2023లో కుంభ రాశి వారి ఫలితాలు...!

First Published | Dec 11, 2022, 11:01 AM IST

నూతన సంవత్సరం 2023లో కుంభ రాశి వారికి  మీరు పనిచేసే రంగాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. 

 ఈ సంవత్సరంలో  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి   ఎలా ఉండబోతోంది?  ఎవరికి శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ సంవత్సర ఫలాలు లో తెలుసుకుందాం.

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):

2023 సంవత్సరంలో ఈ రాశివారి గోచారం పరిశీలించగా శుభకాలం నడుస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబందించిన వార్తలు వింటారు. మీ కెరీర్ ని మలుపు తిప్పే ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి.  మీరు పనిచేసే రంగాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేస్తారు. ఆర్ధికంగా మంచి ఫలితాలు ఉన్నాయి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది.  కనకధారాస్తవం పఠించాలి.

ఈ రాశివారి నెలవారీ ఫలితాలలోకి వెళితే... 
 
జనవరి 2023
  
ఈ నెలలో  కార్యసిద్ధి, వాహనయోగం ఉన్నాయి. మీ పిల్లలు  విజయం ఉత్సాహాన్నిస్తుంది.  వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే అవకాశాలున్నాయి. జాతక పొంతన ప్రధానం. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. అయితే ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. నెల ప్రారంభంలో పనులు మందకొడిగా సాగుతాయి.  మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి.  సుబ్రహ్మణ్యస్వామి స్మరణ శుభప్రదం.
 
 లవ్ లైఫ్ : కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేస్తారు. మీ దాంపత్య జీవితం మెరుగ్గా ఉంటుంది. ప్రేమ యాత్రలు చేస్తారు. ఆర్ధికంగా మంచి ఫలితాలు ఉన్నాయి.  ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మీ కుటుంబంలో రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. 

ఉద్యోగం-వ్యాపారం: వ్యాపారస్దులు పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. ఉపాధి పథకాలు చేపడతారు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వస్త్రవ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్దులకు పరీక్షాకాలం.

 ఆరోగ్యం:  మాస మధ్యమందు ఆరోగ్య బాధలు ,అధికారుల ఒత్తిడి ,ధార్మిక పనులు నెరవేర్చుట ,మనోవ్యధగా ఉండుటకు అవకాశం ఉన్నది.మాసాంత్యంలో స్త్రీల బాధలు , భార్యా,పుత్రులతో విరోధములు, నేత్ర బాధలు వచ్చుటకు అవకాశం ఉన్నది. ఈ రాశి వారు చిత్ర గుప్త పూజలు చేయుట మంచిది .
 

Aquarius

ఫిబ్రవరి 2023

ఈ నెలలో అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  అయినా  అవిశ్రాంతంగా శ్రమిస్తారు.  ఖర్చులు మాత్రం అదుపులో ఉండవు. ఎన్ని ఎలా ఉన్నా మీరు ఎదురుచూస్తున్న ఒక సమాచారం ఊరటనిస్తుంది.  ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టండి.  వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. అధికారులతో సంప్రదింపులు కొత్త మలుపు తిరుగుతాయి. ఆచితూచి అడుగేయాలి. ఏకపక్ష నిర్ణయాలు తగవు.  మీ శ్రీమతి సలహా పాటించండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం.  కలిసిరాని గ్రహాలు అడ్డు పడటం వలన కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. యత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆశావహ దృక్పథంతో మెలగండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం రోజు దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది. 


లవ్ లైఫ్:  ప్రేమికులకు అనుకూలం. ఒకరినొకరుకు అర్దం చేసుకుంటారు. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ప్రారంభోత్సవాలకు అనుకూలం. ఆప్తులను వేడుకకు ఆహ్వానిస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. సంతానం ధోరణి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. 
 
ఉద్యోగం-వ్యాపారం:  కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. సమర్ధతకు ఏమంత గుర్తింపు ఉండదు.  ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదామార్పు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. ప్రయాణం సాఫీగా సాగుతుంది.
 
