జగన్ కు ఆనాడే చంద్రబాబు హెచ్చరిక: ఇప్పుడు కేసీఆర్ తో నీటి యుద్ధం

First Published Aug 13, 2020, 9:02 AM IST

సంవత్సరం కిందకు గనుక మనం రివైండ్ చేస్తే..... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ ల మధ్య అతకం పోతకంగా నడుస్తున్న రోజుల్లో... కృష్ణ గోదావరి అనుసంధానం వంటి బృహత్ ప్రణాళికలను రచించారు. ఇరు రాష్ట్రాలు కలిసి కట్టుగా ఈ విషయంపై ముందుకు సాగాలని, కలిసి ఉమ్మడి ప్రాజెక్టును కూడా కట్టాలని సంకల్పించారు. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం మొదలైనట్టే కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై తెలంగాణ వర్గాలు తీవ్ర కామెంట్స్ చేస్తున్నారు. కేటీఆర్ ఏమో దోస్థానం వేరు, నీటి పంపకం వేరు అంటే... కేసీఆర్ ఏమో అన్నం పెట్టి మాట్లాడితే గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నాడు అని కామెంట్ చేసారు.
undefined
తెలంగాణ సర్కారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ... ఏపీ సర్కార్ మాత్రం ఈ విషయంలో ముందుకెళ్లడం మీదనే దృష్టి పెట్టింది. కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ కి ఒక లేఖ కూడా రాసింది. కేసీఆర్ మాటలు పట్టించుకోవద్దంటూ, అపెక్స్ కౌన్సిల్ లోనే తేల్చుకోవడానికి సిద్ధపడ్డట్టుగా తెలియవస్తుంది.
undefined
పోతిరెడ్డిపాడుద్వారా 80 వేలక్యూసెక్కుల నీటిని తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం సంకల్పించడంతో తెలంగాణ ప్రభుత్వానికి కోపం తెప్పించింది. అలా చేస్తే నాగార్జునసాగర్ కి నీరు కూడా రాదంటూ వాదిస్తూ అడ్డుచెబుతోంది. మరొపక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో.... ఇది కొత్తప్రాజెక్టు కాదని వాదిస్తుంది.
undefined
ఇందులోని వాదోపవాదాలను పక్కనబెడితే కృష్ణ నది మీద నడుస్తున్న గొడవ గోదావరి వైపు కూడా మల్లి, గోదావరి నది జలాలపై కూడా ఇరు రాష్ట్రాలు ఫిర్యాదులు చేసుకునే దగ్గరకు వచ్చాయి. ఇక ఈ వివాదం ఇప్పుడు కృష్ణకు ఒక్కదానికి మాత్రమే పరిమితం అవ్వకుండా రెండు ప్రధాన అంతర్ రాష్ట్ర నది జలాల వివాదంగా తయారయి కూర్చుంది.
undefined
ఒక సంవత్సరం కిందకు గనుక మనం రివైండ్చేస్తే..... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ ల మధ్య అతకం పోతకంగా నడుస్తున్న రోజుల్లో... కృష్ణ గోదావరి అనుసంధానం వంటి బృహత్ ప్రణాళికలను రచించారు. ఇరు రాష్ట్రాలు కలిసి కట్టుగా ఈ విషయంపై ముందుకు సాగాలని, కలిసి ఉమ్మడి ప్రాజెక్టును కూడా కట్టాలని సంకల్పించారు.
undefined
ఇరు ముఖ్యమంత్రుల మధ్య ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు, తొందరపడొద్దని ఆనాడే చెప్పారు. ఈ నిర్మాణాల వల్ల ఆంధ్రప్రదేశ్ కి నష్టం వాటిల్లోచ్చని, ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో ఉండిపోతుందని అన్నారు.కానీ వైసీపీ నాయకుల నుంచి మొదలు విశ్లేషకుల వరకు, జల వివాదాల పరిష్కారానికి దీర్ఘకాలిక సమాధానాలు వస్తుంటే, తట్టుకోలేకపోతున్నారు అంటూ చంద్రబాబు నాయుడు పై విమర్శనాస్త్రాలు సంధించారు.
undefined
ఆనాడు గోదావరి జలాలను శ్రీశైలం డాం లో ఎత్తి పోయాలని భావించారు.జగన్ అప్పట్లో కేసీఆర్ ఉదారతను కొనియాడుతూ కాళేశ్వరం ప్రారంభోత్సవానికి కూడా వచ్చారు. కానీ ఒక 9 నెలలు గడిచేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ విషయంలో ఇప్పుడు ఇరు రాష్ట్రాలు కత్తులు దూసుకుంటున్నాయి.
undefined
ఇరు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండడం వల్ల రాష్ట్రాల సెంటిమెంట్లు అనేవి ప్రధానంగా కనబడతాయి. తెలంగాణాలో కరోనా విజృంభిస్తున్న వేళ అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితుల్లోఆయనకు తెలంగాణ సెంటిమెంటు అత్యవసరం. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడడం రాష్ట్రప్రభుత్వ కింకర్తవ్యం కూడా!
undefined
బీజేపీ, జనసేనలు కలిసికట్టుగా వైసీపీని ఎదుర్కోవడంతోపాటుగా టీడీపీ ని కూడా తమ పక్షాన ఉంచుకోవాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి అనేది ఇక్కడ వారి వ్యూహం కావచ్చు. బీజేపీ తన సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయాలని చూస్తుంది.
undefined
click me!