నోకియా కొత్త ఫీచర్ ఫోన్..ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే చాలు..

By Sandra Ashok Kumar  |  First Published Jun 12, 2020, 9:36 PM IST

 నోకియా పేరు వింటేనే అత్యధిక బాటరీ బ్యాక్ అప్ ఇచ్చే ఫోన్స్ గుర్తొస్తాయి. అయితే స్మార్ట్ ఫోన్స్ వినియోగం పెరుగుతున్న సమయంలో నోకియాకి పోటీగా ఇతర సంస్థలు వచ్చాయి. దీంతో మెల్లి మెల్లిగా బేసిక్, ఫీచర్  మోడల్ ఫోన్స్ తయారిని ఆపేసింది. 


నోకియా ఈ పేరు మీకు బాగా గుర్తుండే ఉంటుంది. మొబైల్స్ తయారీలో అగ్రగామిగా ఒకప్పుడు మంచి పేరు పొందిన సంస్థ. కొన్ని సంవత్సరాల కిందట నోకియా ఎన్నో బేసిక్, ఫీచర్ మోడల్ తో పాటు స్మార్ట్ ఫోన్స్ ని వినియోదారులకు అందించింది.

నోకియా పేరు వింటేనే అత్యధిక బాటరీ బ్యాక్ అప్ ఇచ్చే ఫోన్స్ గుర్తొస్తాయి. అయితే స్మార్ట్ ఫోన్స్ వినియోగం పెరుగుతున్న సమయంలో నోకియాకి పోటీగా ఇతర సంస్థలు వచ్చాయి. దీంతో మెల్లి మెల్లిగా బేసిక్, ఫీచర్  మోడల్ ఫోన్స్ తయారిని ఆపేసింది. 

Latest Videos

తాజాగా ఇప్పుడు మళ్ళీ నోకియా బేసిక్ మోడల్ ఫోన్ తో మళ్ళీ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశిస్తుంది. నోకియా సంస్థ మళ్లీ భారత్‌లో సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం ఫీచర్‌ ఫోన్లపై దృష్టి సారిస్తోంది. అలాంటి వాటిలో నోకియా ఎక్స్‌ప్రెస్ 5310 ఫోన్ ఒకటి.

అప్పట్లో మ్యూజిక్ లవర్స్‌ని బాగా ఆకర్షించిన మోడల్ ఇది. నోకియా 5310 ఫోన్ జూన్ 16 న భారతదేశంలో లాంచ్ అవుతున్నట్లు తెలిపింది. అంటే ఈ ఫీచర్ ఫోన్ మరో నాలుగు రోజుల్లో లాంచ్ కానుందని తాజాగా ట్వీట్ ద్వారా పేర్కొంది. ఈ ఫోన్ ఇప్పటికే మార్చిలో ఆవిష్కరించింది.

2007లో ప్రవేశపెట్టిన క్లాసిక్ రెట్రో నోకియా 5310 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ ఫోన్ కి ఇది రిఫ్రెష్ వెర్షన్. కొత్త నోకియా 5310 ప్రత్యేకమైన మల్టీ కలర్ డిజైన్, ప్లేబ్యాక్ కంట్రోల్ తో వస్తుంది.

also read ఫేస్ బుక్, ఇన్స్తగ్రామ్ కి పోటీగా ట్విట్టర్ సరికొత్త ఫీచర్ ...

నోకియా మొబైల్స్ ఇండియా ట్విట్టర్ ద్వారా కొత్త టీజర్‌ను విడుదల చేసింది. అందులో నోకియా 5310 ప్రారంభ తేదీని వెల్లడించింది. జూన్ 16 లాంచ్‌ తేదీని  సూచిస్తూ ఫీచర్ ఫోన్‌ను మరో ‘నాలుగు రోజుల్లో’ ఆవిష్కరిస్తామని టీజర్ ద్వారా పేర్కొంది.

హెచ్‌ఎండి గ్లోబల్ కూడా కంపెనీ వెబ్‌సైట్‌లో ఫోన్ కోసం రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించింది. నోకియా 5310  ఫోన్ వైట్ / రెడ్ / బ్లాక్ / రెడ్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. దీని టెక్నికల్ వివరాలు ఇప్పటికే మీకు తెలుసు. ఫీచర్ ఫోన్ అయిన నోకియా సిరీస్ 30+ సాఫ్ట్‌వేర్‌ తో నడుస్తుంది.

2.4-అంగుళాల క్యూవిజిఎ కలర్ డిస్ప్లే, డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్లు, ఫిజికల్ కీప్యాడ్‌తో వస్తుంది. దీనికి  8ఎం‌బి ర్యామ్, 16ఎం‌బి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా 32జి‌బి వరకు సపోర్ట్ చేస్తుంది.

అలాగే దీనికి ఒక్కసారి ఫుల్లు ఛార్జింగ్ పెడితే దాదాపు 22 నుంచి 30 రోజుల వరకూ వస్తుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. నోకియా 5310 వెనుక భాగంలో ఫ్లాష్ వి‌జి‌ఏ కెమెరా, 1,200ఎం‌ఏ‌హెచ్ బ్యాటరీ, 30 రోజుల స్టాండ్ బై టైమ్ అందిస్తుంది. ఎం‌పి3 ప్లేయర్, ఎఫ్‌ఎం రేడియో వంటి ఫీచర్స్ ఉన్నాయి.

click me!