ఆరోగ్యం:   కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. ఈ క్రమంలో దెప్పి పొడిచే  బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. సమయానికి ఆహారనియమాలను పాటించాలి.  ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే బాగుంటుంది 

మార్చి 2023

ఈ రాశివారికి   మంచి రోజులు నడుస్తున్నాయి.  కుటుంబ విషయాల్లో  మీ  సంకల్పం నెరవేరుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. మీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి ప్రాణం ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలను ఇవ్వటమే కాకుండా ఆర్ధిక సహాయాన్ని సైతం చేస్తారు.విలసాలకు వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సోమవారం శివాలయంలో అభిషేకం చేసుకోవడం మంచిది.


లవ్ లైఫ్ :అపార్దాలు తొలిగి కుటుంబంలో సుఖ, సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. మీ లైఫ్ పార్టనర్ తో కలిసి విజయాన్ని సాధిస్తారు. ప్రయత్నకార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్థాయి. కుటుంబం ఆర్దిక విషయమై టెన్షన్ లో ఉన్నప్పుడు  ఆకస్మిక ధనలాభం ఉంటుంది. 
  
ఉద్యోగం-వ్యాపారం:  అధికారుల నుంచి ఒత్తిడి.  ఐటీ రైట్స్ ,నమ్మిన వారి మోసం. ఈ చికాకులు తాత్కాలికమే. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు.

ఆరోగ్యం:    కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో  శ్రద్ధ వహించడం మంచిది.  మనస్తాపము, అనారోగ్యం కలుగు సూచనలున్నాయి. మానసిక ఒత్తిళ్ళు అధికమగు సూచనలు. గ్రహ అనుకూలం ప్రభావంచేత ఎన్ని సమస్యలు ఏర్పడినప్పటికి మీ శ్రమతో, ఆలోచనతో ధైర్యంగా ముందుకు వెళ్ళి విజయం పొందెదరు.   దుర్గాదేవిని పూజించాలి.  

ఏప్రియల్  2023


ఈ నెలలో ఈ  రాశి వారికి   మధ్యస్తముగా ఉంటుంది.  శని ప్రభావం ఉంటుంది కాబట్టి.. ఆరోగ్య, కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించండి.  కుటుంబంలో వాదనలు, సమస్యలు ఉండే అవకాశముంది. మనస్తాపము, అనారోగ్యం వచ్చే అవకాశాలున్నాయి. మానసిక ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశముంది. ఉద్యోగస్తులకు ప్రతికూల పరిస్థితులు, వ్యాపారస్తులకు ఇబ్బందులు కలిగే సూచనలున్నాయి.  ఎన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ.. ధైర్యంగా ముందుకు వెళ్లి విజయం సాధిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరున్ని, దుర్గాదేవిని పూజించడం మంచిది.

 
లవ్ లైఫ్ : కుటుంబ పరంగా ఖర్చులు పెరుగే అవకాసం.  శ్రమ కాస్త పెరుగుతుంది. కుటుంబసభ్యులతో ప్రేమగా మెలగాలి.  మీ లైఫ్ పార్టనర్ తో కలిసి గృహంలో మార్పుచేర్పులు చేస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.బంధు, మిత్రులు కలుస్తారు.  మీ భాగస్వామితో కొద్దిపాటి విభేదాలు ఉన్నా...కుటుంబమే మనకు పూర్తి సపోర్ట్ ఉంటుందని గుర్తు చేసుకోండి.  

ఉద్యోగం-వ్యాపారం:  వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ధనప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. చిన్నవ్యాపారులకు ఆశాజనకం.  కనకధారాస్తవం పఠించాలి.
 

ఆరోగ్యం: కీళ్ళకు సంబంధించి బాధలు అధికంగా ఉండును. ఔషధ వాడకం అధికంగా ఉండును. వృధ్యాప్య సమస్యలను బూతద్దంలో చూడకండి. భగవత్ ధ్యానం, ధైర్యమే నయం కానీ సమస్యలకు పరిష్కారం చూపెడుతుందని మర్చిపోవద్దు.

మే  2023

ఈ నెలలో మీ పరిస్థితులు అన్నీ మెరుగుపడతాయి. ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆత్మీయుల ఆహ్వానం సంతోష పరుస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరచరాస్తుల విక్రయంలో మెలకువ వహించండి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు. కుటుంబ వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. శనగలు, తాంబూలాన్ని దానం ఇవ్వడం మంచిది. ఆదిత్య హృదయం పారాయణ చేయాలి.

లవ్ లైఫ్ :  ప్రస్తుతం కుటుంబ పరంగా ఉన్న  ఈ చికాకులు తాత్కాలికమే. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. మీ శ్రీమతి తీరును గమనించి మెలగండి. 

