రియల్‌మీ సి15ను ఈ ఏడాది జూలైలో తొలిసారిగా లాంచ్ చేశారు, అయితే అంతకుముందు వేరియంట్లలో మీడియాటెక్ ప్రాసెసర్ అందించారు, కానీ ఇప్పుడు దీనిని క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్‌తో లాంచ్ చేశారు.
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ సి 15 క్వాల్కమ్ ఎడిషన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. రియల్‌మీ సి15ను ఈ ఏడాది జూలైలో తొలిసారిగా లాంచ్ చేశారు, అయితే అంతకుముందు వేరియంట్లలో మీడియాటెక్ ప్రాసెసర్ అందించారు, కానీ ఇప్పుడు దీనిని క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్‌తో లాంచ్ చేశారు.
ఫీచర్స్ సంబంధించి ఎటువంటి మార్పులు చేయలేదు. క్వాల్కమ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
undefined
రియల్‌మీ సి15 క్వాల్కమ్ ఎడిషన్ ధర
రియల్‌మీ సి 15 క్వాల్కమ్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.9,999. దీనికి 3 జీబీ ర్యామ్‌తో 32 జీబీ స్టోరేజ్ లభిస్తుంది. అలాగే 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .10,999. క్వాల్‌కామ్ ఎడిషన్‌కు మీడియాటెక్ హెలియో ప్రాసెసర్ వేరియంట్ కంటే రూ.500 ధర ఎక్కువ.
కొత్త రియల్‌మీ సి 15 క్వాల్కమ్ ఎడిషన్ సేల్స్ అక్టోబర్ 29 నుండి అంటే నేటి నుంచి ఫ్లిప్‌కార్ట్, అన్ని రిటైల్ స్టోర్స్, రియల్‌మీ వెబ్‌సైట్ ద్వారా ప్రారంభమవుతుంది. లాంచింగ్ ఆఫర్ కింద కొత్త ఎడిషన్ రెండు వేరియంట్లను రూ.500 తగ్గింపు ధరతో వరుసగా బేస్ వెరీఎంట్ ను రూ.9,499, అలాగే 4జిబి వెరీఎంట్ ను రూ.10,499 కొనుగోలు చేయవచ్చు.
also read
రియల్‌మీ సి15 స్పెసిఫికేషన్లు
రియల్‌మీ సి15లో డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో ఆండ్రాయిడ్ 10 బేస్డ్ రియల్‌మీ యుఐ తో వస్తుంది. ఇది కాకుండా గొరిల్లా గ్లాస్ రక్షణతో ఫోన్ 6.5-అంగుళాల మినీ డ్రాప్ డిస్ ప్లే, మీడియాటెక్ ఆక్టాకోర్ హెలియో జి35 ప్రాసెసర్ ఫోన్‌లో అందించార. బేస్ వెరీఎంట్ కాకుండా 4 జీబీ ర్యామ్ కూడా లభిస్తుంది.
రియల్‌మీ సి15 కెమెరా
కెమెరా గురించి చెప్పాలంటే రియల్‌మీ సి15లో నాలుగు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, ప్రధాన కెమెరా 13 మెగాపిక్సెల్స్, రెండవడి 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ కెమెరా, మూడవది 2 మెగాపిక్సెల్స్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ కెమెరా, నాలుగవడి 2 మెగాపిక్సెల్స్ మాక్రో లెన్స్ కెమెరా, సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ లెన్స్ కెమెరా ఉన్నాయి.
రియల్‌మీ సి 15 బ్యాటరీ
కనెక్టివిటీ కోసం ఫోన్‌లో వై-ఫై 802.11 బి/ఎన్, బ్లూటూత్ వి5.0, 4జి, జిపిఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వెనుక ప్యానెల్‌కి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందించారు.