Redmi 300W ఛార్జింగ్ టెక్నాలజీతో క్షణాల్లో స్మార్ట్ ఫోన్ ఫుల్ చార్జ్ అయ్యే అవకాశం..

Published : Mar 01, 2023, 01:32 AM ISTUpdated : Mar 01, 2023, 01:35 AM IST
Redmi 300W ఛార్జింగ్ టెక్నాలజీతో క్షణాల్లో స్మార్ట్ ఫోన్ ఫుల్ చార్జ్ అయ్యే అవకాశం..

సారాంశం

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) రెండవ రోజున, Redmi 300W ఛార్జింగ్ టెక్నాలజీని ప్రకటించింది, ఇది Redmi Note 12 Pro Plus ఫోన్ ను కేవలం 5 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేస్తామని ప్రకటించింది.

స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలోనూ ఏదైనా ప్రాబ్లం ఉందంటే అది చార్జింగ్ అనేది చెప్పాలి. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ సామర్థ్యం పెరిగే కొద్దీ బ్యాటరీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దీంతో చార్జింగ్ అయిపోయి మీకు అవసరమైనప్పుడు ఫోన్ పని చేయకుండా స్విచ్ ఆఫ్ అయిపోతుంది.  ఈ సమస్యను గుర్తించి చాలా వరకు స్మార్ట్ ఫోన్ కంపెనీలు ప్రస్తుతం బ్యాటరీ లైఫ్ మీదనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎక్కువ సేపు చార్జింగ్ అందించే బ్యాటరీలపై కంపెనీలన్ని ఫోకస్ పెడుతున్నాయి. అంతేకాదు హైస్పీడ్ చార్జింగ్ టెక్నాలజీ మీద కూడా దృష్టి సారిస్తున్నాయి. అయితే ఇప్పటికే  రియల్ మీ కంపెనీ కేవలం తొమ్మిది నిమిషాల 30 సెకండ్లలో ఫుల్ చార్జింగ్ హామీ ఇవ్వగా, Redmi Note 12 Pro Plus ఏకంగా 300W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఫోన్ విడుడల చేస్తోంది. దీంతో ఫోన్ కేవలం 5 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్ అవుతుంది. 

Realme మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC 2023)లో Realme GT3 స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. కొత్త Realme GT3 240W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీంతో 9 నిమిషాల 30 సెకన్లలో ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. Realme ప్రకారం, ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఛార్జింగ్ అవుతున్న స్మార్ట్‌ఫోన్ ఇదే అని ప్రకటించింది. 

అనూహ్యంగా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) రెండో రోజే  Redmi 300W ఛార్జింగ్ టెక్నాలజీ ప్రకటనతో, టెక్ ప్రపంచం ఆశ్చర్యపోయింది ఇది Redmi Note 12 Pro Plus ఫోన్ ను కేవలం 5 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేస్తామని ప్రకటించింది. పాపులర్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వీబోలో వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ప్రకారం, Redmi 300W వైర్డ్ ఛార్జర్ ఫోన్‌ను 1 శాతం నుండి 10 శాతానికి ఛార్జ్ చేయడానికి కేవలం 43 సెకన్లు పడుతుంది. అదే సమయంలో, ఫోన్ 2 నిమిషాల 13 సెకన్లలో 1 నుండి 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. 

 

ఈ వీడియోను చూస్తే, ఫోన్ 290W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4100mAh బ్యాటరీని ప్యాక్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే, కొత్త ఛార్జింగ్ టెక్నాలజీకి సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇప్పుడు 300W ఛార్జింగ్ టెక్నాలజీ బ్యాటరీ ఆరోగ్యాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుందో చూద్దాం.

మరోవైపు ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా ఫోన్ హెల్త్ చాలా వరకు పాడవుతుందని బ్యాటరీ త్వరగా డిఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  కానీ కంపెనీ ఫాస్ట్ చార్జింగ్ హామీలను అందిస్తున్నాయి. వీలైనంత త్వరగా చార్జింగ్ కెపాసిటీ పెంచాలని ప్రయత్నాలు చేస్తున్నాయి మరి భవిష్యత్తులో ఇంకేం పరిణామాలు వస్తాయో వేచి చూడాల్సిందే. 
 

PREV
click me!

Recommended Stories

మీ ఫోన్ లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..? అయితే వాట్సాప్ హ్యాక్ అయినట్లే, ఈ టైమ్ లో ఏం చేయాలి?
Realme C85 5G: అర గంట నీటిలో ఉన్నా ఈ ఫోన్‌కి ఏం కాదు.. ఇంత త‌క్కువ ధ‌ర‌లో ఈ ఫీచ‌ర్లేంటీ భ‌య్యా