ఉద్యోగం-వ్యాపారం:  పరీక్షా సమయం. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రతికూల పరిస్థితులు, వ్యాపారస్తులకు ఒత్తిళ్ళు కలిగే సూచనలు.   ఘర్షణలు, మానసిక వేదన అధికముగా ఉండును.  గొడవలకు దూరంగా ఉండటం మంచిది ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది అని తెలియచేస్తున్నాము. 

ఆరోగ్యం:  మీ ఆరోగ్యం చక్కగా ఉంది. మానసికంగా ఉల్లాసముగా ఈ నెల గడుస్తుంది. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలు సమస్యలు తెచ్చిపెడతాయి. ఆచి,తూచి అడుగువేయండి. ఆరోగ్య విషయమై అనవసర అనుమానాలతో మనశ్సాంతి కోల్పోకండి.
 

జూన్   2023
 
ఈ నెలలో   విశేషమైన శుభఫలితాలు ఉన్నాయి. ప్రారంభించిన ప్రతీ పని విజయవంతంగా పూర్తవుతుంది. ఆర్ధికంగా ఎదుగుతారు. ఆచార సంప్రదాయాలను గౌరవిస్తారు. ఇంట్లో శుభకార్యప్రసక్తి వస్తుంది . సమాజంలో కీర్తి పెరుగుతుంది.పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మాసాంతంలో ఒక మంచివార్త వింటారు. ఇష్టదేవతను స్మరించాలి.

లవ్ లైఫ్ :    కుటుంబసభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. జీవి భాగస్వామి సాయింతో చేపట్టిన పనులను మరింత ఉత్సాహంగా పూర్తిచేస్తారు. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో  కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు.ఇష్టదేవతారాధన శుభప్రదం.

ఉద్యోగం-వ్యాపారం: పరిస్దితులు మెల్లిగా చక్కబడుతున్నాయి.    గ్రహ అనుకూల ప్రభావంచేత ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగును. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు లాభము, వ్యాపారస్తులకు వ్యాపార లాభము కలుగును. కుటుంబ సౌఖ్యము, ఆనందము కలుగును. విద్యార్థులకు అనుకూలమైనటువంటి మాసం.

ఆరోగ్యం: మీ ఇంట పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మీ జన్మరాశి  గ్రహ సంచార ప్రభావం వారిపై పడుతోంది. అందుచేత గ్రహ దోష నివారణలు పాటిుస్తూ ..ఆరోగ్య విషయమునందు జాగ్రత్తలు వహించాల్సన అవసరం. 
 

జూలై   2023

ఈ నెలలో   ఆనందాన్నిచ్చే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగులకు అనుకూల కాలం. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో  కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు.ఇష్టదేవతారాధన శుభప్రదం.


లవ్ లైఫ్ : జీవన భాగస్వామి సహకారంతో  ఆనందాన్నిచ్చే సంఘటనలు చోటుచేసుకుంటాయి. మీకు పూర్తిగా అనుకూల కాలం.  మీ కుటుంబ జీవితం బాగుంది.   ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ధనమును ఖర్చు చేసెదరు. మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితములు కలుగును.  కేతువు సంచారము వలన స్త్రీలతో జాగ్రత్త వహించాలి.  కుటుంబము నందు కొన్ని సమస్యలు బాధించినా భయపడాల్సిన పనిలేదు.


ఉద్యోగం- వ్యాపారం:   కలిసొచ్చే కాలమే కానీఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మధ్యస్త సమయము.  వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ధనప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. చిన్నవ్యాపారులకు ఆశాజనకం.  సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తి, ఉద్యోగరంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది.  రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. 

 ఆరోగ్యం:    మధుమేహం ఉన్నవారికి జాగ్రత్త సూచన.  మానసిక ఒత్తిళ్ళకు దూరంగా ఉండాలని సూచన. ఈ  రాశివారికి ఆరోగ్య సమస్యలు ఒత్తిళ్ళు అధికముగా ఉండును. మాసం మద్యలో   గ్రహముల అనుకూల స్థితి వలన సమస్యల నుంచి బయిటపడతారు.  
 

