ఆదరణ తగ్గిపోవడంతో వింటేజ్ జాబితాలో ఆపిల్ ఐపాడ్ నానో..

By Sandra Ashok Kumar  |  First Published Sep 4, 2020, 1:59 PM IST

వింటేజ్ ఉత్పత్తులు ఐదు కంటే ఎక్కువ లేదా ఏడు సంవత్సరాల వరకు విక్రయానికి నోచుకోని పరికరాలు. ఉత్పత్తులు ఏడు సంవత్సరాల మార్కును దాటిన తర్వాత, అవి వాడుకలో లేనివిగా పరిగణిస్తాయి. ఆపిల్ 2015 మధ్యలో 7వ తరం ఐపాడ్ నానో రిఫ్రెష్ వెర్షన్‌ను విడుదల చేసింది. 


అమెరికన్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ 7వ తరం ఐపాడ్ నానోను ఈ నెల చివరిలో పాతకాలపు లేదా వాడుకలో లేని ఉత్పత్తుల జాబితాలో చేర్చబోతోందని మాక్‌రూమర్స్ నివేదించింది.

ఇది ఐకానిక్ నానో లైనప్‌లోని చివరి ఐపాడ్‌. వింటేజ్ ఉత్పత్తులు ఐదు కంటే ఎక్కువ లేదా ఏడు సంవత్సరాల వరకు విక్రయానికి నోచుకోని పరికరాలు. ఉత్పత్తులు ఏడు సంవత్సరాల మార్కును దాటిన తర్వాత, అవి వాడుకలో లేనివిగా పరిగణిస్తాయి.

Latest Videos

ఆపిల్ 2015 మధ్యలో 7వ తరం ఐపాడ్ నానో రిఫ్రెష్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఆపిల్ తయారు చేసిన చివరి ఐపాడ్ నానో ఆదరణ తగ్గిపోవడంతో విక్రయాలు  పడిపోయాయి. దీంతో ఇప్పుడు దీనిని పాతకాలపు జాబితాలో చేర్చనుంది.

ఆపిల్ మొట్టమొదటి ఐపాడ్ నానోను సెప్టెంబర్ 2005లో లాంచ్ చేసింది. మొట్టమొదటి ఐపాడ్ నానో స్టాండర్డ్ మోడల్ ఐపాడ్ మీ జేబులో బాగా సరిపోయేలా రూపొందించారు. 2వ తరం ఐపాడ్ నానో చిన్నది, ప్రకాశవంతమైన అల్యూమినియం కలర్లలో వచ్చింది.

also read 

దీని డిజైన్ ఫస్ట్ జనరేషన్ మోడల్ లాగా ఉంది. 3వ తరం ఐపాడ్ నానోను "నానో ఫ్యాటీ" అని పిలుస్తారు, దాని విస్తృత, స్క్వాట్ డిజైన్‌కు ఆపిల్ ఈ సిరీస్‌లో చేసిన మొదటి ముఖ్యమైన డిజైన్ మార్పు. 4వ తరం ఐపాడ్ నానోతో ఆపిల్ పరికరాన్ని చిన్నదిగా చేసింది.

ఆపిల్ 2010లో 6వ-జెన్ ఐపాడ్ నానో డిజైన్ లో మార్పు చేసింది. ఐపానిక్ క్లిక్ వీల్ ఆల్-స్క్రీన్ లుక్‌తో భర్తీ చేసింది, ఐపాడ్ నానో ఆపిల్ వాచ్ లాగా కనిపిస్తుంది. ఈ లైనప్ లాస్ట్ మోడల్ అయిన 7వ తరం ఐపాడ్ నానో అక్టోబర్ 2012లో ప్రారంభించింది.

ఈ ఐపాడ్ మల్టీ-టచ్ డిస్ ప్లే, హోమ్ బటన్‌తో లాంచ్ చేసింది. ఆపిల్ 7వ-జెన్ ఐపాడ్ నానో  2015లో రిఫ్రెష్ వెర్షన్‌ వచ్చింది, అయితే ఇది కలర్ పరంగా మాత్రమే వచ్చింది కానీ డిజైన్ మాత్రం అలాగే ఉంది. 2017 మధ్యలో ఐపాడ్ నానో నిలిపివేసింది. ఐపాడ్ టచ్‌ను ఆపిల్ ఇప్పటికీ విక్రయిస్తున్న ఏకైక ఐపాడ్‌ మోడల్ గా మిగిలిపోయింది.

 వింటేజ్ ఉత్పత్తులు అంటే ఏంటి ?
ఐదుకంటే ఎక్కువ, లేదా ఏడు సంవత్సరాల వరకు విక్రయానికి నోచుకోని ఉత్పత్తులను వింటేజ్ ఉత్పత్తులుగా లెక్కిస్తారు. ఏడు సంవత్సరాలు దాటిన తర్వాత, అవి వాడుకలో లేనివిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలోనే ఆపిల్ ఐపాడ్ నానో వింటేజ్ జాబితాలో చేరనుందని మాక్‌రూమర్స్ అంచనా వేసింది.
 

click me!