Published : Jul 04, 2022, 01:53 PM ISTUpdated : Jul 04, 2022, 01:59 PM IST
విజయవాడ : అజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఏపీలో ఘనంగా ఏర్పాటుచేసారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి భారీ విగ్రహ ఆవిష్కరణ... అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అంతకుముందు అల్లూరి జయంతి వేడుకల కోసం ఏపీ పర్యటనకు విచ్చేసిన ప్రధానికి గన్నవరం విమానాశ్రయంలో సీఎం వైఎస్ జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు.