కొత్త డిజైన్, డ్యూయల్ స్క్రీన్ యాక్సెసరీతో వస్తున్న ఎల్‌జీ వెల్వెట్ కంపెనీ మొట్టమొదటి ఫోన్. బ్యాక్ కెమెరాలపై వాటర్ డ్రాప్ నాచ్, స్లీక్ బాడీ డిజైన్ తో వస్తుంది.
సౌత్‌కొరియా టెక్ కంపెనీ ఎల్‌జి సరికొత్త స్మార్ట్ ఫోన్ నేడు ఇండియాలో లాంచ్ చేసింది. కొత్త డిజైన్, డ్యూయల్ స్క్రీన్ యాక్సెసరీతో వస్తున్న ఎల్‌జీ వెల్వెట్ కంపెనీ మొట్టమొదటి ఫోన్.
బ్యాక్ కెమెరాలపై వాటర్ డ్రాప్ నాచ్, స్లీక్ బాడీ డిజైన్ తో వస్తుంది. ముఖ్యంగా ఎల్‌జీ వెల్వెట్ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ స్క్రీన్ యాక్సెసరీతో అందుబాటులోకి వచ్చింది.
ఎల్‌జీ వెల్వెట్ స్మార్ట్‌ఫోన్ టాప్ వేరియంట్‌లో స్నాప్‌డ్రాగన్ 765 జి బదులు రెండు సంవత్సరాల క్రితంనాటి స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఎల్‌జీ వెల్వెట్ 5జి వేరియంట్ స్మార్ట్ ఫోన్ భారత్‌లో లాంచ్ చేయలేదు.
also read ఫేస్‌బుక్ ఇండియా పాలసీ హెడ్ అంఖిదాస్ రాజీనామా.. ...
భారతదేశంలో ఎల్‌జీ వెల్వెట్ ధర
ఎల్‌జీ వెల్వెట్ ధర రూ.36,990 అయితే మీకు డ్యూయల్ స్క్రీన్ కావాలంటే రూ .49,990 చెల్లించాల్సి ఉంటుంది. ఎల్‌జీ వెల్వెట్ అక్టోబర్ 30 నుండి అన్ని ప్రముఖ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైలర్లలో అందుబాటులోకి వస్తుంది. ఎల్‌జీ వెల్వెట్ బ్లాక్, అరోరా సిల్వర్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.
ఎల్‌జీ వెల్వెట్ ఫీచర్స్
ఎల్‌జీ వెల్వెట్ 6.8-అంగుళాల పోల్డ్ 1080p స్క్రీన్, 6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్‌తో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం అడ్రినో 630 జిపియూ, ఆండ్రాయిడ్ 10 ఎల్‌జీ యుఎక్స్ 9 ఓఎస్ తో నడుపుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫోటోగ్రఫీ కోసం వెనుక మూడు కెమెరాలు అందించారు.
48ఎంపి ప్రాధమిక కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 5ఎంపి డీప్-సెన్సింగ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఎల్‌జీ వెల్వెట్ డిస్ప్లేలో 16ఎంపి కెమెరా ఇచ్చారు. సౌండ్ కోసం స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. 15W ఫాస్ట్ ఛార్జింగ్, 9W వైర్‌లెస్ ఛార్జింగ్ తో 4300mAh బ్యాటరీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.