ఆగస్ట్    2023

 ఈ నెలలో  మీకు అనుకూల ఫలితాలు ఉన్నవి. గ్రహాల అనుకూల స్థితి వలన కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. ఈ రాశివారికి ధనలాభము, వస్తులాభము, కీర్తి కలుగును. మీరు అనుకున్న ప్రతీ పని అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. ధనమునకు సంబంధించిన విషయాలు అనుకూలించును. ఒత్తిళ్ళు తగ్గును. శని,   అనుకూల ప్రభావం చేత చేసే ప్రతి పనిలో విజయం పొందెదరు. ప్రయాణములు లాభించును. స్త్రీ సౌఖ్యం కలుగును. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందెదరు. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు అధికముగా ఉండును.  మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి. 

లవ్ లైఫ్ : కొంత కాలము కుటుంబ వ్యవహారాలయందు, ఉద్యోగ వ్యాపారముల యందు ఓర్పుతో ఆచితూచి వ్యవహరించాలని సూచన.   సంతానం విద్యా విషయాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. స్త్రీలకు కుటుంబమునందు సమస్యలు అధికముగా ఉండును.  

ఆరోగ్యం:  కంగారు పెడుతున్న మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. వారితో ఎక్కువ సేపు ఆనందంగా గడపటానికి ప్రయత్నించండి.  మనోనిగ్రహమే అన్నిటికి మందు. ఆహార, విహారాల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. 

ఉద్యోగం- వ్యాపారం: వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబందించిన వార్త వింటారు. సాప్ట్ వేర్ ఉద్యోగులకు కలిసొస్తుంది. వేతనాలకు సంభందించిన ఓ  వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మీ సహోద్యుగలతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్దులకు కొన్ని సంఘటనలు ఉత్సాహపరుస్తాయి. కొత్త దిసగా ఆలోచింప చేస్తాయి.
 

సెప్టెంబర్    2023

  ఈ నెల లో  అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. మీరు  చేసే ప్రతీ పని అనుకూలించును.  అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు. ధనలాభము, సౌఖ్యము కలుగును. కుటుంబముతో ఆనందముగా గడి పెదరు. ఆరోగ్యము కుదుటపడును. రాజకీయ ఒత్తిళ్ళను మీ అనుభవముతో ఎదుర్కొనెదరు. నెల మధ్యలో గ్రహ సంచారము వలన కొంత చికాకులు ఏర్పడును. శని ప్రభావం చేత చేసే ప్రతి పని ఆచితూచీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.   మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయలి.  

లవ్ లైఫ్ :   బ్రహ్మచారుల కు వివాహాలు కుదిరే కాలం. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా అయినా పూర్తిగా లభిస్తాయి. భాగస్వామితో మీరు ఆనందంగా విహార యాత్రలు చేస్తారు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోండి. ప్రేమికులకు కలిసొచ్చే కాలం. గ్రహ దోష నివారణ చర్యలు సత్ఫలితమిస్తాయి. కుటుంబ వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.

ఉద్యోగం- వ్యాపారం:  వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలు  కనపడుతోంది. ధనలాభము కలుగును.గురు గ్రహ అనుకూల ప్రభావంచేత మీ సమస్యలను అధిగమించి ముందుకు సాగెదరు. ఉద్యోగస్తులకు పనియందు ఒత్తిళ్ళు ఉన్నప్పటికి అనుకున్న పని పూర్తి చేసెదరు.  ఉద్యోగస్తులకు కష్ట సమయము. శని సంచారము వలన ఆర్ధిక సమస్యలు వస్తాయి. గొడవలకు దూరంగా ఉంటే మంచిది.

ఆరోగ్యం:  గృహములో వారికి ఆరోగ్యం బాగా ఉంటుంది.గ్రహాల సంచారం బాగుండటం వలన కొత్త పరిస్థితులకు తగ్గటుగా కలిసిపోవటంవల్ల ప్రత్యేకంగా  ఆరోగ్య సమస్యలు అంటూ ఏమీ ఉండవు. అలాగే ఆరోగ్యంపై ఎప్పుడూ ప్రత్యేక శ్రద్దను చూపిస్తారు. దీనివల్ల వీరికి జీవితంలో సంతోషానికి కొదవే ఉండదు. 
 

అక్టోబర్    2023

 ఈ మాసం  మీకు అన్ని విధాలా  శుభదాయకం. తలిచిన కార్యాలు నిర్వఘ్నంగా సాగుతాయి. వివాహయత్నం ఫలిస్తుంది.  వివహ వేదికలు అన్వేషిస్తారు. పెట్టిపోతల్లో మెలకువ వహించండి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసాన్నిస్తాయి. 

