మీ పుట్టిన తేదీ ప్రకారం.. ఏం చేస్తే.. ధనవంతులు అవుతారో తెలుసా?

First Published | Apr 9, 2024, 10:55 AM IST

మీరు పుట్టిన తేదీ ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల.. కచ్చితంగా ధనవంతులు అవుతారట. మరి.. ఏ తేదీలో పుట్టిన వారు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..


పుట్టిన ప్రతి ఒక్కరికీ... డబ్బు సంపాదించాలనే ఉంటుంది. చాలా మంది చాలా రకాలుగా కష్టపడుతూనే ఉంటారు. కానీ... ఎంత కష్టపడినా అందరి చేతుల్లో డబ్బు నిలవదు. సంపాదించిన డబ్బు నిల్వ ఉంటేనే కదా ధనవంతులం అయ్యేది. అయితే.. న్యూమరాలజీ ప్రకారం.. మీరు పుట్టిన తేదీ ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల.. కచ్చితంగా ధనవంతులు అవుతారట. మరి.. ఏ తేదీలో పుట్టిన వారు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

సంఖ్య 1 (ఏదైనా నెలలో 1, 10, 19, 28వ తేదీలలో జన్మించిన వ్యక్తులు)

1,10, 19, 28.. ఈ తేదీల్లో పుట్టినవారు ప్రతిరోజూ సూర్య భగవానుడిని పూజించాలి.  అంటే.. సూర్య నమస్కారం చేసి.. నీరు అర్పించాలి. ఇలా చేయడం వల్ల  మీరు కచ్చితంగా ధనవంతులు అవుతారు.
 


సంఖ్య 2 (ఏదైనా నెలలో 2, 11, 20 లేదా 29వ తేదీలలో జన్మించిన వ్యక్తులు)


2, 11, 20, 29... ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రతిరోజూ వెండి గ్లాస్ లో మంచినీరు తాగాలి.  ఇలా కనుక వారు రోజూ వెండి గ్లాస్ లో మంచినీరు తాగడం వల్ల.. వారి జీవితంలో కష్టాలు తొలగిపోయి..లక్ష్మి అనుగ్రహం పొందగలరు.

సంఖ్య 3 (ఏదైనా నెలలో 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వ్యక్తులు)


3, 12, 21, 30.. ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రతిరోజూ స్నానం చేసే ముందు నీటిలో  చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇలా చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయడం వల్ల.. వారు కచ్చితంగా భవిష్యత్తులో ధనవంతులు అవ్వగలరు.

సంఖ్య 4 (ఏదైనా నెలలో 4, 13, 22 లేదా 31వ తేదీలలో జన్మించిన వ్యక్తులు)


4, 13, 22, 31.. ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రతిరోజూ ఆ దుర్గామాతను పూజించాలి. ఆ మాతను పూజించడం వల్ల.. ఆమె అనుగ్రహంతో ఈ రాశివారు ధనవంతులు అవ్వగలరు.
 

సంఖ్య 5 (ఏదైనా నెలలో 5, 14, 23వ తేదీలలో జన్మించిన వ్యక్తులు)


5, 14, 23.. ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రతిరోజూ తమ వద్ద.. యాలకులు ఉంచుకోవాలి. యాలకులు మన వంటింట్లో సులభంగానే దొరుకుతాయి. వాటిని  ఎప్పుడూ వెంటనే ఉంచుకుంటే.. కచ్చితంగా ధనాన్ని ఆకర్షించగలరు.
 

సంఖ్య 6 (ఏదైనా నెలలో 6, 15 లేదా 24వ తేదీలలో జన్మించిన వ్యక్తులు)

6, 15, 24.. ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రతిరోజూ పర్ఫ్యూమ్ వాడటం అలవాటు చేసుకోవాలి. వారు కనక.. ప్రతిరోజూతమ దుస్తులకు పర్ఫ్యూమ్ రాసుకుంటే.. కచ్చితంగా లక్ష్మిదేవిని ఆకర్షించి.. ధనవంతులు కాగలరు. 

సంఖ్య 7 (ఏదైనా నెలలో 7, 16, 25వ తేదీలలో జన్మించిన వ్యక్తులు)

7, 16, 25 ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రతిరోజూ చేతికి వెండి లేదంటే.. బంగారు స్టాప్స్ ఉన్న వాచీని ధరించాలి. వీరు కనుక ఇలా ధరిస్తే... వారికి కచ్చితంగా ధన ప్రాప్తి ఉంటుంది.
 

సంఖ్య 8 (ఏదైనా నెలలో 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులు)

8, 17, 26..ఈ తేదీల్లో పుట్టిన వారు.. అమెథిస్ట్ అనే రాయిని ధరించాలి. ఈ రాయితో చేసిన ఉంగరం లేదంటే.. ఇంకా ఏదైనా ఆభరణం ధరించడం వల్ల  వారికి ధన ప్రాప్తి కలుగుతుంది.
 

సంఖ్య 9 (ఏదైనా నెలలో 9, 18, 27వ తేదీలలో జన్మించిన వ్యక్తులు)

9, 18, 27.. ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రతి మంగళవారం జాస్మిన్ ఆయిల్ తో ఇంట్లో దీపం వెలిగించాలి. లేదంటే... ఇంట్లో జాస్మిన్ ఫ్రేగ్రెన్స్ అయినా వాడుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల..  ఈ తేదీల్లో పుట్టిన వారికి ధన ప్రాప్తి కలుగుతుంది. 

Latest Videos

click me!