కామధేను పూజలో వైఎస్ జగన్.. పంచెకట్టు, కండువాతో అదిరింది (చూడండి)

Published : Jan 15, 2021, 02:36 PM ISTUpdated : Jan 15, 2021, 02:39 PM IST

కనుమ పండుగ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు గుంటూరు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం  నిర్వహించిన కామధేను పూజలో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. 

PREV
19
కామధేను పూజలో వైఎస్ జగన్.. పంచెకట్టు, కండువాతో అదిరింది (చూడండి)

కనుమ పండుగ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు గుంటూరు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం  నిర్వహించిన కామధేను పూజలో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. 

కనుమ పండుగ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు గుంటూరు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం  నిర్వహించిన కామధేను పూజలో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. 

29

పంచకట్టు, కండువతో కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి ఆ ప్రాంగణంలోని గోమాతలు, నందీశ్వరుల(ఎద్దు) అలంకరణలు చూశారు. అనంతరం గో పూజకు గోత్ర నామాలతో ఆయన సంకల్పం చేసుకున్నారు. 

39

వేద పండితులు, అర్చకుల వేద మంత్రాల నడుమ శ్రీ జగన్మోహన్ రెడ్డి గోమాతకు, దూడకు పట్టు వస్త్రాలు, పూలమాలలు, పసుపు కుంకుమ సమర్పించి హారతి ఇచ్చారు. గోమాత, దూడకు ఆయన ప్రదక్షిణ చేసి నమస్కరించారు. టీటీడీ అర్చకులు సిఎంను శేషవస్త్రంతో సత్కరించారు. 

49

ఇస్కాన్ ప్రతినిధులు శాలువతో సత్కరించి జ్ఞాపిక ను అందించారు. స్థానిక శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ముఖ్యమంత్రిని గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు.

59

గోపూజ వల్ల రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు ఆయన సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కామధేను పూజ కార్యక్రమంలో  టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రులు శ్రీమతి  మెకతోటి సుచరిత,శ్రీ  వెల్లం పల్లి శ్రీనివాస రావు, డిప్యూటి స్పీకర్ శ్రీ కోన రఘుపతి, ఎంపీ శ్రీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు, టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి, జెఈవో శ్రీ పి బసంత్ కుమార్, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, కలెక్టర్ శ్రీ శ్యా మ్యూల్ ఆనంద్, ఎస్పీ శ్రీ విశాల్ గున్ని, గుంటూరు జిల్లాకు చెందిన పలువురు శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

69

రాష్ట్ర దేవాదాయ శాఖ సహకారంతో  టీటీడీ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలోని 2679 ఆలయాల్లో ఉదయం 11.50 గంటలకు శాస్త్రోక్తంగా గోపూజ కార్యక్రమమాలు నిర్వహించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో తలపెట్టిన గోపూజ మహోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. 

79

తాడేపల్లి తన నివాసం నుంచి బయల్దేరి.. ఉదయం 11.30 సమయంలో నరసరావుపేటకు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌.. తొలుతగా మున్సిపల్‌ స్టేడియంలో వివిధ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం గోపూజ మహోత్సవంలో పాల్గొన్నారు.

89

2,147 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గోమాత, గో ఉత్పత్తుల గొప్పతనంపై భక్తులకు తెలియజేస్తూ ఆలయాల్లో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాట్లు చేశారు. 

99

‘ఒక గోవులో 33 కోట్ల దేవతలుంటారనేది ప్రతీతని, గోవును పూజిస్తే ఆ దేవతల కరుణా కటాక్షాలూ లభిస్తాయని’ గోపూజ మహోత్సవ విశిష్టత గురించి నరసరావుపేట ఇస్కాన్‌ టెంపుల్‌ కార్య నిర్వాహకుడు వైష్ణవ కృష్ణదాస్‌ వివరించారు. ప్రతి ఇంట్లో గోవులను పూజించాలన్నది సీఎం వైఎస్‌ జగన్‌ ఆచరించి చూపిస్తున్నారని ఆయన కొనియాడారు.

click me!

Recommended Stories