Ugadi Rasi Phalalu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర మేష రాశి ఫలితాలు

First Published | Apr 1, 2024, 2:52 PM IST

శ్రీ క్రోధి నామ సంవత్సరానికి సంబంధించిన మేష రాశి ఫలితాలివి. ఈ ఉగాది మొదలుకుని వచ్చే ఏడాది వరకు మేష రాశి వారికి సంబందించిన మాస, వార్షిక ఫలితాలను ఇక్కడ చూడొచ్చు. అలాగే జన్మ నక్షత్రం ఆధారంగానూ ఫలితాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.

Aries 2024

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)

ఆదాయం:-8
వ్యయం:-14
రాజపూజ్యం:-4
అవమానం:-3

గురుడు 1-5-24 వరకు జన్మరాశిలో రజిత మూర్తిగా సంచరించి తదుపరి సంవత్సరాంతం ధన స్థానంలో తామ్ర మూర్తి గా సంచారం.(గురు సంచారం అనుకూలం.)

శని ఈ సంవత్సరమంతా లాభ స్థానంలో లోహ మూర్తిగా శని సంచారం. (అనుకూలం)

రాహువు ఈ సంవత్సరమంతా వయ్య స్థానంలో రజత మూర్తి గా సంచారం.

కేతువు ఈ సంవత్సరమంతా షష్టమ స్థానంలో రజత మూర్తి గా సంచారం.

ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు.సంతాన విషయంలో అభివృద్ధికి సరైన నిర్ణయాలు తీసుకుంటారు.పితృ సంబంధించిన ఆస్తి విషయాలు అనుకూలిస్తాయి.సమాజంలో మరియు కుటుంబం లో మీ మాటకు విలువ పెరుగుతుంది.ఎంతటి కఠినమైన వ్యవహారం మైన సులభంగా పరిష్కారమవుతాయి.కుటుంబంలో శుభకార్యములు జరుగును. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.చిన్నపాటి పరిశ్రమలు నిర్వహించే వారికి అనుకూలమైన ఫలితాలు పొందుతారు.ఖర్చు విషయంలో ఆలోచించి ఖర్చు చేయడం మంచిది. అనుకోకుండా దూర ప్రయాణం చేయవలసి వస్తుంది.గత కొంతకాలంగా ఇబ్బందిగా ఉన్న సమస్యలు పరిష్కార మగును.ఈ సంవత్సరం శారీరకంగా మానసికంగా నూతన ఉత్సాహంతో ఉంటారు. అలాగే ఈ సంవత్సరం జీవితానందం అన్ని విషయాల్లో మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది.వలన వ్యాపారాల్లో పెట్టుబడులు ఆలోచించి లేదా పెద్దల యొక్క సలహాలు తీసుకుని పెట్టుబడులు పెట్టాలి.అనవసరమైన వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కొద్దిపాటి ఆర్థిక సమస్యలు ఎదురవగలవు. అయినప్పటికీ తగు సమయానికి సమకూరుతుంది. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని వ్యవహారాల్లో ధైర్యంగా ముందుండి నడిపిస్తారు.సంతానానికి ఉన్నత విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.గత సంవత్సరం కంటే హోదా కలిగి ఆనందంగా గడుపుతారు.ప్రతి విషయంలో ధైర్యంగా ముందు ఉండి నాయకత్వం వహిస్తారు.


ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురు శని కేతు సంచారం అనుకూలం.

అశ్విని నక్షత్రం వారికి

గురుడు 30-05-24 వరకు విపత్తార లో సంచారం తదుపరి 13-6-24 వరకు క్షేమతార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి ప్రత్యక్ తారా లో సంచారం

శని 3-10-24 వరకు నైధనతార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి సాధనతార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు నైధన తార లో సంచారం.

రాహు 7-7-24 వరకు పరమ మిత్ర తార లో సంచారం తదుపరి సంవత్సరాంతం  మిత్ర తార లో సంచారం

కేతువు 11-11-24 వరకు క్షేమ తార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం విపత్తార లో సంచారం.

