
1.మేష రాశి...
ఈ రాశులవారికి ఓపిక చాలా తక్కువ. నిశ్శబద్దంగా, లాజికల్ గా ఈ రాశివారు దేనినీ ఆలోచించరు. వీరు మానసికంగా స్ట్రాంగ్ అని చెప్పలేం.
2.వృషభ రాశి...
ఈ రాశుల వారు అందరి నుంచి తమకు రక్షణ కోరుకుంటారు. కానీ వీరు మాత్రం... ఎదుటివారికి సహాయం చేయాలి అన్నప్పుడు మాత్రం కనీసం ముందుకు రారు. ఆ విషయంలో వీరు స్ట్రాంగ్ గా నిలపడలేరు.
3.మిథున రాశి...
ఈ రాశులవారు తొందరగా ఎవరినీ నమ్మరు. వీరికి నమ్మకం కలిగించడం చాలా కష్టం. కానీ... ఒక్కసారి నమ్మకం కుదరితే మాత్రం...వారిని అస్సలు వదిలిపెట్టరు.
4.కర్కాటక రాశి...
అన్ని రాశులలో కెల్లా... ఈ రాశివారు ఎమోషనల్ గానూ, మానసికంగానూ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. వారు ఎంత సెన్సిటివ్ అయినా.. ఆ విషయంలో మాత్రం చాలా స్ట్రాంగ్.
5.సింహ రాశి..
ఈ రాశివారు చూడటానికి గంభీరంగా ఉంటారు. అందరితోనూ సరదాగా ఉన్నట్లు కనిపిస్తారు. కానీ.... ఈ రాశివారు ఇతరులపై ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. మానసికంగా వీరు ఎవరో ఒకరి మీద ఆధారపడకుండా ఉండలేరు.
6.కన్య రాశి..
ఈ రాశివారు తమకు ఏదైనా అవసరం అయినప్పుడు మాత్రం చాలా శ్రద్ధగా ఉంటారు. కానీ... తమకు అవసరం లేకుంటే మాత్రం... ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోరు.
7.తుల రాశి..
ఈ రాశివారు ఎప్పుడూ ఎవరో ఒకరి కంట్రోల్ లో ఉంటారు.ఈ రాశివారు ఎప్పుడూ... లాజికల్ గా ఆలోచించి... పరిస్థితిని కంట్రోల్ చేస్తారు. మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటారు.
8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. చాలా లాజికల్ గా ఆలోచిస్తారు. వీరు మానసికంగా స్ట్రాంగ్ అనే చెప్పొచ్చు. పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలో వీరికి బాగా తెలుసు.
9.ధనస్సు రాశి..
ఈ రాశివారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. చాలా లాజికల్ గా ఆలోచిస్తారు. వీరు మానసికంగా స్ట్రాంగ్ అనే చెప్పొచ్చు. పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలో వీరికి బాగా తెలుసు.
10.మకర రాశి..
మకర రాశివారు సైతం మానసికంగా చాలా స్ట్రాంగ్. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని నిలపడగలరు. వీరు పరిస్థితులను చాలా బాగా అర్థం చేసుకోగలరు.
11.కుంభ రాశి..
ఈ రాశివారిని ఎవరూ అంత తొందరగా అర్థం చేసుకోలేరు. కానీ.... ఈ రాశివారు మాత్రం అందరిలోనూ మంచి మాత్రమే చూస్తూ ఉంటారు. అది వీరిలోని గొప్పతనం.
12.మీన రాశి..
ఈ రాశివారు కూడా మానసికంగా బలంగా ఉంటారు. పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలో వీరికి బాగా తెలుసు. అందరినీ బాగా అర్థం చేసుకుంటారు.