టీడీపీలో ముగ్గురికి ప్రమోషన్: గల్లా జయదేవ్ ఫ్యామిలీకి చంద్రబాబు పెద్దపీట

First Published Oct 16, 2019, 8:18 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముగ్గురు కీలక నేతలకు ప్రమోషన్ ఇచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలదాడి చేస్తున్న ముగ్గురు నేతలకు పొలిట్ బ్యూరో సభ్యులుగా అవకాశం కల్పించారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముగ్గురు కీలక నేతలకు ప్రమోషన్ ఇచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలదాడి చేస్తున్న ముగ్గురు నేతలకు పొలిట్ బ్యూరో సభ్యులుగా అవకాశం కల్పించారు.
undefined
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ను పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. గత ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ అభ్యర్థిగా విజయం సాధించిన గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ గళాన్ని బలంగానే వినిపిస్తున్నారు.
undefined
అటు లోక్ సభలోనూ ఇటు రాష్ట్రంలోనూ తనదైన శైలిలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన లోక్ సభ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశంపై నిండు లోక్ సభలో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని సంబోధిస్తూ ఆనాడు వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచారు.
undefined
ఇకపోతే గల్లా జయదేవ్ తల్లి మాజీమంత్రి గల్లా అరుణకుమారి సైతం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరిన ఆమెను పొలిట్ బ్యూరో సభ్యురాలుగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు.
undefined
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోలో స్థానం సంపాదించడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పొలిట్ బ్యూరో సభ్యులుగా ఛాన్స్ కొట్టేయ్యడం కూడా మామూలు విషయం కాదు. అలాంటిది గల్లా ఫ్యామిలీ నుంచి ఇద్దరు పొలిట్ బ్యూరో సభ్యులుగా ఛాన్స్ కొట్టేశారు.
undefined
ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు సైతం పొలిట్ బ్యూరో సభ్యులుగా అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు. వర్ల రామయ్య వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వంపై విమర్శలదాడి చేస్తున్నారు.
undefined
ఇటీవలే ముఖ్యమంత్రి వైయస్ జగన్ సొంత చిన్నాన్న అయినటువంటి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసి వివాదాల్లో ఇరుక్కుపోయారు. పోలీసులపైనా ప్రభుత్వంపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోలీసులు నోటీసులు సైతం జారీ చేసిన సంగతి తెలిసిందే.
undefined
మరోవైపు ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి కీలక నేతగా ఉన్న అచ్చెన్నాయుడుని సైతం టీడీపీ పొలిట్ బ్యూరోలోకి ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న అచ్చెన్నాయుడు అసెంబ్లీ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగుతున్నారు.
undefined
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా తెలుగుదేశం పార్టీ వాణిని బలంగా వినిపిస్తున్నారు అచ్చెన్నాయుడు. అంతేకాదు ప్రభుత్వ కార్యక్రమాలపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు అచ్చెన్నాయుడు.
undefined
ఇకపోతే గతంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా వ్యవహరించారు అచ్చెన్నాయుడు సోదరుడు దివంగత నేత ఎర్రన్నాయుడు. ఎర్రన్నాయుడు మరణం అనంతరం ఆయన కుటుంబం నుంచి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు అచ్చెన్నాయుడు.
undefined
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైనా, ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు చేస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న గల్లా జయదేవ్, అచ్చెన్నాయుడు, వర్ల రామయ్యలకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా అవకాశం కల్పించడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
undefined
ఇకపోతే గురువారం ఉదయం 11 గంటలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ పొలిట్ బ్యూరో సమావేశంలో 13 అంశాలపై కీలకంగా చర్చించనున్నారు.
undefined
తొలుత దివంగత నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య, కుచ్చులూరు బోటు ప్రమాదంలో మృతులకు సంతాపం తెలపనుంది టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం. అనంతరం తెలుగుదేశం పార్టీ నేతలపై దాడి, చంద్రబాబు నాయుడు, వర్ల రామయ్యలకు నోటీసులు, రైతు భరోసా, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించనున్నారు.
undefined
click me!