మాస ఫలాలు :01 ఫిబ్రవరి 2024 నుంచి 29 ఫిబ్రవరి 2024 వరకూ
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈ మాసం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ మాసం రాశి ఫలాలు లో తెలుసుకుందాం
(కర్కాటక వృశ్చిక మకర కుంభ మీన రాశి ల వారికి అష్టమ అర్ధాష్టమ మరియు ఏలినాటి శని జరుగుతున్నాయి. కావున ప్రతినిత్యం ఈ శ్లోకాన్ని 11 సార్లు లేదా శని స్తోత్రం లేదా అష్టోత్రం గాని పారాయణ చేయడం మంచిది.)
శ్లో॥ కోణస్థ పింగళో బభ్రు కృష్ణో రౌద్రాంతకోయమః ।
సౌరి శనైశ్చరో మందః పిప్పలాదిషు సంస్థితః॥
లేదా
శ్లో॥నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం॥
telugu astrology
మేషం (అశ్విని భరణి కృత్తిక 1)
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారాలు॥ మంగళ- గురు -శుక్ర
రవి రాజ్య స్థానంలో సంచారం 13-2-24 నుంచి లాభ స్థానంలో సంచారం.ఈ సంచారం అనుకూలమైన ఫలితాలు పొందగలరు. ఉద్యోగాలలో కార్యనిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది.అధికారులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు.
కుజుడు రాజ్య స్థానంలో సంచారం వలన అనారోగ్య సమస్యలు రాగలవు. శారీరక శ్రమ పెరుగుతుంది. చెడు స్నేహాలు దూరంగా ఉండాలి.
బుధుడు రాజ్య స్థానంలో సంచారం 19-2-24 నుంచి లాభ స్థానంలో సంచారం
శుక్రుడు భాగ్య స్థానంలో సంచారం 13-2-24 వరకు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామిగా ఆనందంగా గడుపుతారు.ఆదాయం మార్గాలు బాగుంటాయి. తర్వాత రాజ్య స్థానంలో సంచారం అనుకూలం కాదు సమాజంలో చిన్నపాటి అవమానాలు జరగవచ్చు.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.శుభ కార్యాచరణ వలన అధిక ధనం ఖర్చు చేయాల్సి ఉంటుంది.వాహన ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు పట్టుదలతో రాసిన పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారు. కొన్ని సమస్యలు ప్రతిబంధకంగా మారును. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రాగలవు. గృహంలో ఆనందకరమైన వాతావరణం.
అశ్విని నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు వ్యాపారంలో అధిక ఆదాయం లభిస్తుంది. తలచిన కార్యాలు అప్రయత్నముగా పూర్తగును. విలాసవంతంగా గడుపుతారు.
భరణి నక్షత్రం వారికి మాసాధిపతి రవి తలపెట్టిన పనులు నిదానంగా పూర్తి కాగలవు.ఆర్థిక విషయాలు కొంతమేర ఇబ్బందులు కలుగును.ఉద్యోగంలో అధిక శ్రమ
కృత్తిక నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు కుటుంబంలో గందరగోళ పరిస్థితులు. చేసే పనుల్లో మానసిక ఒత్తిడి అధికమవుతుంది.వ్యాపారాలు సామాన్యంగా ఉండును.
telugu astrology
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారాలు॥ మంగళ- గురు -శుక్ర
రవి భాగ్య స్థానంలో సంచారం కుటుంబ సభ్యులతో అకారణ కలహాలు రాగలవు.13-2-24 నుంచి రాజ్య స్థానంలో సంచారం. ఈ సంచారం అనుకూలమైనది. క్రమక్రమంగా అభివృద్ధి చెందగలరు.
కుజుడు భాగ్య స్థానంలో సంచారం వలన అవకాశాలు దగ్గర దాకా వచ్చి చేజారి పోతాయి. సమాజంలో అవమానాలు ఎదుర్కోవలసి ఉంటుంది.
