అతిపెద్ద 7000mAh బ్యాటరీతో మొట్టమొదటి శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. తక్కువ ధరకే..

By Sandra Ashok Kumar  |  First Published Sep 11, 2020, 11:44 AM IST

పోకో ఎక్స్ 2, వన్‌ప్లస్ నార్డ్, ఇటీవల ప్రారంభించిన రియల్‌మీ 7 ప్రో వంటి వాటికి పోటీగా శాంసంగ్ గెలాక్సీ ఎం51ను ఆవిష్కరించింది. కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే ఇందులోని 7000 ఎంఏహెచ్ భారీగా బ్యాటరీ. 


స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ ఎం-సిరీస్‌లో  మిడ్-రేంజ్  కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.  పోకో ఎక్స్ 2, వన్‌ప్లస్ నార్డ్, ఇటీవల ప్రారంభించిన రియల్‌మీ 7 ప్రో వంటి వాటికి పోటీగా శాంసంగ్ గెలాక్సీ ఎం51ను ఆవిష్కరించింది.

కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే ఇందులోని 7000 ఎంఏహెచ్ భారీగా బ్యాటరీ. ఇండియాలో 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే అని శాంసంగ్ కంపెనీ పేర్కొంది.

Latest Videos

శాంసంగ్ గెలాక్సీ ఎం51 ధర, అమ్మకపు వివరాలు

కొత్త శాంసంగ్ గెలాక్సీ ఎం51 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6 జిబి ర్యామ్, 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధరను దక్షిణ కొరియా కంపెనీ రూ. 24,999గా నిర్ణయించింది. రెండవ వేరియంట్ 8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ ధర రూ.26,999. సెప్టెంబర్ 18న నుండి అమెజాన్.ఇన్, శాంసంగ్ .కంలో అందుబాటులో ఉంటుంది.

అమెజాన్.ఇన్‌లో లాంచ్ ఆఫర్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. హెచ్‌డి‌ఎఫ్‌సి క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించే వినియోగదారులు గెలాక్సీ ఎం51 ను కొనుగోలు చేసేటప్పుడు ఈ‌ఎం‌ఐ, నాన్- ఈ‌ఎం‌ఐలపై రూ. 2,000 ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. 

also  read 

ప్రాసెసర్: గెలాక్సీ ఎం51 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జి ఆక్టా-కోర్ సిపియు, 2.2 GHz చిప్‌సెట్ కొత్త గెలాక్సీ ఎం51ను అత్యంత శక్తివంతమైన ఎం సిరీస్ స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తుంది. స్నాప్‌ డ్రాగన్ 730జిలోని క్వాల్కమ్ అడ్రినో 618 జిపియు స్నాప్‌డ్రాగన్ 730 తో పోలిస్తే 15% వేగంగా గ్రాఫిక్స్ రెండరింగ్‌ను అందిస్తుంది.


కెమెరా: శాంసంగ్ గెలాక్సీ ఎం51 క్వాడ్-కెమెరా సెటప్‌ను, 64ఎం‌పి సోనీ IMX 682 మెయిన్ కెమెరా, 12ఎం‌పి అల్ట్రా-వైడ్ లెన్స్ 123-డిగ్రీల వ్యూ, 5 ఎంపి మాక్రో లెన్స్, పోర్ట్రెయిట్ షాట్ల కోసం 5ఎం‌పి కెమెరా ఉన్నాయి. ముందుభాగంలో 32 ఎంపి కెమెరాను అందించింది, 4కె వీడియో రికార్డింగ్ మరియు స్లో-మోషన్ సెల్ఫీలకు కూడా సపోర్ట్ ఇస్తుంది.


డిస్ ప్లే: గెలాక్సీ ఎం51లో 6.7-అంగుళాల ఎస్ఆమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ పంచ్ హోల్‌ డిస్‌ప్లేతో వస్తుంది. శాంసంగ్ ప్రకారం గెలాక్సీ ఎం51 లోని ఎస్ఆమోలెడ్ ప్లస్ డిస్ ప్లే 13% అధిక సన్నగా ఉంటుంది. భారీ 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నప్పటికీ గెలాక్సీ ఎం51 బరువు కేవలం 213 గ్రాములు మాత్రమే.

బ్యాటరీ: గెలాక్సీ ఎం51లో 7000mAh బ్యాటరీ ఇన్-బాక్స్ టైప్ C 25W ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తుంది. ఛార్జర్ 2 గంటలలోపు ఫుల్ ఛార్జ్ చేయగలదని శామ్‌సంగ్ పేర్కొంది. గెలాక్సీ ఎం51 లో రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది. టైప్ సి కేబుల్ తో వస్తుంది.
 

click me!