భరణి నక్షత్రం వారికి

గురుడు 13-06-24 వరకు సంపత్తార లో సంచారం తదుపరి 13-6-24 నుంచి విపత్తార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి క్షేమతార లో సంచారం.

శని 3-10-24 వరకు సాధన తార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి ప్రత్యక్తార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు సాధన తార లో సంచారం.

రాహువు 7-7-24 వరకు మిత్ర తార లో సంచారం తదుపరి సంవత్సరాంతం  నైధనతార లో సంచారం.

కేతువు 11-11-24 వరకు విపత్తార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం సంపత్తార లో సంచారం.

కృత్తిక నక్షత్రం వారికి

గురుడు 13-06-24 వరకు జన్మతారలో సంచారం తదుపరి 13-6-24 నుంచి సంపత్తార లో  సంచారం తదుపరి 20-8-24 నుంచి  విపత్తార లో సంచారం.

శని 3-10-24 వరకు ప్రత్యక్తార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి క్షేమ తార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు ప్రత్యక్తార లో సంచారం.

రాహువు 7-7-24 వరకు నైధనతార లో సంచారం తదుపరి సంవత్సరాంతం  సాధన తారలో సంచారం.

కేతువుష 11-11-24 వరకు సంపత్తార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం జన్మతారలో సంచారం

(రాహు సంచారం అనుకూలంగా లేదు కనుక ప్రతి నెల మూలా నక్షత్రం రోజున దుర్గారాధన చేయుట మంచిది.)
 

ఏప్రిల్

ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగాలలో ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. వాహన యంత్రాధులతో జాగ్రత్త అవసరం.పనుల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు అధికంగా ఉంటాయి.బంధువర్గంతో చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి. అన్ని వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులు పట్టుదలతో చదవాలి.


మే
ఆర్థిక సమస్యలు తలెత్తగలవు.నిల్వ చేసిన ధనాన్ని తీసి ఖర్చు చేయాల్సి వస్తుంది. కొద్ది పాటి రుణాలు కూడా చేయాల్సి వస్తుంది.భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్థలు రాగలవు.అనేక మార్గాల ద్వారా ఆదాయం లభిస్తుంది.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి కాక ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్య సమస్యలు  ఇబ్బంది కలిగిస్తాయి.ధనాన్ని అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది.ఉద్యోగాలలో అధికారులు తో సంయమనం అవసరం.
 

జూన్
వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలను పొందగలరు.నూతన అవకాశాలు కలిసి వస్తాయి.గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న సమస్యల నుంచి బయటపడతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.సమాజంలో గౌరవ మర్యాదలు పొందగలరు.ఎటువంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు.

జూలై

అన్ని వ్యవహారాల్లో అప్రమత్తతో వ్యవహరించాలి.ఇంటా బయట ప్రతికూలత వాతావరణ.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు బాగుంటాయి. రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు.ముఖ్యమైన విషయాలు లో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.ప్రయాణాలు కలిసి వస్తాయి.వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.

ఆగస్టు

ఈ మాసం అన్ని రంగాల వారికి అన్ని విధాలా అభివృద్ధి చెందుతారు.పరిష్కారం కాని సమస్యలు ను సామరస్యంగా పరిష్కరించుకుంటారు.బంధు వర్గము తో శుభవార్తలు అందుతాయి.ప్రయాణాలు అనుకూలించును.మధ్యలో నిలిచిపోయిన పనులు పూర్తి కాగలవు.నూతన పరిచయాలు అనుకూలిస్తాయి.జీవన విధానం హుందాతనం గా హుషారుగా గడుపుతారు.సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి.ఆరోగ్య అనుకూలించును.ఎంతటి కష్టమైనా పనైనా ధైర్యంగా పూర్తి చేస్తారు.విద్యార్థులకు ఉన్నతమైన విద్య ప్రయత్నాలు కలిసి వస్తాయి.నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

సెప్టెంబర్

సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.సమాజంలో ఉన్నతమైన వ్యక్తులు ని కలుసుకుంటారు.వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.సంతానం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందగలరు.విలువైన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.శుభకార్యాలు మరియు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఆర్థికంగా బలపడి రుణాలు తీర్చే దురు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం.
 

