ఇది “ప్రపంచంలో మొట్టమొదటి ఎస్‌ఎల్‌ఈడి 4కే స్మార్ట్ టీవీ” అని రియల్‌మీ తెలిపింది. 4కే రిజల్యూషన్‌తో 55 అంగుళాల స్మార్ట్ టివిగా రానుంది. బ్లాగ్ పోస్ట్ ప్రకారం ఈ స్మార్ట్ టివి కంటి సంరక్షణతో పాటు అధిక కలర్ ఆక్యురసీ అందిస్తుంది.
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ త్వరలో ఎస్‌ఎల్‌ఈడి 4కే స్మార్ట్ టీవీని భారతదేశంలో ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ బ్లాగ్ పోస్ట్ ద్వారా సూచించింది. ఇది “ప్రపంచంలో మొట్టమొదటి ఎస్‌ఎల్‌ఈడి 4కే స్మార్ట్ టీవీ” అని రియల్‌మీ తెలిపింది.
4కే రిజల్యూషన్‌తో 55 అంగుళాల స్మార్ట్ టివిగా రానుంది. బ్లాగ్ పోస్ట్ ప్రకారం ఈ స్మార్ట్ టివి కంటి సంరక్షణతో పాటు అధిక కలర్ ఆక్యురసీ అందిస్తుంది. ఈ ఎస్‌ఎల్‌ఇడి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఎస్‌పిడి టెక్నాలజీ చీఫ్ సైంటిస్ట్ జాన్ రూయిమన్స్‌తో కలిసి రియల్‌మీ పనిచేసింది.
undefined
ఈ ఎస్‌ఎల్‌ఇడి 4కె స్మార్ట్ టివి 55 అంగుళాల స్క్రీన్ సైజులో వస్తుందని, దీనికి టియువి రీన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ తో పాటు ఎస్‌ఎల్‌ఈడి స్మార్ట్ టివి స్టాండర్డ్ ఎల్‌ఈడి లేదా కొన్ని ఇతర క్యూఎల్‌ఈడి టివిల కంటే చాలా మంచిదని కంపెనీ పేర్కొంది.
also read
క్లియర్ పిక్చర్ అనుభవం కోసం స్మార్ట్ టీవీకి మరిన్ని రంగులను అందించడానికి సహాయపడుతుంది. రియల్‌మీ ఎస్‌ఎల్‌ఇడి 4కె స్మార్ట్ టీవీ ఆర్‌జిబి బ్యాక్‌లైటింగ్‌ను ఉపయోగిస్తుంది, ఇది బ్లూ లైట్ హానికరమైన ప్రభావాలను తగ్గించడమే కాక, అధిక రంగు స్వచ్ఛతను కూడా అందిస్తుంది అని కంపెనీ తెలిపింది.
స్మార్ట్ టీవీ టియువి రైన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్‌ను కూడా పొందింది. ఈ సర్టిఫికేషన్ సాధించిన ఒఎల్‌ఇడి టివిలు కాకుండా ఎస్‌ఎల్‌ఇడి డిస్ ప్లే టెక్నాలజీ మాత్రమే అని రియల్‌మీ పేర్కొంది. రియల్‌మీ ఎస్‌ఎల్‌ఇడి 4కె స్మార్ట్ టీవీ ఇతర స్పెసిఫికేషన్ల పై ఎలాంటి సమాచారం వెల్లడించలేదు అలాగే దాని ఎప్పుడు ఆవిష్కరిస్తారో కూడా ఖచ్చితంగా చెప్పలేదు.
ప్రస్తుతం రియల్‌మీ 43 అంగుళాలు, 32 అంగుళాల స్మార్ట్ టీవీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ టీవీలు ఎల్‌ఈడీ డిస్‌ప్లేలతో, ఆండ్రాయిడ్ ద్వారా పని చేస్తాయి. రాబోయే రియల్‌మీ ఎస్‌ఎల్‌ఈడి 4కె స్మార్ట్ టీవీ కూడా ఆండ్రాయిడ్‌లో రన్ అయ్యే అవకాశం ఉంది.