Zodiac sign: ఈ రాశుల వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి..!

Published : Jul 13, 2022, 03:00 PM IST

 మనిషి ఎదురుగా లేని సమయంలో వారి గురించి చెడుగా మాట్లాడకుండా వీరు ఉండలేరు. ఈ కింద రాశులవారు కూడా అంతే అంట. ఎదుటివారికి ఎప్పటికప్పుడు వెన్నుపోటు పొడవాలని చూస్తూ ఉంటారు. 

PREV
16
Zodiac sign: ఈ రాశుల వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి..!

ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ పర్ఫెక్ట్ కాదు.  కొందరు పూర్తిగా మంచిగా ఉంటారు. కొందరు చెడుగా.. ఇతరుల పట్ల ప్రతికూలంగా ఉంటారు. ఇక కొందరు.. నిత్యం ఎవరి మీదో ఒకరి మీద చాడీలు చెబుతూనే ఉంటారు. మనిషి ఎదురుగా లేని సమయంలో వారి గురించి చెడుగా మాట్లాడకుండా వీరు ఉండలేరు. ఈ కింద రాశులవారు కూడా అంతే అంట. ఎదుటివారికి ఎప్పటికప్పుడు వెన్నుపోటు పొడవాలని చూస్తూ ఉంటారు. ఈ రాశుల వారితో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..
 

26

1.మిథున రాశి..

మిథున రాశివారిని గాసిప్ కింగ్స్, లేదా క్వీన్స్ చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు ఎదుటివారి గురించి చాడీలు చెప్పడానికి వీరు ముందు ఉంటారు. వారు చెప్పే చాడీల వల్ల ఎదుటివారు ఎంత ఇబ్బందిపడుతున్నారు అనే విషయాన్ని మాత్రం వీరు ఆలోచించరు. ఆ సమయంలో తమకు ఆనందం కలిగిందా లేదా అని మాత్రమే వారు ఆలోచిస్తారు.

36

2.కర్కాటక రాశి..

కర్కాటక రాశివారు చాలా సున్నితంగా ఉంటారు. చాలా ఎమోషనల్. అందరితోనూ ప్రేమగా ఉంటారు. కానీ.. తమకు నచ్చినట్లుగా ఎదుటివారిని మార్చుకోవడంలో ముందుంటారు. దాని కోసం వారు ఏమి చేయడానికైనా సిద్దంగా ఉంటారు. తాము క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎదుటివారికి వెన్నుపోటు పొడవడానికి కూడా వీరు వెనకాడరు. 

46

3.సింహ రాశి..

ఈ రాశివారు చాలా దయగా ఉంటారు. అయినప్పటికీ.. ఎవరిమీద అయినా పగ ఉంటే.. వారి విషయంలో వారు చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు. ఈ రాశివారు తాము విజయం సాధించడం కోసం.. ఎవరినైనా కిందకు లాగడానికి ముందుంటారు. వెన్నుపోటు పొడవడానికి కూడా వెనకాడరు.

56

4.కన్య రాశి..

కన్య రాశివారు ఎదుటివారిని ఎంత హీనంగా అయినా విమర్శించడంలో ముందుంటారు. తమను తాము ఎక్కువగా చేసి చూపించుకోవడం కోసం... వీరు ఎదుటివారిని ఎంత తక్కువ అయినా చేయడానికి ముందుంటారు. తమను తాము అందరికన్నా ఉన్నంతంగా చూపించుకోవడం కోసం...  ఇతరులను తక్కువ చేయడానికి ముందుకు వస్తారు. అబద్దాలు కూడా చెప్పేస్తారు.

66

5.వృశ్చిక రాశి..

ఈ రాశివారు.. తమను ఎవరైనా తక్కువ చేసి చూసినా.. కిందకు లాగాలని ప్రయత్నించినా అస్సలు సహించరు. వారి పై పగ తీర్చుకోవడానికి ముందుంటారు. వారి గురించి చెడు విషయాలను వ్యాపింపచేయడంలోనూ ముందుంటారు. ఇక.. వారికి ఏ విధంగా వెన్నుపోటు పొడవాలో వీరికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదు.

click me!

Recommended Stories