లవ్ లైఫ్ :   కుటుంబ వ్యవహారాలూ సవ్యముగా ఆనందముగా గడుస్తాయి. బంధు,మిత్రులను కలుసుకొంటారు. ఆకస్మిక వార్తలు వింటారు. మాస ప్రారంభంలో  స్త్రీ సౌఖ్యము, మానసిక ఆందోళన. గ్రహాలు కుటుంబ జీవితంపై మంచి దృష్టిని ప్రసరింప చేస్తున్నాయి. దాంతో  మీ జీవితంలో కొన్ని మధురమైన క్షణాలను అందుకుంటారు.ఆనందాన్నిచ్చే సంఘటనలు చోటుచేసుకుంటాయి. 

ఉద్యోగం- వ్యాపారం:    సాప్ట్ వేర్   ఆఫీస్ లు తమ టార్గెట్ లతో కొద్దిపాటి విసుగు, చిరాకు తప్పదు. పై అధికారులతో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. వస్త్ర, పచారీ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. సరుకు నిల్వలో జాగ్రత్త.   ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. వ్యాపారస్దులు  ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. 

ఆరోగ్యం: ,కంటికి సంబంధించి బాధలు కలుగుటకు అవకాశం ఉన్నది. మాస మధ్య మందు ప్రమాదములు కలుగుటకు అవకాశమున్నది.  ఈ రాశి వారు శనివారం విష్ణు సహస్ర నామ పారాయణ,పూజలు చేయుట మంచిది
 

నవంబర్    2023

ఈ నెలలో   గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. అనుకున్నది సాధిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. అనుకున్నఫలితాలు సొంతం అవుతాయి. ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. చేపట్టే పనుల్లో సఫలీకృతులు అవుతారు. బంధుమిత్రులతో శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సూర్య ఆరాధన మనోబలాన్ని ఇస్తుంది.

లవ్ లైఫ్ : మాసం మధ్యలో  కుటుంబ విషయాల్లో  తొందరపాటు చర్యలు, స్థాన చలనము. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.  మాసం చివరలో గృహ సౌఖ్యం, ఆర్దిక లాభం, హెచ్చును. పెద్దవారిని కలుసుకొని ఆశీర్వచనములు పొందుదురు.  పిల్లలకు మధ్య ఫలములు, స్త్రీలకు కుటుంబమునందు సమస్యలు ఎక్కువగా ఉండును. అప్పుల ఒత్తిడి ఉంటుంది. మిత్రులు సాయం చేస్తారు. 

ఆరోగ్యం:  కుటుంబంలోని ఒకరి ఆరోగ్య సమాచారం కంగారుపెడుతుంది. అయితే కొద్ది రోజుల్లోనే అన్ని సర్దుకుంటాయి. వారి  ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్య పరంగా పూర్తిగా సమీక్షించుకుంటారు. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోండి.  
 

డిసెంబర్    2023

ఈ నెలలో   ఖర్చులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. ఊహించని కొన్ని పరిస్థితులు మీ ఉత్సాహాన్ని నీరుగారుస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. మొహమాటాన్ని దరిచేరనీయకండి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఆగ్రహావేశాలను దరిచేరనీయకండి.  శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. కొంతమంది మీ యత్నాలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. . మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దుర్గాదేవిని మంగళవారం రోజు పూజించడం మంచిది.

లవ్ లైఫ్ : ఆర్ధిక విషయాలు అనుకూలించటంతో  కుటుంబములోని సమస్యలు తొలగుతాయి.  మీ భాగస్వామి ఇచ్చే ధైర్యమే మీకు పెద్ద బలం. కుటుంబపరంగానూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. ఉద్యోగులకు అనుకూల కాలం. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. 

ఆరోగ్యం:   స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు అవసరమవుతాయి. మెల్లిగా ఆరోగ్య సమస్యలు తొలుగుతాయి.  ఉల్లాసంగా ఉంటేనే ఆరోగ్యం చక్కబడుతుంది. అనుకూలత కోసం గ్రహ జపాలు అవసరం.

ఉద్యోగం- వ్యాపారం :  పనిచేయు చోట శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. నూతన వ్యాపారాలకు అనుకూలం. సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు సంఘ వ్యవహారాలతో తీరిక ఉండదు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది.  ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు.ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట అధికం.

Latest Videos

click me!