బుధుడు భాగ్య స్థానంలో సంచారం 19-2-24 నుంచి
శుక్రుడు అష్టమ స్థానంలో సంచరించి 13-2-24 నుంచి భాగ్య స్థానంలో సంచారం ఈ సంచారం వలన అనుకూలమైన ఫలితాలు పొందగలరు. రుణాలు తీరి ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థులు అనుకూలమైన ఫలితాలు పొందగలరు.వ్యాపారంలో పెట్టుబడి తగ్గ ధన లాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు బాగుంటాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేసు కుంటారు. బంధు మిత్రుల కలయిక ఆనందం కలగజేస్తుంది. విద్యార్థులు చదువు లో ప్రతిభ కనబరుస్తారు.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
రోహిణి నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. తలపెట్టిన పనులు వాయిదా వేస్తారు.వాహన ప్రయాణాలలో తగు జాగ్రత్త అవసరం.
మృగశిర నక్షత్రం వారికి మాసాధిపతి శని ఖర్చుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
telugu astrology
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:- 3-5-6
అనుకూలమైన వారాలు॥ ఋధ -శుక్ర
రవి అష్టమ స్థానంలో సంచారం.13-2-24 నుంచి భాగ్య స్థానంలో సంచారం నమ్మిన వారి వలనే మోసపోగలరు. పెద్దలు తో విరోధాలు ఏర్పడగలవు. సంచారం కూడా అనుకూలమైనది కాదు.
కుజుడు అష్టమ స్థానంలో సంచారం వలన భార్యాభర్తల మధ్య మనస్పర్థలు. అనారోగ్య సమస్యలు రాగలవు. పొదుపు చేసిన ధనాన్ని తీసి ఖర్చు చేయాల్సి వస్తుంది.
బుధుడు అష్టమ స్థానంలో సంచారం 19-2-24 నుంచి భాగ్య స్థానంలో సంచారం
13-2-24 వరకు శుక్రుడు కళత్ర స్థానంలో సంచారం ఈ సంచారం అనుకూలం కాదు.. జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు రాగలవు. తర్వాత అష్టమ స్థానంలో సంచారం ఈ సంచారం అనుకూలం. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.చేయు వ్యవహారంలో మన స్థిమితం ఉండదు.ఊహించని సమస్యలు ఎదురవుతాయి.ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. స్థానచలనాలు గృహ మార్పులు ఏర్పడగలవు. ప్రతి చిన్న విషయంలో తొందరపాటు పడతారు.భూ సంబంధ విషయాలు లో ధన నష్టం రాగలదు.తలపెట్టిన పనుల్లో ఆటంకాలు.సమాజంలో అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఆరుద్ర నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు మానసిక క్షోభకు గురి అవుతారు.ఆర్థికంగా కొంత ఇబ్బందులు కలుగుతాయి. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు రాగలవు .
పునర్వసు నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు వ్యక్తిగతంగా విలువ పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.
telugu astrology
కర్కాటకం (పునర్వసు 4 పుష్యమి ఆశ్లేష )
నామ నక్షత్రాలు
(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారాలు॥ ఆది- సోమ
రవి కళత్ర స్థానంలో సంచారం 13-2-24 నుంచి అష్టమ స్థానంలో సంచారం. ఈ సంచారం అనుకూలం కాదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవగలవు. సంతాన విషయంలో అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది.
కుజుడు కళత్ర స్థానంలో సంచారం వలన సమాజంలో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. భార్య భర్తల మధ్య అభిప్రాయ భేదాలు రాగలవు. ఆర్థిక సమస్యలు తలెత్తగలవు.
బుధుడు కళత్ర స్థానంలో సంచారం 19-2-24 నుంచి అష్టమ స్థానంలో సంచారం
శుక్రుడు శతృ స్థానంలో సంచారం 13-2-24 నుంచి కళత్ర స్థానంలో సంచారం ఈ మాసం శుక్ర సంచారం అనుకూలమైనది కాదు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకూడదు. దీర్ఘకాలిక అనారోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి.అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఋణం చేయవలసి వస్తుంది. శత్రువుల బాధలు పెరుగుతాయి.చేయు వ్యవహారములో ఆటంకాలు ఏర్పడవచ్చు. సమాజంలో అవమానం కలగవచ్చు.ఉద్యోగులకు ఆకస్మిక స్థాన చలనం.కుటుంబ సభ్యులతో విరోధాలు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి.
