అసంతృప్తి: ఒకే వేదికపై దేవినేని, కేశినేని

First Published 16, Jun 2019, 3:50 PM

ఫేస్ బుక్ పోస్టుల ద్వారా తన అసంతృప్తిని వెళ్లగక్కిన విజయవాడ ఎంపీ కేశినేని నాని మాజీ మంత్రి దేవినేని ఉమాతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు వల్లే టీడీపీ తీవ్రంగా నష్టపోయిందని  కేశినేని నాని  అభిప్రాయపడుతున్నారు.
 

లోక్‌సభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ విప్ పదవిని కూడ తిరస్కరిస్తున్నట్టుగా ఫేస్ బుక్ వేదికగా వారం రోజుల క్రితం కేశినేని నాని ఫేస్‌బుక్ లో పోస్టు పెట్టాడు. ఆ తర్వాత కూడ వరుసగా ఫేస్ బుక్ వేదికగా పోస్టులు పెట్టి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
దేవినేని ఉమ తీరుతో కేశినేని నాని కొంత కాలంగా విబేధిస్తున్నాడు. అయితే ఈ పరిణామాల తర్వాత శనివారం నాడు దేవినేని ఉమ, విజయవాడ ఎంపీ కేశినేని నానిలు శనివారం నాడు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ రావు వర్ధంతి సభలో దేవినేని ఉమ, కేశినేని నానిలు పాల్గొన్నారు. తంగిరాల ప్రభాకర్ రావు ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసి నడవాలని ఈ ఇద్దరూ నేతలు పాల్గొన్నారు. కార్యకర్తలకు తాము అండగా ఉంటామని దేవినేని ప్రకటించారు. తనతో పాటు కేశినేని నానిని ఎప్పుడైనా కలవచ్చని దేవినేని ప్రకటించారు.
నందిగామ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఇద్దరూ నేతలు కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యకర్తలను కలిసి ధైర్యం చెప్పారు. తామిద్దరం అండగా ఉంటామని నేతలు హామీ ఇచ్చారు. ఏ కార్యక్రమంలో కూడ ఈ ఇద్దరు నేతలు తమ మధ్య అభిప్రాయబేధాలు లేవని నేతలు సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు ఇద్దరు నేతలు కూడ ఎక్కడ కూడ తమ ప్రసంగాల్లో కూడ తమ మధ్య అగాధం ఉందనే విషయం బయటపడకుండా జాగ్రత్త పడ్డారు.
పార్టీ అధికారానికి దూరమైనా కూడ పార్టీ నాయకత్వంలో ఎలాంటి మార్పు రాలేదని కేశినేని నాని అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయమై తన అభిప్రాయాలను చంద్రబాబు వద్ద కేశినేని నాని వ్యక్తం చేశారు.
ఫేస్‌బుక్ పోస్టుల ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేసిన నాని... తన అసంతృప్తికి కారణమైన దేవినేని ఉమతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొనడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.