మిథున రాశి అబ్బాయిల వ్యక్తిత్వం ఇలానే ఉంటుంది..!

Published : Feb 28, 2022, 12:35 PM IST

జోతిష్య శాస్త్రం ప్రకారం.. మిథున రాశి అబ్బాయిల వ్యక్తిత్వం , లక్షణాలు ఎలా ఉంటాయో  ఓసారి చూద్దామా..

PREV
16
మిథున రాశి అబ్బాయిల వ్యక్తిత్వం ఇలానే ఉంటుంది..!

మనం ఎవరితోనైనా స్నేహం చేయాలన్నా.. ప్రేమగా ఉండాలన్నా.. లేక పెళ్లి అనే బంధంలోకి అడుగుపెట్టాలి అనుకున్నా.. వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. మీరు కనుక.. మిథున రాశి అబ్బాయిల జీవితంలోకి అడుగుపెట్టాలి అనుకుంటే వారి గురించి తెలుసుకోవాల్సిందే. జోతిష్య శాస్త్రం ప్రకారం.. మిథున రాశి అబ్బాయిల వ్యక్తిత్వం , లక్షణాలు ఎలా ఉంటాయో  ఓసారి చూద్దామా..

26
Gemini

మిధునరాశి వారు ద్వంద్వ మనస్తత్వం లేదా ద్వంద్వ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఒక వైపు, వారు భావోద్వేగ, శ్రద్ధ, నిస్వార్థంగా ఉంటారు. మరోవైపు, వారు జిత్తులమారి, స్వార్థంగా.. గందరగోళంగా ఉంటారు. కెరీర్ ఎల్లప్పుడూ వారి ప్రాధాన్యత. వారు రిలేషన్‌షిప్‌లో ఉన్న అమ్మాయి గురించి  పూర్తిగా తెలుసుకోరు. వారి నుంచి మంచి పార్ట్ నర్ కావాలి అనుకునే అమ్మాయిలకు వీలైనంత వరకు దూరంగా ఉంటారు.

36

మిథున రాశి  పురుషులు బయటకు వెళ్లడం, పార్టీలు చేసుకోవడం ఇష్టపడతారు. వారి అద్భుతమైన వ్యక్తిత్వాన్ని చూసి  అందరూ మెచ్చుకుంటారు. కొత్త సాహసాలు చేయడానికి ఇష్టపడతారు. తమను తాముు ఎప్పుడూ యాక్టివ్ గా ఉండటానికి ఇష్టపడతారు.

46
Gemini

మిథున పురుషులకు  ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా   తెలుసు. మంచిగా మాట్లాడి అందరి మెప్పు పొందుతారు. ఎదుటివారికి వినడానికి ఆసక్తి కలిగించేలా కథలు చెప్పడంలోనూ వీరు బాగా నేర్పరులు. ఎదుటి వారికి మంచి సలహాలు ఇవ్వడంలో ముందుంటారు. 

56

వీరు అన్ని విషయాలను తమ వైపు మాత్రమే ఆలోచిస్తారు. ఎదుటివారి గురించి పెద్దగా పట్టించుకోరు. కేవలం తమ ఇష్టాల కోసమే మాత్రం పరుగులు పెడుతూ ఉంటారు. ఇక వీరికి తమ ప్రేమను తెలియజేయడం మాత్రం రాదు. ఎంత ఎక్కువ ప్రేమించినా.. ఆ విషయాన్ని మాత్రం నోరు తెరచి చెప్పరు.

66

మిథున రాశివారు  చాలా స్పష్టంగా కనిపించే ద్వంద్వ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారు ఒక క్షణం సంతోషంగా ఉంటారు. ఆ వెంటనే  మరుసటి క్షణం విచారంగా ఉంటారు. వారు నిజంగా వ్యక్తిని ప్రేమిస్తారు. కానీ వారితో ఎక్కువ సేపు ఉండలేరు.  ఎక్కువ కాలం ఒకే రిలేషన్ లో ఉండటం వీరికి నచ్చదు. వీరు ఒక వ్యక్తిని ఇష్టపడటానికి కూడా చాలా ఎక్కువ సమయం తీసుకుంటారు. వీరితో ఏదీ అంత ఈజీ కాదు. 

click me!

Recommended Stories