Zodiac sign: టీనేజ్ పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఏం ఆశిస్తారో తెలుసా?

Published : Jul 21, 2022, 03:59 PM IST

 కానీ ఒక్కసారి పిల్లలు టీనేజ్ కి వచ్చిన తర్వాత వారి అవసరాలు మారిపోతాయి. వారు ప్రతిదీ భిన్నంగా ఆలోచిస్తారట. వారు ప్రత్యేకంగా తమ పేరెంట్స్ ని వేరేవి ఆశిస్తారట. 

PREV
113
Zodiac sign: టీనేజ్ పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఏం ఆశిస్తారో తెలుసా?

పిల్లలకు ఏం కావాలి అని ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తారు. వారికి ఏ వయసుకు ఏది అవసరమో... వారి కన్నా ముందే తల్లిదండ్రులు ఆలోచించి.. వారికి అందిస్తారు. చిన్నపిల్లలు అయితే.. వారికి ఏం కావాలో క్లారిటీ ఉండదు కాబట్టి.. పేరెంట్స్ ఇఛ్చిన దానితో తృప్తి పడతారు. కానీ ఒక్కసారి పిల్లలు టీనేజ్ కి వచ్చిన తర్వాత వారి అవసరాలు మారిపోతాయి. వారు ప్రతిదీ భిన్నంగా ఆలోచిస్తారట. వారు ప్రత్యేకంగా తమ పేరెంట్స్ ని వేరేవి ఆశిస్తారట. జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశి పిల్లలు.. తమ పేరెంట్స్ నుంచి ఏం ఆశిస్తారో ఓసారి చూద్దాం...
 

213

1.మేష రాశి..
మేష రాశికి చెందిన పిల్లలు చాలా టఫ్ గా ఉంటారు. ఈ రాశికి చెందిన టీనేజ్ పిల్లలు కొంచెం రెబల్ గా ఉంటారు. కానీ.. చాలా  ప్రతిష్టాత్మకంగా ఉంటారు. అయితే... ఈ రాశివారు తమ పేరెంట్స్ నుంచి  మద్దతు, బూస్టప్ కోరుకుంటారు. తమను తమ పేరెంట్స్ ప్రతి విషయంలో అర్థం చేసుకోవాలి అని అనుకుంటారు.
 

313

2.వృషభ రాశి..
వృషభ రాశివారు తమ పేరెంట్స్ నుంచి కూడా కాస్త స్పేస్ కోరుకుంటారు. వీరు వ్యక్తిత్వ పరంగా కొంచెం మొండిగా ఉంటారు. వీరు ఏ విషయంలో అయినా తొందరగా ఓపెన్ అవ్వరు. వీరు ఎక్కువగా కంఫర్ట్ జోన్ లో ఉండటానికి ఇష్టపడతారు. తమను అర్థం చేసుకునేలా తమ పేరెంట్స్  ఉండాలని వీరు అనుకుంటారు.
 

413

3.మిథున రాశి...
మిథున రాశికి చెందిన టీనేజ్ పిల్లలు తమ పేరెంట్స్ తో ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడతారు. వీరు తమ పేరెంట్స్ సమయాన్ని ఎక్కువగా కోరుకుంటారు. తమ పేరెంట్స్ తమతో సమయాన్ని గడపడం వీరు ఎక్కువగా కోరుకుంటారు.
 

513

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశికి చెందిన టీన్స్ తమ ఎమోషన్స్ ని  అస్సలు భయట పెట్టరు. తాము బయటకు చెప్పకపోయినా.. తమ మనసులో బాధ ను వారు అర్థం చేసుకోవాలని వారు కోరుకుంటారు. వీరు గట్టిగా ఏదీ చెప్పలేకపోయినా తమను అర్థం చేసుకోవాలని అనుకుంటారు.

