జగన్ బాటలో బాబు: ప్రశాంత్ కిషోర్ శిష్యుడితో చర్చలు?

First Published Sep 27, 2019, 7:43 AM IST

ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ నాయకత్వం రాజకీయ వ్యూహాకర్త కోసం ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.అయితే ఈ విషయమై కొన్ని రోజుల్లో స్పష్టత రానుంది.

ఏపీ రాష్ట్రంలో గత ఎన్నికల సమయంలో వైఎస్ఆర్‌సీపీ అనుసరించిన వ్యూహాన్ని టీడీపీ అనుసరించనుంది. అయితే ఈ విషయమై టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. త్వరలోనే ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
undefined
ప్రశాంత్ కిషోర్ అనుసరించిన వ్యూహాం ఆధారంగానే ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో ఉంది.ప్రశాంత్ కిషోర్ తరహాలోనే వ్యూహకర్త అవసరమని కొందరు టీడీపీ సీనియర్లు చంద్రబాబునాయుడు వద్ద ప్రస్తావించినట్టుగా సమాచారం.
undefined
ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ బెంగాల్ సీఎం మమత బెనర్జీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడ పలు పార్టీలతో ఒప్పందాలు చేసుకొన్నారు.ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహాకర్త కోసం టీడీపీ నేతలు అన్వేషిస్తున్నారు. గతంలో ప్రశాంత్ కిషోర్ టీమ్ లో పనిచేసిన రాబిన్ శర్మతో టీడీపీ నేతలు సంప్రదింపులు జరిపినట్టుగా ప్రచారం సాగుతోంది.
undefined
రాబిన్ శర్మ గతంలో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్ లో పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఐ ప్యాక్ ను వదిలిపెట్టాడు. అంతేకాదు రాజకీయ పార్టీలకు సర్వే చేసే పనులు చేస్తున్నాడు. దీంతో రాబిన్ శర్మను వ్యూహాకర్తగా నియమించుకోవాలని కూడ కొందరు టీడీపీ నేతలు ప్రతిపాదించినట్టుగా చెబుతున్నారు.
undefined
ఈ ప్రతిపాదనల మేరకు రాబిన్ శర్మతో టీడీపీ నేతలు ఓ దఫా చర్చించినట్టుగా ప్రచారం సాగుతోంది.అయితే ఈ ప్రచారాన్ని కొందరు టీడీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు.
undefined
ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ఆర్‌సీపీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహాకర్తగా ఉన్నాడు. ప్రశాంత్ కిషోర్ టీమ్ ఇచ్చిన సూచనల మేరకే జగన్ ఎన్నికల్లో అభ్యర్ధులకు టిక్కెట్లను కేటాయించారని అప్పట్లో ప్రచారం సాగింది.
undefined
ప్రశాంత్ కిషోర్ పై ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు తీవ్రమైన విమర్శలకు దిగాడు. చంద్రబాబుపై ప్రశాంత్ కిషోర్ కూడ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
undefined
ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లకు పైగా సమయం ఉంది. అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడితే ఎన్నికలు కొంత ముందుగా వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
undefined
ఈ నాలుగేళ్ల పాటు పార్టీని ముందుండి నడిపించేందుకు వ్యూహాకర్త అవసరమని కొందరు నేతలు అభిప్రాయంతో ఉన్నారు. అయితే ఈ అభిప్రాయంతో మరికొందరు నేతలు విభేదిస్తున్నారు. పార్టీ నాయకత్వం ఇంకా దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేదు.
undefined
click me!