స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లావా స్పెషల్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్లు

By Sandra Ashok Kumar  |  First Published Aug 12, 2020, 10:50 AM IST

లావా జెడ్ 61 ప్రో, లావా ఎ5, లావా ఎ9 భారతదేశంలో ‘ప్రౌడ్లీ ఇండియన్’ స్పెషల్ ఎడిషన్ వేరియంట్ కింద  ఆవిష్కరించింది. ఈ లిమిటెడ్-ఎడిషన్ ఫోన్‌లు వెనుక భాగంలో #ప్రౌడ్లీ ఇండియన్ లోగో లేదా వెనుక ట్రై-కలర్ ఇండియన్ ఫ్లాగ్ కవర్‌తో తీసుకువస్తుంది.


భారతదేశ  74వ స్వాతంత్ర్య దినోత్సవా సందర్భంగా ఇండియన్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా మూడు కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. లావా జెడ్ 61 ప్రో, లావా ఎ5, లావా ఎ9 భారతదేశంలో ‘ప్రౌడ్లీ ఇండియన్’ స్పెషల్ ఎడిషన్ వేరియంట్ కింద  ఆవిష్కరించింది. ఈ లిమిటెడ్-ఎడిషన్ ఫోన్‌లు వెనుక భాగంలో #ప్రౌడ్లీ ఇండియన్ లోగో లేదా వెనుక ట్రై-కలర్ ఇండియన్ ఫ్లాగ్ కవర్‌తో తీసుకువస్తుంది.

ఈ ఏడాది జూలైలో ప్రారంభమైన లావా జెడ్ 61 ప్రో షాంపైన్ గోల్డ్ వేరియంట్లో #ప్రౌడ్లీ ఇండియన్ లోగోతో వస్తుంది, మిగతా రెండు ఫోన్‌లకు ట్రై-కలర్ ఇండియన్ ఫ్లాగ్ బ్యాక్ ప్యానెల్ తో  వస్తుంది. ఈ మూడు మోడళ్లు త్వరలో అవుట్‌లెట్‌లు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా లభిస్తాయని కంపెనీ తెలిపింది.

Latest Videos


లావా జెడ్61 ప్రో, లావా ఎ5, లావా ఎ9 ధర
లావా జెడ్61ప్రో ధర  2GB + 16GB వేరియంట్‌కు రూ.5,777, షాంపైన్ గోల్డ్ కలర్ వేరియంట్‌లో లభిస్తుంది, ముందు చెప్పినట్లుగా వెనుక భాగంలో #ప్రౌడ్లీ ఇండియన్ లోగో కూడా ఉంది. మొదట జూలై ప్రారంభంలో అంబర్ రెడ్, మిడ్ నైట్ బ్లూ అనే రెండు కలర్ వేరియంట్లలో ప్రారంభించారు, తరువాత షాంపైన్ గోల్డ్ వేరియంట్ జోడించబడింది.

లావా ఎ5, లావా ఎ9 ఫోన్లు జాతీయ రంగులతో ట్రై-కలర్ బ్యాక్ ప్యానెల్ తో లభిస్తుంది. లావా ఎ5 ధర రూ.1,333 ఉండగా, లావా ఎ9 ధర రూ. 1,574.

ఈ మూడు ఫోన్లు త్వరలో ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లైన ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయని లావా సంస్థ  తెలిపింది. లావా A5, లావా A9 ప్రౌడ్లీ ఇండియన్ వెర్షన్లు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

also read కేంద్రం అనుమతితో బిఎస్ఎన్ఎల్ తాజా నిర్ణయం.. ఇకపై ఆ ట్యూన్ వినిపించదు.. ...


లావా జెడ్61 ప్రో ఫీచర్లు
డ్యూయల్ సిమ్ లావా జెడ్ 61ప్రో 5.45-అంగుళాల హెచ్‌డి + డిస్‌ప్లే, 1.6GHz ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో 2GB RAM, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. స్టోరేజ్ మరింత విస్తరించడానికి మైక్రో ఎస్‌డి కార్డు 128GB వరకు సపోర్ట్ చేస్తుంది.

కెమెరా విషయానికొస్తే లావా జెడ్61ప్రోలో 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్స్ లో బ్లూటూత్ 4.2, వై-ఫై, జిపిఎస్, యుఎస్‌బి ఒటిజి సపోర్ట్, మైక్రో-యుఎస్‌బి పోర్ట్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ ఉన్నాయి. లావా జెడ్ 61ప్రోలో  3,100 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.


లావా A5 ఫీచర్స్ 
డ్యూయల్ సిమ్ లావా A5 లో 2.4-అంగుళాల QVGA (240x320 పిక్సెల్స్) డిస్‌ప్లే, వెనుకవైపు 0.3 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. డివైజ్ స్టోరేజ్  32GB వరకు సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో, 1,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది, మూడు రోజుల వరకు బ్యాటరీ ఉంటుందని కంపెనీ పేర్కొంది. 

లావా A9 ఫీచర్స్ 
డ్యూయల్ సిమ్ లావా ఎ9 ఫీచర్ ఫోన్, 2.8-అంగుళాల క్యూవిజిఎ (240x320 పిక్సెల్స్) డిస్‌ప్లే, వెనుకవైపు 1.3 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 4MB ర్యామ్, 32GB వరకు స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. లావా ఎ9 బ్లూటూత్ కనెక్టివిటీ, ఎఫ్ఎమ్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌తో వస్తుంది. దీనికి 1,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది, ఇది ఆరు రోజుల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. 

click me!