పుష్యమి నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు.వ్యాపారాల్లో ధనాభివృద్ధి.ఆరోగ్య విషయంలో ఉపశమనం లభిస్తుంది.
ఆశ్రేష నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉండును. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ఆర్థిక విషయాలలో ఆశించిన పురోభివృద్ధి పొందుతారు.
telugu astrology
సింహం (మఖ పుబ్బ ఉత్తర 1)
నామ నక్షత్రాలు
(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారాలు॥ ఆది- సోమ
రవి శత్రు స్థానంలో సంచారం మాస ప్రారంభం నుంచి అనుకూలం. నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు.13-2-24 నుంచి కళత్ర స్థానంలో సంచారం అనారోగ్య సమస్యలు రాగలవు. జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్థలు రాగలవు.
కుజుడు శతృ స్థానంలో సంచారం వలన నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.భూ గృహ నిర్మాణ క్రయ విక్రయాలు కలిసి వస్తాయి.
బుధుడు శతృ స్థానంలో సంచారం 19-2-24 నుంచి కళత్ర స్థానంలో సంచారం
13-2-24 వరకు శుక్రుడు పంచమ స్థానంలో సంచారం ఈ సంచారం అనుకూలం. అన్నదమ్ముల సహాయ సహకారాలు సంతానం కోసం ఎదురుచూసి వారు శుభవార్త వింటారు. తర్వాత శత్రు స్థానంలో సంచారం.సమాజంలో అవమానాలు కలగవచ్చు.వ్యాపారంలో ధనలాభం కలుగును. అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు. మీ ప్రత్యర్ధులపై పై చెయ్యి సాధిస్తారు.మిత్రుల యొక్క ఆదరణ అభిమానం పొందగలరు.సంతాన వృద్ధి ఆనందం కలగజేస్తుంది. ఉద్యోగాలలో అధికారులు మన్ననలు పొందగలరు.విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.
మఘ నక్షత్రం వారికి మాసాధిపతి శుకుడు వ్యాపారంలో అధిక ఆదాయం లభిస్తుంది. తలచిన కార్యాలు అప్రయత్నముగా పూర్తగును. విలాసవంతంగా గడుపుతారు.
పుబ్బ నక్షత్రం వారికి మాసాధిపతి రవి తలపెట్టిన పనులు నిదానంగా పూర్తి కాగలవు.ఆర్థిక విషయాలు కొంతమేర ఇబ్బందులు కలుగును. ఉద్యోగంలో అధిక శ్రమ.
ఉత్తర నక్షత్రం వారికి మాసాధిపతి రాహు కుటుంబంలో గందరగోళ పరిస్థితులు.చేసే పనుల్లో మానసిక ఒత్తిడి అధికమవుతుంది.వ్యాపారాలు సామాన్యంగా ఉండును.
telugu astrology
కన్య (ఉత్తర 2 3 4 హస్త చిత్త 1 2)
నామ నక్షత్రాలు
(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:-3-5-6
అనుకూలమైన వారాలు॥ బుధ- శుక్రవారం
రవి పంచమ స్థానంలో సంచారం మాస ప్రారంభం నుండి అనవసరమైన ఖర్చులు. ఉద్యోగ విషయాలలో ప్రతికూలత.13-2-24 నుంచి శత్రు స్థానంలో సంచారం.ఈ సంచారం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. శత్రువులపై పై చేయి సాధిస్తారు.
కుజుడు పంచమ స్థానంలో సంచారం వలన చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఇతరులకు హామీలు ఇవ్వడం శ్రేయస్కరం కాదు. జ్వరాది చిన్న ఆరోగ్య సమస్యలు రాగలవు.
