ట్రిపుల్ కెమెరాలు ఏర్పాటు చేసిన ఆండ్రాయిడ్ 10 ఓఎస్ పై పని చేసే నోకియా 7.2 ఫోన్ విపణిలోకి అడుగు పెట్టింది.
న్యూఢిల్లీ: హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ నుంచి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. నోకియా 7.2 పేరుతో భారత విపణిలోకి గురువారం ప్రవేశించిన ఈ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా, ప్యూర్ డిస్ ప్లే వంటి బోల్డ్ ప్రత్యేకతలున్నాయి. గూగుల్ ఆండ్రాయిడ్ వన్ ప్లాట్ ఫామ్‌పై పని చేసే ఈ ఫోన్‌కు త్వరలో ఆండ్రాయిడ్ 10 అప్ డేట్ అందనున్నది.
ఇందులో ఆల్ వేజ్ ఆన్ హెచ్డీఆర్ టెక్నాలజీతో కూడిన ప్యూర్ డిస్ ప్లే ప్యానెల్ ఉంటుంది. నోకియా 7.2 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ వేరియంట్ ధర రూ.18,599 కాగా, టాప్ ఎండ్ మోడల్ అయిన 6జీబీ ర్యామ్ విత్ 64జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,599.
రెండు రంగుల్లో లభించి నోకియా 7.2 ఫోన్ ఆఫ్ లైన్ తోపాటు ఫ్లిప్‌కార్ట్, నోకియా వెబ్ సైట్ సహా రిటైల్ అవుట్లెట్ల ద్వారా ఈ నెల 23 నుంచి అందుబాటులోకి రానుంది.
లాంచింగ్ ఆఫర్ల కింద హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డుతో ఆఫ్ లైన్ కొనుగోలుపై 10 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. జియో సబ్ స్క్రైబర్లకు రూ.7,200 విలువ చేసే ఓచర్లు లభిస్తాయి. నోకియా ఆన్ లైన్ స్టోర్లలో కొనుగోలు చేసే వారికి రూ.2000 విలువైన గిఫ్ట్ కార్డును కంపెనీ అందిస్తుంది.
ఫ్లిప్ కార్ట్‌లో హెచ్డీఎఫ్ సీ బ్యాంక్ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఈ నెల 28వ తేదీ వరకు వినియోగదారులు పొందొచ్చు. బిగ్ బిలియన్ డే సేల్ లోనూ ఈ ఫోన్ లభిస్తుంది.
నోకియా 7.2 ఫోన్ ఆండ్రాయిడ్ 9పై ఓఎస్ తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 10 అప్ డేట్ త్వరలో అందుకోనున్నది. ఆండ్రాయిడ్ వన్ ప్లాట్ ఫాంపై పని చేసే ఈ ఫోన్కు మూడేళ్ల వరకు ప్రతి నెలా సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తామని, రెండు సంవత్సరాలు ఓఎస్ అప్ డేట్స్ అందిస్తామని నోకియా చెబుతోంది.
ఇందులో 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ ప్లే, హెచ్డీఆర్ సపోర్టుతో వస్తోంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో ఆక్టాకోర్ 660 ప్రాసెసర్ తో వస్తున్న ఈ ఫోన్ లో ట్రిపుల్ కెమెరా ఉంది. 48+8+5 ఎంపీ సెన్సర్లను ఇందులో అమర్చారు.
నోకియా 7.2 ఫోన్ ఫ్రంట్ భాగంలో 20 ఎంపీ కెమెరాను అందిస్తున్నారు. గతంలో మాదిరిగానే జెసిన్ ఆప్టిక్స్ వినియోగించారు. బ్లూ టూత్ 5.0, యూఎస్బీ టైప్ – సీ, ఫింగర్ ఫ్రింట్ సెన్సర్ వంటి వసతులతో 3500 ఎంఎహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతో ఈ ఫోన్ వినియోగదారుల ముంగిట్లోకి వస్తుంది.