డ్యూయల్ స్క్రీన్ తో మైక్రోసాఫ్ట్ కొత్త స్మార్ట్ ఫోన్.. సెప్టెంబర్ 10 నుండి ప్రీ బుకింగ్‌..

By Sandra Ashok Kumar  |  First Published Aug 14, 2020, 12:58 PM IST

యుఎస్ కంపెనీ ఆపిల్ ఐఫోన్ 12 ను లాంచ్ చేసే సమయంలోనే  మైక్రోసాఫ్ట్ సర్ఫేస్‌ డుయో విడుదల చేయాలని చేస్తుంది. యు.ఎస్ కొనుగోలుదారుల కోసం ప్రీ ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సర్ఫేస్ డుయో అనేది రెండు స్క్రీన్లతో మడత ఫోన్. 


టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సెప్టెంబర్ 10న సర్ఫేస్‌ డుయో స్మార్ట్‌ఫోన్ త్వరలో అందుబాటులో రానున్నది.  దీని ధర  1,399 డాలర్లు. నాలుగు సంవత్సరాల తరువాత, యుఎస్ కంపెనీ ఆపిల్ ఐఫోన్ 12 ను లాంచ్ చేసే సమయంలోనే  మైక్రోసాఫ్ట్ సర్ఫేస్‌ డుయో విడుదల చేయాలని చేస్తుంది.

యు.ఎస్ కొనుగోలుదారుల కోసం ప్రీ ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సర్ఫేస్ డుయో అనేది రెండు స్క్రీన్లతో మడత ఫోన్. స్మార్ట్ ఫోన్స్ లాగా కాల్స్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు, కానీ డబుల్ స్క్రీన్డ్ టాబ్లెట్ లాగా పనిచేస్తుంది.

Latest Videos

ఈ  ఫోన్ గూగుల్ ఆండ్రయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఎల్‌ఈ‌డి డిస్ ప్లేతో రెండు 5.6-అంగుళాల స్క్రిన్స్ ఉంటాయి. మైక్రోసాఫ్ట్ టాబ్లెట్ల కోసం రూపొందించిన స్టైలస్ పెన్నుతో కూడా ఫోన్ ఆపరేట్ చేయవచ్చు. శామ్సంగ్, హువావే అభివృద్ధి చేస్తున్న ఫోల్డబుల్ ఫోన్‌లగా కాకుండా, మైక్రోసాఫ్ట్ డ్యూయల్ స్క్రీన్ డిజైన్‌ ప్రేవేశపెడుతుంది.

దీనికి 5జి నెట్ వర్క్  కనెక్టివిటీ ఉండదు, అయితే శామ్‌సంగ్ గెలాక్సీ  జెడ్ ఫోల్డ్ 2 కన్నా ఎక్కువ ధర ఉంటుంది. మైక్రోసాఫ్ట్ డుయోను మరింత ఉపయోగకరంగా తీసుకొస్తుంది ఎందుకంటే వినియోగదారులను ఒకేసారి రెండు వేర్వేరు యాప్స్ లేదా వెబ్ పేజీలతో మల్టీ టాస్క్ చేయడానికి అనుమతిస్తుంది.

4ఉదాహరణకు ఒక స్క్రీన్ అమెజాన్ కిండ్ల్ యాప్‌లో బుక్స్ చదవడానికి  మరొక స్క్రీన్‌ పై నోట్స్ తీసుకోవడానికి ఉపయోగిస్తుంది. 6జి‌బి ర్యామ్, క్వాల్కమ్ 855 స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ తో వస్తుంది. నోకియా  మొబైల్ విభాగాన్ని కొనుగోలు చేయడానికి ఒక దురదృష్టకరమైన ప్రయత్నం.

స్మార్ట్‌ఫోన్‌లను నిర్మించే ప్రయత్నాలను విస్తరించడానికి 5.4 బిలియన్  ఖర్చు చేసింది. కానీ ఈ ప్రయత్నం విఫలమైంది. మైక్రోసాఫ్ట్ గత అక్టోబర్లో కొత్త డ్యూయోను ప్రకటించింది. మైక్రోసాఫ్ట్  చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పనోస్ పనాయ్ రెండు మానిటర్లను ఉపయోగించినట్లే, రెండు విభిన్న స్క్రీన్‌లు ఉండటం వలన రెండు యాప్స్  ఒకేసారి ఓపెన్ చేయడానికి అనుమతిస్తుంది

కాబట్టి మీరు త్వరగా పనులు చేయవచ్చు అని అన్నారు. దక్షిణ కొరియా సంస్థ  మొబైల్ ఫోన్‌, విండోస్ పిసిల కోసం శామ్‌సంగ్‌తో ఒప్పందాలను ఇటీవల ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్‌లలో వీడియో గేమ్‌లను ప్రసారం చేయడానికి ఎక్స్‌క్లౌడ్ అనే యాప్ ప్రారంభిస్తోంది.

ఆర్ధిక మంధ్యం, కరోనా వైరస్ మహమ్మారి  మైక్రోసాఫ్ట్ విలువైన ఆవిష్కరణల కోసం ఎంత మంది వినియోగదారులు కొనేందుకు సిద్ధంగా ఉన్నారో చూడాలి. ఈ వేసవిలో శామ్‌సంగ్ టాప్-ఆఫ్-ది-లైన్ కొత్త గెలాక్సీ ఫోన్‌లను కూడా ఆవిష్కరించింది,

దీని ధర సుమారు  1,000 డాలర్ల నుండి 1,300 డాలర్ల వరకు ఉంటుంది. గూగుల్ చవకైన పిక్సెల్ ఫోన్‌ను దాదాపు 350డాలర్లకు విడుదల చేస్తోంది.

click me!