బుధుడు పంచమ స్థానంలో సంచారం 19-2-24 నుంచి శతృ స్థానం లో సంచారం
శుక్రుడు చతుర్ధ స్థానంలో సంచారం 13-2-24 నుంచి పంచమ స్థానంలో సంచారం ఈ మాసం శుక్ర సంచారం అనుకూలమైన ఫలితాలు పొందగలరు.స్థిరాస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. అభివృద్ధి కార్యక్రమాలకు బంధు వర్గం తోటి చర్చిస్తారు.శుభవార్తలు వింటారు.వ్యాపారం క్రమం క్రమంగా అభివృద్ధి చెందుతుంది. శత్రువులపై పై చేయి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.గృహంలో ఆనందకరమైన వాతావరణం. ఉద్యోగాలలో అనుకూలమైన అధికారం లభించును.
హస్త నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. తలపెట్టిన పనులు వాయిదా వేస్తారు.వాహన ప్రయాణాలలో తగు జాగ్రత్త అవసరం.
చిత్త నక్షత్రం వారికి మాసాధిపతి శని ఖర్చుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
telugu astrology
తుల (చిత్త 3 4, స్వాతి విశాఖ 1 2 3)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రాలు
(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారాలు॥ మంగళ -గురు- శుక్ర
రవి చతుర్ధ స్థానంలో సంచారం 13-2-24 నుంచి పంచమ స్థానంలో సంచారం.ఈ సంచారము అనుకూలం కాదు.ఆర్థిక ఇబ్బందుల వలన రుణాలు చేయవలసి వస్తుంది.వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు.
కుజుడు చతుర్ధ స్థానంలో సంచారం వలన కుటుంబంలో కలహాలు. మీకు వచ్చే అవకాశాలను మిత్రులు ఆపే ప్రయత్నం చేయుదురు. అవమానాలు కలుగ గలవు.
బుధుడు చతుర్ధ స్థానంలో సంచారం 19-2-24 నుంచి పంచమ స్థానంలో సంచారం
13-2-24 వరకు శుక్రుడు తృతీయ స్థానంలో సంచారం ఈ సంచారం వలన మిశ్రమ ఫలితాలను పొందగలరు. శరీర సౌఖ్యం లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది.తర్వాత చతుర్ధ స్థానంలో సంచారం మిక్కిలి అనుకూలం. బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు చేస్తారు.వృత్తి వ్యాపారాలు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాయి. కీలకమైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. సామాజిక సేవలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.అధికారుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి.అన్ని విధాల ఈ మాసం యోగించును.ఆర్థికంగా బలపడతారు. రాజకీయ నాయకులు ప్రజల యొక్క ఆదరణ పొందగలరు.
స్వాతి నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు మానసిక క్షోభకు గురి అవుతారు. ఆర్థికంగా కొంత ఇబ్బందులు కలుగుతాయి. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు రాగలవు .
విశాఖ నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు వ్యక్తిగతంగా విలువ పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.
telugu astrology
వృశ్చికము (విశాఖ 4, అనూరాధ జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారాలు॥ మంగళ-గురు -శుక్ర
రవి తృతీయ స్థానంలో సంచారం భూ గృహ నిర్మాణ క్రయ విక్రయాలు కలిసే వస్తాయి.13-2-24 నుంచి చతుర్ధ స్థానంలో సంచారం ఉద్యోగాలలో అధికారులు తో అకారణంగా కలహాలు రాగలవు.
కుజుడు తృతీయ స్థానంలో సంచారం వలన అనుకూలమైన ఫలితాలు పొందుతారు. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. శత్రువులపై పై చేయి సాధిస్తారు.శరీర సౌఖ్యం లభిస్తుంది.
బుధుడు తృతీయ స్థానంలో సంచారం 19-2-24 నుంచి చతుర్ధ స్థానంలో సంచారం
13-2-24 వరకు శుక్రుడు ధన స్థానంలో సంచారం. ఈ సంచారం అనుకూలం. సమాజంలో సన్మానాలు బహుమానాలు పొందగలరు. నూతన వస్తూ వాహనాలు కొనుగోలు చేస్తారు. తర్వాత తృతీయ స్థానంలో సంచారం వ్యాపారంలో చిన్నపాటి నష్టాలు రాగలవు.ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగ పరమైన అభివృద్ధి కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తలపెట్టిన పనులన్నింటినీ సకాలంలో పూర్త చేస్తారు.విద్యార్థులు ప్రతిభ పాటలు చూపిస్తారు.ఆదాయ మార్గాలు అన్వేషణ ఫలిస్తాయి.స్థిరాస్తి అభివృద్ధి కలుగుతుంది. ఈ మాసం అన్ని విధాలా యోగించును
అనూరాధ నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు.వ్యాపారాల్లో ధనాభివృద్ధి. ఆరోగ్య విషయంలో ఉపశమనం లభిస్తుంది.