అక్టోబర్

పనుల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో బేధాభిప్రాయాలు రావచ్చు.విందు వినోదాలకు దూరంగా ఉండాలి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి.కుటుంబంలో కలహాలు రాగలవు.నమ్మిన వారు దగా చేయాలని చూస్తారు.ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతాయి.తలపెట్టిన కార్యాలు మధ్యలో నిలిచిపోవడం.భార్య భర్తల మధ్య సరైన అవగాహన లేక మనస్పర్థలు విరోధాలు రాగలవు.ఆధ్యాత్మిక దైవ కార్యక్రమంలో పాల్గొంటారు.


నవంబర్
ఉద్యోగాలలో అధికారులు తో భేదాభిప్రాయాలు మరియు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.ఆర్థిక విషయాలు లో పురోగతి సాధిస్తారు.అన్ని వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు.సంతానం వల్ల సౌఖ్యం లభిస్తుంది.కీలకమైన సమస్య మిత్రుల వల్ల పరిష్కార మగును. సమాజంలో ఉన్నతమైన వ్యక్తులు తో పరిచయాలు కలిసి వస్తాయి.స్త్రీ సౌఖ్యం లభిస్తుంది.

డిసెంబర్
వ్యవహారాల్లో అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.ఆరోగ్య విషయాలు బలపడతాయి.ఎటువంటి సమస్యనైనా ధైర్యంతో ముందుకు సాగుతారు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.నూతన వస్తు వాహన కొనుగోలు చేస్తారు.శత్రువులపై విజయం సాధిస్తారు.వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.

జనవరి

ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.విదేశీ ప్రయాణాలు ప్రయత్నం చేయ వారికి అనుకూలం.ఎంతటి కష్టమైనా పనైనా ధైర్యంతో సాధిస్తారు.విద్యార్థులు ప్రతిభ పురస్కారాలు అందుకుంటారు.చిన్న పాట ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ధనాన్ని నిల్వ చేసే ప్రయత్నాలు చేస్తారు.ఇతరులు మనవాళ్లు అనే భేదాలు లేకుండా సమాజంలో వ్యవహరించాలి.కుటుంబ సభ్యుల సహాయసహకారాలు అందుకుంటారు.స్థిరాస్తి వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడవచ్చు.
 

ఫిబ్రవరి

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.తలపెట్టిన పనులు సమయాన కూలంగా పూర్తి కాగలవు. ఉద్యోగాలలో ఉన్న ఇబ్బందులను సమయస్ఫూర్తిగా వ్యవహరించి సమస్యలు ను తొలగించుకుంటారు.భూ గృహ నిర్మాణ క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి.స్థిరాస్తి అభివృద్ధి చేస్తారు.విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరగగలవు.శుభకార్యాలలో పాల్గొంటారు. సమాజంలో నాయకులు తో లేక ఉన్నతమైన వ్యక్తులు తో పరిచయాలు పెరుగుతాయి.


మార్చి
గృహంలో శుభకార్యాలు జరుగును.శుభకార్యాలు నిమిత్తం ఖర్చు పెరిగిన అందులో సంతృప్తిని పొందుతారు.ఉద్యోగాలలో అనుకూలమైన బదిలీ జరుగును. ఇంటా బయటా అనుకూలమైన వాతావరణం.అప్పుల నుండి విముక్తి పొందవచ్చు. ఆర్థికపరమైన విషయాలు బలపడతాయి.అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. భూ గృహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.విద్యార్థులకు అవగాహన ఆలోచన శక్తి పెరుగుతుంది.శుభకార్యక్రమాలలో పాల్గొంటారు.స్త్రీ మూలకంగా విరోధాలు వచ్చే అవకాశం.ప్రయాణాల్లో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.శత్రు మూలకంగా నష్టాలు వచ్చే అవకాశం.

(జోశ్యుల  రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

Latest Videos

click me!