నాగార్జునసాగర్ బైపోల్స్: ప్రభుత్వ లబ్దిదారులపై టీఆర్ఎస్ కన్ను

First Published Mar 28, 2021, 12:30 PM IST

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి  జరిగే ఉప ఎన్నికల్లో ప్రభుత్వం ద్వారా లబ్దిపొందిన వారిపై టీఆర్ఎస్ కేంద్రీకరించనుంది.

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ప్రభుత్వం ద్వారా లబ్దిపొందిన వారిపై టీఆర్ఎస్ కేంద్రీకరించనుంది.
undefined
గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన అనారోగ్యంతో సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మరణించాడు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్్యంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరగనుంది.
undefined
ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా జానారెడ్డి పోటీ చేస్తున్నాడు. ఈ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధి పేరును టీఆర్ఎస్, బీజేపీలు ఇంకా ప్రకటించలేదు.
undefined
ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ది పొందిన వారి వివరాలను టీఆర్ఎస్ సేకరించింది. ఈ ఒక్క నియోజకవర్గంలోనే 1.52 లక్షల మందికి ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ కార్యక్రమాలు అందాయని టీఆర్ఎస్ నాయకత్వం గుర్తించింది.
undefined
ఈ నియోజకవర్గంలోని 1.53 లక్షల మంది లబ్దిదారులను కలవాలని సీఎం కేసీఆర్ ఈ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నేతలకు సూచించారు.
undefined
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు భీమా, గొర్రెల పంపిణీ, ఫీ రీ ఎంబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్, ఆరోగ్యశ్రీ, రూపాయికే కిలో బియ్యం వంటి సంక్షేమ పథకాల లబ్దిదారులను కలిసి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటు చేయాలని కోరనున్నారు.
undefined
ఈ ఉఫ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిని టీఆర్ఎస్ ఇంకా ప్రకటించలేదు.కానీ టీఆర్ఎస్ నేతలు మాత్రం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
undefined
ఇప్పటికే డజన్ మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తమకు కేటాయించిన మండలాలు, గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.ఆయా గ్రామాల్లో లబ్దిదారుల జాబితా ఆధారంగా టీఆర్ఎస్ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
undefined
ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కే ఓటు వేయాలని ప్రభుత్వం ద్వారా లబ్దిపొందినవారికి నేరుగా లేఖలతో పాటు ఎస్ఎంఎస్ చేయాలని ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేసింది.
undefined
రాష్ట్రంలోని దాదాపుగా ప్రతి ఇంటిని తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు చేరాయని తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 26వ తేదీన అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే.
undefined
click me!