జ్యేష్ట నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉండును. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ఆర్థిక విషయాలలో ఆశించిన పురోభివృద్ధి పొందుతారు.
telugu astrology
ధనుస్సు (మూల పూ.షాఢ ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారాలు॥ గురు -శుక్ర- మంగళవారం
రవి ధన స్థానంలో సంచారం నమ్మిన వారి వలన మోసపోతారు.13-2-24 నుంచి తృతీయ స్థానంలో సంచారం. ఈ సంచారం అనుకూలం సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు.
కుజుడు ధన స్థానంలో సంచారం వలన శారీరక నిస్సత్తువ నిరాశ నిస్పృహలకు
లోను అవుతారు. పెట్టుబడులకు అనుకూలం కాదు.
బుధుడు ధన స్థానంలో సంచారం 19-2-24 నుంచి తృతీయ స్థానంలో సంచారం
శుక్రుడు జన్మరాశి లో సంచారం 13-2-24 నుంచి ధన స్థానంలో సంచారం ఈ సంచారం అనుకూలం ఫలితాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. ఉద్యోగాలలో అనుకూలమైన అధికార వృద్ధి కలుగును.వృత్తి వ్యాపారంలో ధన లాభం కలుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. చేసే వ్యవహారములు అనుకూలించును. కీలకమైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఉద్యోగాలు లో అధికార అభివృద్ధి కలుగును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.
మూల నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు వ్యాపారంలో అధిక ఆదాయం లభిస్తుంది. తలచిన కార్యాలు అప్రయత్నముగా పూర్తగును. విలాసవంతంగా గడుపుతారు.
పూ.షాఢ నక్షత్రం వారికి మాసాధిపతి రవి తలపెట్టిన పనులు నిదానంగా పూర్తి కాగలవు.ఆర్థిక విషయాలు కొంతమేర ఇబ్బందులు కలుగును. ఉద్యోగంలో అధిక శ్రమ పెరుగుతుంది.
ఉ.షాఢ నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు కుటుంబంలో గందరగోళ పరిస్థితులు.చేసే పనుల్లో మానసిక ఒత్తిడి అధికమవుతుంది.వ్యాపారాలు సామాన్యంగా ఉండును.
telugu astrology
మకరం (ఉ.షాఢ 2 3 4 శ్రవణం ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 2-3-6-8
అనుకూలమైన వారాలు॥ ఆది -సోమ- శని
రవి జన్మరాశి లో సంచారం 13-2-24 నుంచి ధన స్థానంలో సంచారం రవితేజ అనుకూలం కాదు. కోపావేశాలకు దూరముగా ఉండాలి. ఎంత కష్టపడినా నిరాశే ఎదురవుతుంది.
కుజుడు జన్మరాశి లో సంచారం వలన ఇంటా బయటా ప్రతికూలత వాతావరణం. తలచిన కార్యాలు మధ్యలో నిలిచిపోవడం.
బుధుడు జన్మరాశి లో సంచారం 19-2-24 నుంచి ధన స్థానంలో సంచారం
13-2-24 వరకు శుక్రుడు వ్యయ స్థానంలో సంచారం.ఈ సంచారం వలన మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఖర్చు యందు ఆలోచన అవసరం. తర్వాత జన్మ రాశిలో సంచారం.ఉద్యోగ ప్రయత్నం చేసేవారు శుభవార్త వింటారు. సంతానం అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది.బంధు వర్గం తో అకారణంగా విరోధాలు ఏర్పడతాయి.దుష్ట సావాసాలు కు దూరంగా ఉండాలి.శత్రువుల వలన భయంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.చేసే పనిలో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు గురవుతారు.అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.జీవిత భాగస్వామితో మనస్పర్థలు రాగలవు.
