చంద్రబాబు గుండెల్లో గుబులు: రంగంలోకి రాంమాధవ్, అసలుకే ఎసరు

First Published Jun 19, 2019, 3:15 PM IST

అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భయంతో గడుపుతున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టబోయినట్లు ఫలితాలు రాబట్టిన చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్షనేతకు పరిమితమయ్యారు

అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భయంతో గడుపుతున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టబోయినట్లు ఫలితాలు రాబట్టిన చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్షనేతకు పరిమితమయ్యారు
undefined
అయితే ఆ హోదా ఉంటుందా ఊడుతుందా అన్న సందేహంలో చంద్రబాబు ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే ఫిరాయింపులు తన కుర్చీకి ఎక్కడ ఎసరుపెడుతోందా అని ఆందోళనతో రగిలిపోతున్నారట.
undefined
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకునేది లేదని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. దెబ్బకు దెబ్బతీస్తారనుకున్న జగన్ ఫిరాయింపులను ప్రోత్సహించనని తేల్చి చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకున్న చంద్రబాబుకు మరో పార్టీ నుంచి ముప్పు వస్తోందని భయపడుతున్నారట.
undefined
కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తోంది. భారత ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశారో లేదో అప్పుడు ఆపరేషన్ టూ స్టేట్స్ అన్నట్లు తెలుగు రాష్ట్రాలపై టార్గెట్ పెట్టింది కాషాయిదళం.
undefined
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపించింది బీజేపీ. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగురాష్ట్రాలకు చెందిన వ్యక్తి అయిన రామ్ మాధవ్ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ లో కీలక పాత్ర పోషించారు.
undefined
ఎప్పుడు వస్తారో, ఎలా వస్తారో కూడా తెలియనియ్యకుండా తన వ్యూహాలతో అవతలి పార్టీ నేతలకు వల వేయడం రామ్ మాధవ్ కు వెన్నతోపెట్టిన విద్య. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి డీకే అరుణను బీజేపీలోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేశారు.
undefined
అదే తరుణంలో టీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న జితేందర్ రెడ్డిని లాగేసుకుని ఒక సంచలనాలకు తెరలేపారు. న్నికలు పూర్తైన తర్వాత కూడా ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా తెలుగు రాష్ట్రాలపై రామ్ మాధవ్ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది.
undefined
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్ కీలక నేతలను బీజేపీలో చేర్చుకునే పనిలో పడ్డారట. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, టీడీపీకి చెందిన కీలక నేతలు సైతం బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారట. అందులోభాగంగా రామ్ మాధవ్ తో టచ్ లోకి వెళ్లారట. కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది
undefined
ఇకపోతే ఏపీలో సైతం రామ్ మాధవ్ ఆపరేషన్ ఆకర్ష్ కు మరింత పదునుపెట్టారని తెలుస్తోంది. ఇప్పటికే జనసేన నేత మాజీమంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఎంపీ కొత్తపల్లి గీతలను పార్టీలోకి తీసుకున్న బీజేపీ మరింత మందిపై ఫోకస్ పెట్టిందట.
undefined
అందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలతో టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే టీడీపీకి చెందిన జేసీ బ్రదర్స్ బీజేపీవైపు చూస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
undefined
అలాగే కృష్ణా జిల్లా నుంచి విజయవాడ ఎంపీ కేశినేని నాని సైతం బీజేపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. కేశినేని నాని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
undefined
ఈ నేపథ్యంలో రాయలసీమకు చెందిన పలువురు టీడీపీ నేతలను బీజేపీలో చేర్చుకోవాలని నిర్ణయించుకున్నారట రామ్ మాధవ్. అలాగే ఏపీ అసెంబ్లీలో బీజేపీ ప్రాతినిధ్యం సున్నా కావడంతో ఇతర పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని అసెంబ్లీలో బీజేపీ వాయిస్ వినిపించాలని చూస్తున్నారట.
undefined
అందులో భాగంగా జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు ఫోన్ చేసి కూడా ఆహ్వానించింది బీజేపీ. అలాగే టీడీపీలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలను నలుగురిని బీజేపీ సంప్రదించిందని తెలుస్తోంది. నేరుగా రామ్ మాధవ్ వారితో టచ్ లోకి వెళ్లారని కూడా సమాచారం.
undefined
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు లోనవుతారేమోనని చంద్రబాబు నాయుడు మదనపడుతున్నారట. ఫ్యామిలీతో యూరప్ ట్రిప్ వెళ్లినప్పటికీ మనసంతా ఏపీపైనే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
undefined
click me!