613

5.సింహ రాశి..
సింహ రాశికి చెందిన టీనేజ్ పిల్లలు చాలా డామినేటింగ్ గా ఉంటారు. వీరు బయటకు చూడటానికి అందరికీ స్ట్రాంగ్ గా కనపడే అవకాశం ఉంది. అయినా.. తమను పూర్తిగా నమ్మేవారు తమతో ఉండాలని.. అది తమ తల్లిదండ్రులే కావాలని వారు కోరుకుంటారు.

713

6.కన్య రాశి..
కన్య రాశికి చెందిన టీనేజ్ పిల్లలు చాలా మెచ్యూర్డ్ గా ఉంటారు. తమ లక్ష్యాన్ని చేధించడానికి చాలా పట్టుదలతో ఉంటారు. అయితే.. తమను తమ పేరెంట్స్  ఎంత పెరిగినా కూడా చిన్న పిల్లల్లా చూడాలని అనుకుంటూ ఉంటారు.
 

813

7.తుల రాశి..
తుల రాశికి చెందిన టీనేజ్ పిల్లలు.. చాలా ప్రశాంతంగా ఉంటారు. తమ తోటి టీనేజ్ పిల్లలు రెబల్స్ లాగా ఉన్నా కూడా వీరు మాత్రం చాలా కూల్ గా ఉంటారు. అయితే.. తమను గ్రాంటెడ్ గా తీసుకోవడం మాత్రం వీరికి నచ్చదు. తమను తమ పేరెంట్స్ గుర్తించాలనే ఆరాటం మాత్రం వీరికి ఎక్కువగా ఉంటుంది.

913

8.వృశ్చిక రాశి..
ఈ రాశికి చెందిన టీనేజ్ పిల్లలు.. చాలా నిజాయితీగా, తెలివి తేటలతో ఉంటారు. చాలా కష్టపడతారు కూడా. అయితే.. తమను తమ పేరెంట్స్ ప్రేమగా దగ్గరకు తీసుకోవాలని.. తమపై ప్రేమ కురిపించాలని మాత్రం వీరు కోరుకుంటారు.

1013

9.ధనస్సు రాశి..
ధనస్సు రాశికి చెందిన టీనేజ్ పిల్లలు చాలా దయతో ఉంటారు. జీవితంలో ఎక్కువగా సాహసాలు చేయాలని ఇష్టపడతారు. వీరికి ఉత్సాహం చాలా ఎక్కువ. కాబట్టి.. తమ పేరెంట్స్ తమకు స్వేచ్ఛ ఎక్కువగా ఇస్తే బాగుండని కోరుకుంటారు.
 

1113

10.మకర రాశి..
మకర రాశికి చెందిన టీనేజ్ పిల్లలు.. జీవితంలో ప్రతి విషయంలోనూ ప్రాక్టికల్ గా ఉంటారు. వీరికి మంచేదో, చెడు ఏదో బాగా తెలుసు. అయితే.. తాము సాధిస్తున్న విజయాలను చూసి తమ పేరెంట్స్ మెచ్చుకోవాలని.. తమ సపోర్టు కావాలని వీరు కోరుకుంటారు. మద్దతు రాకపోతే వీరు చాలా నిరుత్సాహానికి గురౌతారు.

1213

11.కుంభ రాశి..
కుంభ రాశికి చెందిన టీనేజ్ పిల్లలు ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. అయితే.. వీరు తమ పేరెంట్స్ దగ్గర నుంచి శారీరక ప్రేమ కన్నా.. మానసిక ప్రేమను ఎక్కువగా కోరుకుంటారు. మానసికంగా వారి నుంచి ప్రేమ దొరకాలని భావిస్తూ ఉంటారు.

1313

12.మీన రాశి..
మీన రాశికి చెందిన టీనేజ్ పిల్లలు ప్రతి విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు. చాలా కేరింగ్ గా ఉంటారు. అందరిపై ప్రేమ కురిపిస్తారు. అదే విధంగా తమ పేరెంట్స్ కూడా తమ పై అదేవిధంగా ప్రేమ కురిపించాలని.. అటెన్షన్ చూపించాలని వీరు అనుకుంటూ ఉంటారు.

click me!

Recommended Stories