మోడీతో మాటలు కలిపిన బాబు: ఏపీలో రాజకీయాల్లో మార్పులు సంభవించేనా?

First Published | Jul 26, 2020, 1:10 PM IST

చంద్రబాబునాయుడు ప్రధాని మోడీతో మాటలు కలపడంతో రాజకీయంగా ఏపీ రాష్ట్రంలో మార్పులు చేర్పులు సంభవించే అవకాశం ఉందా అనే చర్చ సాగుతోంది. 

అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో మాటలు కలిపారు.ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ఏపీ రాజకీయ సమీకరణాల్లో మార్సులు చేర్పులకు దారితీస్తాయా అనే చర్చకు తెరతీశాయి. అయితే కరోనా విషయంలోనే ఇది పరిమితమైందనే టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయాలతో సంబంధం లేదని తెలుస్తోంది.
undefined
2019 ఎన్నికలకు ఏడాది ముందే బీజేపీతో టీడీపీ మైత్రి తెగిపోయింది. ఎన్డీఏ నుండి టీడీపీ బయటకు వచ్చింది. కేంద్రంపై అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టింది. అయితే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఘోర పరాజయం పాలైంది.
undefined
Tap to resize

గత ఏడాది ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీ మధ్య తీవ్రమైన మాటల యుద్దం సాగింది. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైంది. టీడీపీకి చెందిన కొందరు నేతలు బీజేపీ, వైసీపీలో చేరారు. మరికొందరు నేతలు కూడ ఇదే బాటలో పయనించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
undefined
ఈ తరుణంలో చంద్రబాబునాయుడు పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి రోజూ పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్లు, వీడియో కాన్ఫరెన్లతో బిజీ బిజీగా గడుపుతున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో హైద్రాబాద్ లోనే ఎక్కువ కాలం చంద్రబాబునాయుడు గడిపాడు. ఈ సమయంలో కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఓ స్వచ్ఛంధ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ స్వచ్ఛంధ సంస్థ కరోనాపై పలు అధ్యయనాలు చేసింది.
undefined
కరోనాపై చంద్రబాబు పలువురు రిటైర్డ్ అధికారులు, డాక్టర్లు, శాస్త్రవేత్తలతో సలహాలు సూచనలు తీసుకొని రిపోర్టులను కేంద్రానికి పంపారు. కరోనాతో పాటు దాని ద్వారా చోటు చేసుకొన్న పరిణామాలపై ఎప్పటికప్పుడు ఈ నివేదికలను కేంద్రానికి పంపారు.
undefined
చంద్రబాబునాయుడు ఇప్పటికే సుమారు 19 నివేదికలను కేంద్రానికి పంపారు. ఈ నివేదికలు పంపే విషయంలో మోడీతో చంద్రబాబునాయుడు మాట్లాడినట్టుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబునాయుడు పంపిన నివేదికలను అధ్యయనం చేయాలని పీఎం ఆదేశించినట్టుగా ప్రచారం సాగుతోంది. కానీ, ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.
undefined
ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకొన్నాయి. ఎన్నికల తర్వాత ఈ విమర్శల జోరు తగ్గింది. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది.
undefined
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో కలిసి పనిచేయాలని జనసేన, బీజేపీలు నిర్ణయం తీసుకొన్నాయి. ఇప్పటికిప్పుడైతే టీడీపీ ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు బీజేపీ నాయకత్వంతో టీడీపీ మైత్రి కోసం ప్రయత్నాలు చేస్తోందనే ప్రచారం సాగుతోంది. ఇటీవల కాలంలో బీజేపీతో దగ్గరయ్యేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
undefined
బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రస్తుతం వైసీపీపై దూకుడుగానే వెళ్తోంది. ఇదే సమయంలోనే బీజేపీపై కూడ వైసీపీ అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఈ విషయమై గవర్నర్ కు బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాయడంపై ఆ పార్టీ నాయకత్వం కొంత అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా ప్రచారం సాగుతోంది.
undefined
టీడీపీకి అనుకూలంగా కన్నా లక్ష్మీనారాయణ వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలను కమల దళం కొట్టిపారేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చేర్పులకు కారణమౌతాయా అంటే ఇప్పటికిప్పుడే ఏం చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
undefined
గతంలో కూడ బీజేపీతో మైత్రిని చంద్రబాబునాయుడు వదులుకొన్నారు. గోద్రా ఘటన తర్వాత మోడీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. 2004 ఎన్నికల తర్వాత ఆయన బీజేపీకి దూరమయ్యారు. ఆ పార్టీతో పొత్తును పెట్టుకోమని స్పష్టం చేశారు. కానీ 2014 ఎన్నికల్లో బీజేపీతో దోస్తీ కట్టారు.
undefined
అయితే గతంలో చోటు చేసుకొన్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఏదైనా చోటు చేసుకొనే అవకాశాలను కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
undefined

Latest Videos

click me!