Karkataka Rasi 2024:న్యూ ఇయర్ లో కర్కాటక రాశివారికి అంతా శుభమే..!

First Published | Dec 18, 2023, 2:35 PM IST

2024లోకి మనం అడుగుపెడుతున్నాం. మరి ఈ నూతన సంవత్సరంలో కర్కాటక రాశివారికి ఎలా ఉండబోతోందంటే.. ఉద్యోగస్తులకు ఆర్థికపరముగా ఈ సంవత్సరం కలసివచ్చును. ధనలాభము, వస్తులాభము వంటివి కలుగును. ఆర్థికపరముగా 2024 కర్కాటకరాశి వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధిని కలిగించును. వ్యాపారస్తులకు ఆర్ధికపరమైనటువంటి లాభాలు చేకూర్చును

telugu astrology


కర్కాటక రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం (2024 జనవరి నుంచి 2024 డిసెంబర్) ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఏయే నెలలు కలిసి వస్తుంది...ఎప్పుడు  ఇబ్బందులు ఉంటాయి ... రాశి వార్షిక ఫలాలు లో తెలుసుకుందాం

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు
(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)

గురు:- ఏప్రిల్ నెలాఖరు వరకు దశమ స్థానంలో సంచరించి మే నెల నుండి లాభ స్థానంలో  సంచారము.

శని:- ఈ సంవత్సరమంతా  అష్టమ స్థానంలో సంచారము

రాహు:-ఈ సంవత్సరమంతా భాగ్య స్థానంలో సంచారము

కేతు:-ఈ సంవత్సరమంతా తృతీయ స్థానంలో సంచారము
 

ఈ రాశివారికి సంవత్సర ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అయితే శ్రమకు తగిన విజయాలు లభిస్తాయి. ఈ నేపథ్యంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా, ఆదాయ పరంగా, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో కొత్త మార్పులు రానున్నాయి.  ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి.  ఎక్కువ ఆదాయాన్ని పెంచుకునేందుకు మంచి అవకాశాలొస్తాయి. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నష్టపోవాల్సి ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడే సంవత్సరం. ఈ కాలంలో దీర్ఘకాలిక పెట్టుబడుల జోలికి వెళ్లకపోవడమే మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.ఎక్కువ రిస్కులు తీసుకోకుండా బడ్జెట్‌పై ఫోకస్ పెట్టాలి. మీ ఫైనాన్సియల్ ప్లానింగ్ ని  సమర్థవంతంగా ప్లాన్ చేయండి. అలాగే 2024 ప్రారంభంలో  వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సత్‌ ఫలితాలు కలుగును. సగం నుంచి మధ్యస్థ ఫలితాలు కలుగుతున్నాయి. 
 


Cancer Horoscope

ఇక ఈ రాశి ఉన్న  వ్యాపారస్తులకు 2024 వ్యాపారాభివృద్ధి . రైతాంగానికి మధ్యస్థ ఫలితాలున్నాయి. రాజకీయ నాయకులకు 2024 బాగా కలసివచ్చును. విద్యార్థులకు 2024 అనుకూలమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. సినీ, కళారంగం వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలసివచ్చును. స్త్రీలకు కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు వేధించును. ఉద్యోగస్తులకు ఆర్థికపరముగా ఈ సంవత్సరం కలసివచ్చును. ధనలాభము, వస్తులాభము వంటివి కలుగును. ఆర్థికపరముగా 2024 కర్కాటకరాశి వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధిని కలిగించును. వ్యాపారస్తులకు ఆర్ధికపరమైనటువంటి లాభాలు చేకూర్చును. రైతాంగం వంటి రంగాలలో ఉన్నటువంటి వారికి ఆర్థిక లాభాలు తెచ్చిపెట్టును. 


15.4.2024 నుండి వత్సరాంతం వరకు  గృహాలలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలుంటాయి.  వృత్తి, ఉద్యో గాల్లో గుర్తింపు లభిస్తుంది. నిన్నటివరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. అయితే సంవత్సరంలో చివరి మూడు నెలలు  పిల్లల పట్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. నూతన వ్యక్తులు పరిచయమవుతారు.

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

Latest Videos

click me!