ఇక సామాన్యులకూ కరోనా వ్యాక్సిన్... ఈ హాస్పిటల్స్ లో మాత్రమే...
First Published | Mar 1, 2021, 10:22 AM ISTఅమరావతి: యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ గతకొంతకాలంగా ఇండియాతో తగ్గుముఖం పట్టింది. అంతేకాకుండా వ్యాక్సిన్ రాకతో ఈ మహమ్మారిపై ప్రజల్లో వున్న భయం దాదాపు తొలగిపోయింది. ఇప్పటికే ప్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ అందించగా తాజాగా సామాన్యులకు కూడా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్ లో ముందుగా వయసు పైబడిన వారు ముఖ్యంగా 60ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమయ్యింది. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి ఇవాళ్టి(సోమవారం) నుండి వ్యాక్సిన్ అందించనున్నారు. ఇలా కరోనా వ్యాక్సిన్ లభించే హాస్పిటల్స్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.