ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోకసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తిరుగులేని దెబ్బ తగిలింది. టీడీపి 23 శానససభ స్థానాలకు, 3 లోకసభ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. జగన్ తిరుగులేని విజయం చంద్రబాబును కలవరపెట్టే విషయమే.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోకసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తిరుగులేని దెబ్బ తగిలింది. టీడీపి 23 శానససభ స్థానాలకు, 3 లోకసభ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. జగన్ తిరుగులేని విజయం చంద్రబాబును కలవరపెట్టే విషయమే. తమ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను కాపాడుకోవడమే ఆయన కష్టం కావచ్చు.

25
చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ల కాలంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన 23 మందిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. వైసిపికి రాజీనామా చేయకుండానే వారు తెలుగుదేశంలో కొనసాగారు. భూమా అఖిలప్రియ వంటి కొంత మంది మంత్రి పదవులు కూడా చేపట్టారు.

35
జగన్ కు అధికారం దక్కడంతో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు వైసిపిలోకి రావడానికి ప్రయత్నాలు సాగించవచ్చునని అంటున్నారు. అయితే, జగన్ చంద్రబాబుకు గుణపాఠం చెప్పడానికి వారిని తన పార్టీలోకి ఆహ్వానిస్తారా అనేది ప్రశ్న. ఆహ్వానించడానికి ఎక్కువ అవకాశాలే ఉంటాయి.

45
తన పార్టీలోకి రావాలని అనుకునే ఎమ్మెల్యేలకు జగన్ ఓ షరతు పెట్టవచ్చునని అంటున్నారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తే తాను చేర్చుకుంటాననేది ఆ షరతు. చంద్రబాబు చేసిన తప్పు తాను చేయకూడదనే కారణంతో ఆయన ఆ షరతు పెడుతారని అంటున్నారు. అయితే, ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ఎమ్మెల్యేలు తిరిగి పోటీ చేసి మళ్లీ ఖర్చు పెట్టడానికి సిద్ధపడతారా అనేది ప్రశ్న. దాని వల్ల ఫిరాయింపులకు ఎక్కువ అవకాశం ఉండకపోవచ్చునని అంటున్నారు.

55
అలాంటి స్థితిలో తెలుగుదేశం పార్టీలో ఉంటూనే కొంత మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసే అవకాశాలు కూడా లేకపోలేదనే మాట వినిపిస్తోంది. జగన్ దీన్ని ఏ మేరకు ఆహ్వానిస్తారనేది వేచి చూడాల్సిందే. (