అతిపెద్ద భారీ 7040mAh బ్యాటరీతో సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్..

By Sandra Ashok KumarFirst Published Sep 29, 2020, 7:13 PM IST
Highlights

శామ్సంగ్ ఎ7 ట్యాబ్ 10.4-అంగుళాల డిస్ తో వస్తుంది. దీనిని మూడు కలర్ వేరియంట్లలో విడుదల చేశారు. శామ్సంగ్ గెలాక్సీ టాబ్ ఎ7 వై-ఫై, ఎల్‌టి‌ఈ వేరియంట్లలో లభిస్తుంది.

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శామ్సంగ్ కొత్త గెలాక్సీ టాబ్ ఎ7ను భారత మార్కెట్లో విడుదల చేసింది. శామ్సంగ్ ఎ7 ట్యాబ్ 10.4-అంగుళాల డిస్ తో వస్తుంది. దీనిని మూడు కలర్ వేరియంట్లలో విడుదల చేశారు.

శామ్సంగ్ గెలాక్సీ టాబ్ ఎ7 వై-ఫై, ఎల్‌టి‌ఈ వేరియంట్లలో లభిస్తుంది. గెలాక్సీ టాబ్ ఎ7లో అతిపెద్ద భారీ 7040mAh బ్యాటరీ ఉంది. శామ్సంగ్ గెలాక్సీ టాబ్ ఎ7  వై-ఫై వేరియంట్ ధర రూ .17,999, ఎల్‌టిఇ వేరియంట్‌ ధర రూ .21,999.

ఈ టాబ్ గ్రే, గోల్డ్, సిల్వర్ కలర్ వేరియంట్లలో వస్తుంది. ఈ ట్యాబ్ ప్రీ బుకింగ్ ప్రారంభమయ్యాయి, కానీ సెల్ తేదీ ప్రస్తుతానికి వెల్లడించలేదు. ప్రీ-బుకింగ్ ద్వారా కస్టమర్లు ఈ టాబ్‌తో కీబోర్డ్ కవర్‌ను రూ .1,875 కు కొనుగోలు చేయవచ్చు, దీని అసలు ధర రూ .4,499. 

also read 

గెలాక్సీ టాబ్ ఎ7లో ఆండ్రాయిడ్ 10 బేస్డ్ వన్ యుఐ 2.5తో పనిచేస్తుంది. ఇది కాకుండా 10.x- అంగుళాల WUXGA + TFT డిస్ ప్లే,  2000x1200 పిక్సెల్స్ రిజల్యూషన్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ ఈ ట్యాబ్‌లో అందించారు. 3 జీబీ ర్యామ్‌తో 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, అదనంగా మెమరీ కార్డ్ సహాయంతో 1 టిబి వరకు పెంచుకోవచ్చు. 

కెమెరా గురించి మాట్లాడుతూ 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, ఫుల్ హెచ్‌డి వీడియో రికార్డ్ చేయగలదు. 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. కనెక్టివిటీ కోసం వై-ఫై, ఎల్‌టిఇ, బ్లూటూత్ 5.0, జిపిఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. 

click me!