చైనా ఉత్పత్తులు వాడకుండా భారతదేశపు మొట్టమొదటి బ్లాక్‌చెయిన్ స్మార్ట్‌ఫోన్.. డిసెంబర్ 22న లాంచ్..

By S Ashok Kumar  |  First Published Dec 15, 2020, 2:09 PM IST

మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్ లైన్ దాదాపు అన్ని కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లపై కనిపిస్తుంది, అయితే ఈ ఫోన్లు 100% పూర్తిగా భారతదేశంలో తయారు చేయబడలేదని మీకు తెలుసు. ఎందుకంటే ఇవి భారతదేశంలో కేవలం వీడిభాగాలతో అసెంబుల్ మాత్రమే అవుతాయి. 


గత కొంత కాలం నుండి అన్ని మొబైల్ కంపెనీల స్మార్ట్‌ఫోన్లు భారతదేశంలోనే  ఉత్పత్తి అవుతున్నాయి. మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్ లైన్ దాదాపు అన్ని కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లపై కనిపిస్తుంది, అయితే ఈ ఫోన్లు 100% పూర్తిగా భారతదేశంలో తయారు చేయబడలేదని మీకు తెలుసు. ఎందుకంటే ఇవి భారతదేశంలో కేవలం వీడిభాగాలతో అసెంబుల్ మాత్రమే అవుతాయి. 

భారతదేశపు మొట్టమొదటి బ్లాక్‌చెయిన్ స్మార్ట్‌ఫోన్

Latest Videos

ఫేస్‌చెయిన్ అనే సంస్థ ఈ నెలలో భారతదేశపు మొట్టమొదటి బ్లాక్‌చెయిన్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయబోతోంది. డిసెంబర్ 22న కంపెనీ ఇన్ బ్లాక్ పేరుతో రెండు బ్లాక్‌చెయిన్ పవర్డ్ స్మార్ట్‌ఫోన్‌లను లక్నోలో లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్‌లో ఒక్క చైనా ఉత్పత్తి కూడా ఉపయోగించలేదని కంపెనీ పేర్కొంది.

అన్ని వీడిభాగాలు దుబాయ్ నుండి తీసుకోబడ్డాయి. ఈ ఫోన్లు భారత మార్కెట్లో ఉన్న చైనీస్ మొబైల్‌ ఫీచర్స్, ధరలకు పోటీని ఇవ్వనుంది. గౌతమ్ బుద్ నగర్‌లో జ్యువార్ వద్ద మొబైల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి భూమిని అందించాలని కంపెనీ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. కంపెనీ ప్లాంట్ ప్రస్తుతం సెక్టార్ -63లో నడుస్తుందని తెలిపింది.

also read 

ఇంటి వద్దనే ఫోన్ రిపేర్

ఈ ఫోన్ వినియోగదారులకు ఎలాంటి సమస్య వచ్చినా సేవా కేంద్రానికి వెళ్లవలసిన అవసరం లేదని పేర్కొంది. ఫోన్‌ను రిపేర్ చేయడానికి  సర్వీస్ బృందం మీ ఇంటి వద్దకే వస్తుంది. ఒకవేల ఫోన్ దెబ్బతిన్నట్లయితే కంపెనీ మిమ్మల్ని ఎలాంటి ప్రశ్నలు అడగకుండా కొత్త హ్యాండ్‌సెట్‌ను ఇస్తుందని కంపెనీ తెలిపింది.

ఫోన్ ఫీచర్ల గురించి కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడించలేదు, కాని హెచ్‌డి డిస్‌ప్లేతో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుందని కొందరు చెబుతున్నారు. ఇది కాకుండా భారీ బ్యాటరీ ఈ ఫోన్‌లో లభిస్తుంది. ఫోన్ ఫోటో ప్రకారం క్వాడ్ రియర్ కెమెరా సెటప్, పంచ్-హోల్ డిస్‌ప్లే ఉంటుందని చెప్పవచ్చు.

ఫోన్ లాంచ్ గురించి కంపెనీ వ్యవస్థాపకుడు దుర్గా ప్రసాద్ త్రిపాఠి మాట్లాడుతూ "భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో టాప్ 5 కంపెనీలు (89% మార్కెట్ వాటాతో) ఇండియావి కావు. భారతీయులందరికీ ఇది చాలా ఆందోళన కలిగించే విషయం.

మేము ప్రధానమంత్రి, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి స్ఫూర్తితో లోకల్ ఫర్ వోకల్ క్యాంపెయిన్ కింద దేశంలోని మొట్టమొదటి బ్లాక్‌చెయిన్ స్మార్ట్‌ఫోన్ తో మార్కెట్‌లోకి ప్రవేశించనున్నము. క్రిప్టోకరెన్సీ భాషలో బ్లాక్స్ అంటే లావాదేవీ పూర్తయినప్పుడు లావాదేవీల రికార్డుని బ్లాక్స్ అంటారు.

click me!