మొన్న భూమా.. నేడు గంగుల: ఫ్యాక్షన్ సెంటర్‌లో బేస్ దిశగా బీజేపీ

First Published Aug 1, 2019, 7:12 PM IST

ఇటీవల జరిగిన ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోని కమలనాథులు.. కేంద్రంలో మాత్రం మళ్లీ అధికారాన్ని కేంద్రంలో అధికారాన్ని మాత్రం దక్కించుకున్నారు. దేశం మొత్తం మోడీ పవనాలు వీచినా.. ఏపీ మాత్రం కాషాయ నేతలకు మింగుడు పడటంలేదు. 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోని కమలనాథులు.. కేంద్రంలో మాత్రం మళ్లీ అధికారాన్ని కేంద్రంలో అధికారాన్ని మాత్రం దక్కించుకున్నారు. దేశం మొత్తం మోడీ పవనాలు వీచినా.. ఏపీ మాత్రం కాషాయ నేతలకు మింగుడు పడటంలేదు.
undefined
ఆంధ్రప్రదేశ్‌లో పాగా వేయడానికి భారతీయ జనతాపార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు! ఈ సారి మాత్రం ఏపీని వదిలిపెట్టేది లేదన్నట్లుగా బీజేపీ పావులు కదుపుతోంది. దానికి అనుగుణంగానే ఆ పార్టీ నాయకులు తరుచుగా రాష్ట్రంలో పర్యటిస్తూ.. అధికార- ప్రతిపక్షాలపై రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీలో మెజారిటీ నాయకులు వైసీపీ సర్కారు విధానాలు, జగన్ పనితీరుపై విమర్శలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
undefined
ఇక టీడీపీలోని కీలకనేతలపై ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నేతలను పార్టీలోకి ఆకర్షిస్తున్న కమలనాథులు..పలువురు పెద్ద తలకాయలకు సైతం కాషాయ జెండా కప్పేస్తోంది.
undefined
తాజాగా నంద్యాలలో తెలుగుదేశం పార్టీని మరోసారి దెబ్బతీసింది. సీనియర్ నేత గంగుల ప్రతాప్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. త్వరలో బీజేపీ జాతీయాధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాల సమక్షంలో ఆయన కాషాయ తీర్ధం పుచ్చుకోనున్నారు.
undefined
నంద్యాల ఉప ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిన గంగుల.. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధి విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయనకు ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో మంచి పట్టుంది.
undefined
ఈ క్రమంలో బుధవారం బీజేపీ నేతలు రామ్‌మాధవ్, మురళీధర్‌రావులు ప్రతాప్ రెడ్డితో మంతనాలు జరిపి.. బీజేపీలో చేరేలా చక్రం తిప్పారు. మరోవైపు కొద్దిరోజుల క్రితం మాజీ మంత్రి, భూమా అఖిల ప్రియ సోదరుడు భూమా కిశోర్ రెడ్డి బీజేపీలో చేరడంతో .. తాజాగా గంగుల సైతం కాషాయ కండువా కప్పుకుంటుండటంతో ఆళ్లగడ్డ, నంద్యాలలో బీజేపీకి బలమైన పునాదులు పడ్డట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
undefined
click me!