గ్లాస్ డిస్ ప్లేతో షియోమి ఎం‌ఐ సరికొత్త టి‌వి.. ధర ఎంతంటే ?

By Sandra Ashok Kumar  |  First Published Aug 12, 2020, 1:22 PM IST

 షియోమి దీనిని ప్రపంచంలోని మొట్టమొదటి ఆటొమేటెడ్ మెషీన్ ప్రాసెస్ ద్వారా ఉత్పత్తి చేసే ట్రాన్స్పరెంట్ టీవీ అని తెలిపింది, ఇది “అత్యాధునిక డిస్ ప్లే, సున్నితమైన ఇండస్ట్రియల్ డిజైన్”  మిశ్రమం అని వెల్లడించింది.


ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమి ఎం‌ఐ తాజాగా సరికొత్త టి‌విని లాంచ్ చేసింది. ఎం‌ఐ టివి లక్స్  ట్రాన్స్పరెంట్ ఎడిషన్‌ పేరుతో చైనా మార్కెట్ కోసం షియోమి ఆవిష్కరించింది. షియోమి దీనిని ప్రపంచంలోని మొట్టమొదటి ఆటొమేటెడ్ మెషీన్ ప్రాసెస్ ద్వారా ఉత్పత్తి చేసే ట్రాన్స్పరెంట్ టీవీ అని తెలిపింది,

ఇది “అత్యాధునిక డిస్ ప్లే, సున్నితమైన ఇండస్ట్రియల్ డిజైన్”  మిశ్రమం అని వెల్లడించింది. అధిక రిఫ్రెష్ రేట్, పూర్తి-హెచ్‌డి  ఓ‌ఎల్‌ఈ‌డి ప్యానెల్‌తో వస్తుంది. ఎం‌ఐ టివి లక్స్ ట్రాన్స్పరెంట్ ఎడిషన్ కింద భాగంలో స్పీకర్లు ఉంటాయి.

Latest Videos

undefined

ఎం‌ఐ టీవీ లక్స్ ట్రాన్స్పరెంట్ ఎడిషన్ ధర
ఎం‌ఐ టీవీ లక్స్ ట్రాన్స్పరెంట్ ఎడిషన్ ధర సిఎన్‌వై 49,999 (ఇండియాలో సుమారు రూ. 5.37 లక్షలు). ఎం‌ఐ.కామ్‌లో ప్రీ-ఆర్డర్‌ల కోసం సిద్ధంగా ఉంది. ఆగస్టు 16 నుండి చైనాలో విక్రయించబడుతుంది. ప్రస్తుతానికి అంతర్జాతీయ లభ్యతపై ఎలాంటి సమాచారం లేదు.

also read స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లావా స్పెషల్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్లు ...

ఎం‌ఐ టీవీ లక్స్ ట్రాన్స్పరెంట్ ఎడిషన్ ఫీచర్లు
ఎం‌ఐ టీవీ లక్స్ ట్రాన్స్పరెంట్ ఎడిషన్ 55-అంగుళాల పూర్తి-హెచ్‌డి (1,920x1,080 పిక్సెల్‌లు) ట్రాన్స్పరెంట్  ఓ‌ఎల్‌ఈ‌డి  డిస్ ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. 150,000: 1 స్టాటిక్ కాంట్రాస్ట్ రేషియో, 10-బిట్ ప్యానెల్, క్వాడ్-కోర్ కార్టెక్స్-ఎ73 సిపియు, 3 జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్, మాలి-జి 52 ఎంసి 1 జిపియు ఉన్నాయి.

డాల్బీ డిజిటల్ ప్లస్, డిటిఎస్-హెచ్‌డితో పాటు డాల్బీ అట్మోస్ సపోర్ట్ తో రెండు 8W స్పీకర్లు ఉన్నాయి. కనెక్టివిటీ కోసం డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ వి5.0, మూడు హెచ్‌డిఎంఐ పోర్ట్‌లు, రెండు యుఎస్‌బి పోర్ట్‌లు, ఎవి పోర్ట్, ఈథర్నెట్ పోర్ట్‌తో వస్తుంది. ఇంటర్నల్ యాప్స్ స్టోర్‌ కూడా ఉంది.

టీవి సైజ్ 750x1227.50 ఎం‌ఎం, 823.11 ఎం‌ఎం ఎత్తుతో ఉంటుంది. దీని బరువు 24.96 కిలోలు. ఇది కేవలం 5.7 ఎం‌ఎం మందంతో ఉంటుంది. ట్రాన్స్పరెంట్  టీవీ కావడంతో దీనికి బ్యాక్‌లైట్ లేదు. టి‌వి వెనుక భాగంలో అన్ని పోర్టులు సులభంగా కనెక్ట్ చేసుకోవడానికి అనుమతిస్తాయి.
 
“ఎం‌ఐ టీవీ లక్స్ ట్రాన్స్పరెంట్ ఎడిషన్ టీవిని ఆఫ్ చేసినప్పుడు, ఇది ఒక గ్లాస్ లాగా కనిపిస్తుంది. టీవిలో ప్రదర్శించే చిత్రాలు గాలిలో తేలుతున్నట్లు కనిపిస్తాయి, అపూర్వమైన పిక్చర్ అనుభవాన్ని తెస్తాయి. ” అని షియోమి ఒక ప్రకటనలో తెలిపింది.

click me!