శ్రవణా నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. తలపెట్టిన పనులు వాయిదా వేస్తారు.వాహన ప్రయాణాలలో తగు జాగ్రత్త అవసరం.
ధనిష్ఠ నక్షత్రం వారికి మాసాధిపతి శని ఖర్చుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.ప్రయాణాల్లో జాగ్రత్త.
telugu astrology
కుంభం (ధనిష్ట 3 4 శతభిషం పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 1-2-6-8
అనుకూలమైన వారాలు॥ శని- ఆది -సోమ
రవి వ్యయ స్థానంలో సంచారం 13-2-24 నుంచి జన్మ రాశిలో సంచారం .ఈ సంసారం అనుకూలం కాదు.అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అధికారులతో అకారణంగా కలహాలు రాగలవు. జీవిత భాగస్వామి తో కలహాలు రాగలవు.
కుజుడు వ్యయ స్థానంలో సంచారం వలన స్త్రీలు తో వివాదాల రాగలవు జాగ్రత్త అవసరం. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.
బుధుడు వ్యయ స్థానంలో సంచారం 19-2-24 నుంచి జన్మ రాశిలో సంచారం
13-2-24 వరకు శుక్రుడు లాభ స్థానంలో సంచారం.ఈ వలన నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. పితృ సంబంధిత వ్యవహారాలు అనుకూలిస్తాయి. తర్వాత వ్యయ స్థానంలో సంచారం అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.సమాజంలో అపవాదము ఎదుర్కోవలసి వస్తుంది.ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. బంధువర్గంతో మాట పట్టింపులు రావచ్చు. శత్రు బాధలుంటాయి. గృహంలో ప్రతికూలత వాతావరణ.మానసిక ఉద్రేకం పెరుగుతుంది.అనారోగ్య సమస్యలు రావచ్చు. ఉద్యోగాలలో అధికారులు తో సమస్యలు వస్తాయి. భూ గృహ కొనుగోలు చేస్తారు.
శతభిషం నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు మానసిక క్షోభకు గురి అవుతారు.ఆర్థికంగా కొంత ఇబ్బందులు కలుగుతాయి. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు రాగలవు.
పూ.భాద్ర నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు వ్యక్తిగతంగా విలువ పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది .
telugu astrology
మీనం(పూ.భాద్ర 4 ఉ.భాద్ర రేవతి )
నామ నక్షత్రాలు
(దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారాలు॥ గురు- శుక్ర -మంగళ
రవి లాభ స్థానంలో సంచారం 13-2-24 వరకు అనుకూలమైన సంచారం.ఈ సంచారం వలన కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. తర్వాత వ్యయ స్థానంలో సంచారం ఈ సంచారం వలన ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.
కుజుడు లాభ స్థానంలో సంచారం వలన వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. భూ సంబంధిత వ్యవహారాలు అనుకూలం. ఆదాయ మార్గాలు బాగుంటాయి.
బుధుడు లాభ స్థానంలో సంచారం 19-2-24 నుంచి వ్యయ స్థానంలో సంచారం
13-2-24 వరకు శుక్రుడు రాజ్య స్థానంలో సంచారం.ఈ సంచారం వలన ఇతరులతో అకారణంగా కలహాలు రాగలవు. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. తర్వాత లాభ స్థానంలో సంచారం ఈ సంచారం వలన మిక్కిలి అనుకూలమైన ఫలితాలు పొందగలరు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. దీర్ఘాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.ప్రయత్నించిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారం సజావుగా సాగుతాయి. ప్రయాణాలు లాభించును. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి.శారీరక మానసిక బలహీనత ఏర్పడుతుంది.ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో ప్రతికూలత వాతావరణ.
ఉ.భాద్ర నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు.వ్యాపారాల్లో ధనాభివృద్ధి. ఆరోగ్య విషయంలో ఉపశమనం లభిస్తుంది.
రేవతి నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉండును. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ఆర్థిక విషయాలలో ఆశించిన పురోభివృద్ధి కానవస్తుంది.