కలలో ఇవి కనిపిస్తున్నాయా? అయితే మిమ్మల్ని అదృష్టం వరించినట్టే..!

Published : Sep 16, 2023, 10:21 AM IST

కలలు కనడం చాలా సహజం. కానీ కలలో కనిపించే ఎన్నో విషయాలు మన భవిష్యత్తు గురించి చెబుతాయి. భవిష్యతుల్లో మనం ఎదుర్కొనే సంఘటనలను సూచిస్తాయంటున్నారు జ్యోతిష్యులు. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ఎలాంటి కలలు పడితే శుభమో ఇప్పుడు తెలుసుకుందాం.. 

PREV
14
కలలో ఇవి కనిపిస్తున్నాయా? అయితే మిమ్మల్ని అదృష్టం వరించినట్టే..!

డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మన కలలలో కనిపించే సంఘటనలు మనకు జరిగే శుభ లేదా అశుభ సంకేతాలను సూచిస్తాయి. అసలు ఎలాంటి కలలు పడితే మంచిది? ఎలాంటి కలలు పెడితే చెడ్డదో ఇప్పుడు తెలుసుకుందాం.. డ్రీమ్ సైన్స్ ప్రకారం..  కొన్ని కలలు పడితే అంతా మంచే జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. ఇలాంటి కొన్ని కలల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

24

పాలు మరిగించడం

మీ కలలో పాలు మరుగుతున్న దృశ్యాన్ని చూస్తే భవిష్యత్తులో  ఏదో ఒక శుభకార్యం జరగొచ్చని అర్థం. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ఒక వ్యక్తి కెరీర్లో పురోగతిని పొందబోతున్నాడని దీని అర్థం. అలాగే ఈ కల ఆగిపోయిన మీ పనులు పూర్తి కాబోతున్నాయని సూచిస్తుంది కూడా. 
 

34

శంఖం కనిపించడం

హిందూ మతంలో శంఖాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే దీన్ని లక్ష్మీదేవి నివాసంగా భావిస్తారు. అందుకే మీరు కలలో శంఖాన్ని చూసినట్టైతే మీకు ఏదో శుభం జరుగుతుందని అర్థం. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. కలలో శంఖం కనిపించడం చాలా అరుదైన కలగా భావిస్తారు. ఈ కల పడిందంటే మీరు లక్ష్మీదేవి, విష్ణువు అనుగ్రహం పొందినట్టే. 
 

44

డబ్బుకు సంబంధించిన కలలు

మీ కలలో నాణెం కనిపించడం శుభ సంకేతం. ఈ కల మీరు త్వరలో సంపదను పొందబోతున్నాడని సూచిస్తుంది. అలాగే మీరు కలలో బంగారాన్ని చూస్తే.. అది ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి చిహ్నం. ఇలాంటి కలలను డ్రీమ్ సైన్స్ దృష్ట్యా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
 

click me!

Recommended Stories