వాత మీరే ఫూల్ అవుతారు.
5.సింహ రాశి..
సింహ రాశివారు మీతో జీవితాంతం స్నేహితులుగా ఉండాలి అంటే... వారిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రాశివారు ఏం చేసినా తట్టుకుంటారు కానీ.. వారిని ఇగ్నోర్ చేస్తే మాత్రం తట్టుకోలేరు.
6.కన్య రాశి...
కన్య రాశివారికి ఎప్పుడూ కోపం తెప్పించకూడదు. ఒకవేళ తెప్పించారో.. ఆ తర్వాత జరిగే పరిణామాలను మీరు అస్సలు భరించలేరు. వీరు కోపాన్ని ఎవరూ భరించలేరు.
7.తుల రాశి..
తుల రాశివారికి ఏం చేయాలో.. ఏం చేయకూడదో ఎప్పుడూ చెప్పకూడదు. ఎందుకంటే.. వీరికి చెప్పినా వీరు చేయరు. ఇతరులు చెప్పిన రూల్స్ ని వీరు అస్సలు ఫాలో అవ్వరు.
8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు తొందరగా ఎవరినీ నమ్మరు. కాబట్టి.. వారితో జీవితాంతం కలిసి ఉండాలి అంటే.. మీరు వారికి ఎట్టిపరిస్థితిల్లోనూ అబద్ధం చెప్పకూడదు.
9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారిని ఏ విషయంలోనూ ఒత్తిడి చేయకూడదు. ఎందుకంటే... వీరిని ఒత్తిడి చేశారంటే ఆ తర్వాత వీరు రివేంజ్ తీసుకుంటారు. ఆ రివేంజ్ ని తట్టుకోవడం కష్టం.
10.మకర రాశి...
మకర రాశివారు ఎప్పుడూ సరదాగా ఉంటారు. వీరికి అలా ఉండటమే ఇష్టం. కాబట్టి... ఈ రాశివారికి మీరు బోర్ తెప్పించకూడదు. అలా బోర్ తెప్పించారు అంటే... ఇంకోసారి వారు మీతో బయటకు కూడా రారు. బోరింగ్ పర్సన్స్ అంటే వీరికి అస్సలు నచ్చదు.
11.కుంభ రాశి..
కుంభ రాశివారు ముందు.. మీరు ఇతరుల పట్ల చాలా రూడ్ గా ఉండకూడదు. అలా ఉంటే ఈ రాశివారికి విపరీతంగా కోపం వస్తుంది. వెంటనే మిమ్మల్ని కొట్టినా కొడతారు.
12.మీన రాశి..
ఈ రాశివారు ఫేక్ పీపుల్స్ ని అస్సలు భరించలేరు. కాబట్టి రాశివారితో చాలా నిజాయితీగా ఉండాలి. అబద్దాలు చెప్పేవారు, ఫేక్ పీపుల్స్ కి వీరు దూరంగా ఉంటారు.